రెఫరెండంగా భావించలేని ఆ రెండు పార్టీలు పోటీ నుంచి తప్పుకొని పరువు కాపాడుకోవాలని - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రెఫరెండంగా భావించలేని ఆ రెండు పార్టీలు పోటీ నుంచి తప్పుకొని పరువు కాపాడుకోవాలని

రెఫరెండంగా భావించలేని ఆ రెండు పార్టీలు పోటీ నుంచి తప్పుకొని పరువు కాపాడుకోవాలని

Written By ysrcongress on Friday, March 9, 2012 | 3/09/2012

హైదరాబాద్, న్యూస్‌లైన్: ప్రజల మద్దతుతో ఎదుగుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని విమర్శించే అర్హత ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి లేదని ఆ పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్ర రావు పేర్కొన్నారు. పైరవీల ద్వారా పదవులు పొందినవారికి జగన్‌ను విమర్శించే స్థాయి లేదన్నారు. గురువారం ఆయన పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కోవూరు ఉప ఎన్నిక దగ్గరపడుతున్నకొద్దీ జంట పక్షులు కిరణ్, ప్రతిపక్షనేత చంద్రబాబులు కుట్రలు, కుతంత్రాలతో జగన్‌పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, జగన్‌ను అప్రతిష్టపాలు చేసి ఎన్నికల్లో మెజార్టీ తగ్గించాలనే కుటిలనీతికి పాల్పడుతున్నారని మండిపడ్డారు.

రాష్ట్రంలో ప్రస్తుత ఉప ఎన్నికలను రెఫరెండంగా భావించ డానికి వెనకడుగు వేస్తున్న కిరణ్- చంద్రబాబుల దీనస్థితిని అర్థం చేసుకోవచ్చన్నారు. రెఫరెండంగా భావించలేని ఆ రెండు పార్టీలు పోటీ నుంచి తప్పుకొని పరువు కాపాడుకోవాలని సూచించారు. సొంత రాష్ట్రంగా భావించే యూపీలోనే సోనియా, రాహుల్‌లు తెల్లమొహం వేశారని గట్టు ఎద్దేవా చేశారు. చంద్రబాబుకు రాజకీయంగా కాలం చెల్లిందని, ఆయన్ని ప్రజలు నమ్మే పరిస్థితి లేదని స్పష్టం చేశారు. యూపీ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ సైకిల్ గుర్తుతో గెలిచింది.. ఇక్కడా సైకిల్ హవా కొనసాగుతుందని బాబు చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. యూపీలో ములాయం సొంతగా పార్టీ పెట్టుకున్నారని, బాబు మాదిరిగా మామను వెన్నుపోటు పొడిచి పార్టీని, గుర్తును లాక్కోలేదని ఎద్దేవా చేశారు.

యూపీలో ప్రజలు అవినీతిని తరిమికొట్టారని బాబు చెబుతున్నట్టుగా... తెలుగు ప్రజలు ఆ పని 2004లోనే చేశారని, బాబు చేసిన అవినీతికి ఇప్పటికే రెండుసార్లు ఛీకొట్టారని అన్నారు. బాబు ఇంట్లో రెండు గదులు ఎప్పుడూ తెరవర నే ఆరోపణ ఉందని, అవి ఎందుకు తెరవడం లేదో, అందులో ఏముందో చెప్పగలరా? అని ఆయన ఈ సందర్భంగా ప్రశ్నించారు. జాతీయస్థాయిలో థర్డ్‌ఫ్రంట్ అంటున్న చంద్రబాబు పరిస్థితి ఉట్టికెగరలేనమ్మ నింగికెగిరినట్లుందని గట్టు ఎద్దేవా చేశారు.
Share this article :

0 comments: