వచ్చేనెలలో జగన్ రామచంద్రాపురం పర్యటన - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వచ్చేనెలలో జగన్ రామచంద్రాపురం పర్యటన

వచ్చేనెలలో జగన్ రామచంద్రాపురం పర్యటన

Written By news on Monday, March 19, 2012 | 3/19/2012

 తూర్పుగోదావరి జిల్లాలోఉప ఎన్నిక జరగనున్న రామచంద్రపురం నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఏప్రిల్ మొదటి వారంలో పర్యటించనున్నట్టు పార్టీ కార్యనిర్వాహక మండలి(సీఈసీ) సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ తెలిపారు. కాజులూరు మండలంలోని నామవానిపాలెంలో ఈ రోజు ‘గడప గడపకు వైఎస్సార్ కాంగ్రెస్’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బోస్ విలేకరులతో మాట్లాడుతూ జగన్ ఈ నెల 30 నుంచి ఏప్రిల్ 4 వరకు పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం, పోలవరం నియోజకవర్గాల్లో పర్యటిస్తారన్నారు. అక్కడ నుంచి తూర్పుగోదావరి జిల్లా చేరుకుని 5, 6, 7 తేదీల్లో రామచంద్రపురం నియోజకవర్గంలోని రామచంద్రపురం, కె. గంగవరం, కాజులూరు మండల గ్రామాల్లో రోడ్డు షోలను నిర్వహిస్తారని తెలిపారు. 
Share this article :

0 comments: