పేదలకు తీపిలేని ఉగాది! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » పేదలకు తీపిలేని ఉగాది!

పేదలకు తీపిలేని ఉగాది!

Written By ysrcongress on Friday, March 2, 2012 | 3/02/2012

* అదనపు చక్కెర కే కాదు.. అసలుకే ఎసరు
* రేషన్ షాపులకు చేరని మార్చి నెల కోటా
* కేంద్రం, మిల్లర్ల మధ్య ధర వివాదం.. చక్కెర సరఫరా బంద్
* అధికారులు హెచ్చరించినా పట్టించుకోని రాష్ట్ర సర్కారు
* అరకొర నిల్వలతో సంక్షోభం

హైదరాబాద్, న్యూస్‌లైన్: తెలుగువారి కొత్త సంవత్సరం ఉగాదికి.. రాష్ట్ర సర్కారు పేదలకు ‘తీపి’ని దూరం చేసి చేదునే మిగల్చనుంది. ఉగాది పండుగకు అదనపు చక్కెర ఇవ్వడం ఆనవాయితీ. అయితే ఈసారి అదనపు చక్కెరకే కాదు.. అసలు చ క్కెరకే ప్రభుత్వం ఎసరు పెట్టింది. సర్కారు నిర్లక్ష్యం పండుగ నెలలో పేదలకు చక్కెర దక్కకుండా చేసింది. మార్చి నెలకు తెల్లకార్డుదారులకు ఇవ్వాల్సిన చక్కెర కోటా ఇప్పటికీ రేషన్‌షాపులకు చేరలేదు. చక్కెర కోసం రేషన్ డీలర్లు డీడీలు కట్టేందుకు ప్రయత్నించినా మార్చిలో చక్కెర ఇచ్చే పరిస్థితి లేదంటూ పౌర సరఫరాల అధికారులు తెగేసి చెప్పారు. దీంతో డీలర్లు ఈ నెల చక్కెర కోటా ఇవ్వలేమని చేతులెత్తేస్తున్నారు. దీంతో రాష్ట్రంలోని సుమారు 2 కోట్ల తెల్లకార్డు కుటుంబాలకు రేషన్ చక్కెర దక్కని పరిస్థితి నెలకొంది. 

వాస్తవానికి మార్చి కోటా చక్కెర సరఫరాకు ఇబ్బందులెదురయ్యే అవకాశం ఉందని పౌర సరఫరాల సంస్థ రెండువారాల క్రితమే రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. సమస్య తీవ్రమైనదైనా ముఖ్యమంత్రి గానీ, పౌర సరఫరాల మంత్రిగానీ చొరవ ప్రదర్శించకుండా నిర్లక్ష్యం వహించారు. దీంతో రాష్ట్రంలో రేషన్ చక్కెర సరఫరా మార్చిలోనే కాదు ఆ తర్వాతైనా మళ్లీ ఎప్పట్నుంచి మొదలవుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. ప్రజా పంపిణీ వ్యవస్థ(పీడీఎస్)లో భాగంగా తెల్ల కార్డుదారులకు కేంద్ర ప్రభుత్వం రాయితీపై ప్రతినెలా అర కిలో చక్కెర ఇస్తోంది. 

బహిరంగమార్కెట్‌లో ధర ఎంత ఉన్నా... తెల్లకార్డుదారులకు మాత్రం రూ.13.50కే అర కిలో చక్కెర ఇస్తోంది. బహిరంగ మార్కెట్‌లో ప్రస్తుతం చక్కెర ధర కిలో రూ.32గా ఉండగా మిగతాది రాయితీ కింద కేంద్రం భరిస్తోంది. రాష్ట్రంలోని తెల్లకార్డుదారుల కోసం కేంద్రం ప్రతి నెల 11,059 టన్నుల చక్కెరను కేటాయిస్తుండగా రాష్ట్ర ప్రభుత్వం 9690 టన్నులనే పేదలకు పంపిణీ చేస్తోంది. కేంద్రం ఆదేశాల మేరకు జాతీయ చక్కెర డెరైక్టరేట్ అన్ని రాష్ట్రాలకు కోటాను విడుదల చేస్తుంటుంది. ఆయా రాష్ట్రాల్లోని మిల్లుల నుంచి చక్కెర సరఫరా అవుతుంది. 

సీజన్లవారీ ఉత్పత్తి ఆధారంగా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటకల్లోని చక్కెర మిల్లుల నుంచి మన రాష్ట్రంలోని రేషన్ అవసరాలకు చక్కెర సరఫరా చేస్తారు. దీని కోసం నెల ముందుగానే మిల్లులకు ఇండెంట్లు పెట్టాల్సి ఉంటుంది. ఈ విధంగా ఫిబ్రవరి వరకు కేటాయింపులు, సరఫరా సజావుగానే సాగింది. మార్చికి సంబంధించి సరఫరా చేయాల్సిన చక్కెరకు 2009-10 నాటి ధరలను ఇస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్పడంతో.. తమ వద్ద ఉన్నది ఇటీవల ఉత్పత్తి చేసిన చక్కెర కాబట్టి ప్రస్తుత మార్కెట్ ధరే ఇవ్వాలని మిల్లులు పట్టుబట్టాయి. ధరల విషయంలో స్పష్టత కొరవడటంతో మార్చి అవసరాల కోసం రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ పెట్టిన ఇండెంట్లను మిల్లులు తిరస్కరించాయి. దీంతో పౌరసరఫరాల సంస్థ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. వెంటనే కేంద్రంతో మాట్లాడి సంక్షోభ నివారణకు కృషి చేయాల్సిన ప్రభుత్వ పెద్దలు నిర్లక్ష్యం వహించారు. 

ఈ నేపథ్యంలో మార్చిలో చక్కెర సరఫరా చేయలేని పరిస్థితి నెలకొనడంతో చక్కెర కోటా కోసం రేషన్ డీలర్లు ఇచ్చే డీడీలను తీసుకోవద్దని పౌర సరఫరాల శాఖ అన్ని జిల్లాల అధికారులను ఆదేశించింది. ఈ ఆదేశాలు చేరేలోపే కొందరు డీలర్ల డీడీలను అధికారులు స్వీకరించారు. కేంద్రం కేటాయింపుతో పోల్చితే రాష్ట్రం సరఫరా చేస్తున్న చక్కెర కోటా తక్కువ ఉంటుండడంతో ప్రతి నెలా దాదాపు 1369 టన్నుల చక్కెర మిగులుతోంది. ఈ విధంగా ఏడాదిగా పోగైన నిల్వలను ఇప్పటికే డీడీలు కట్టించుకున్న డీలర్లకు పౌర సరఫరాల సంస్థ పంపిణీ చేస్తోంది. ఈ నిల్వలు ఏ కొద్దిమందికో సరిపోయే అవకాశముండగా.. ఉగాదిలోగా (23వ తేదీ) అందరికీ చక్కెర అందే సూచనలు కన్పించడం లేదు.
Share this article :

0 comments: