బొల్లాపల్లిలో పర్యటించిన తొలి రాష్ట్రనేత.మావోల కోటలో జగన్‌కు బ్రహ్మరథం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » బొల్లాపల్లిలో పర్యటించిన తొలి రాష్ట్రనేత.మావోల కోటలో జగన్‌కు బ్రహ్మరథం

బొల్లాపల్లిలో పర్యటించిన తొలి రాష్ట్రనేత.మావోల కోటలో జగన్‌కు బ్రహ్మరథం

Written By ysrcongress on Friday, March 2, 2012 | 3/02/2012

సంప్రదాయ నృత్యాలతో సుగాలీలు స్వాగతం
ప్రజలతో మమేకమైన జగన్
బొల్లాపల్లిలో పర్యటించిన తొలి రాష్ట్రనేత

న్యూస్‌లైన్ ప్రతినిధి, గుంటూరు: నిత్యం తుపాకీ పేలుడు మోతలు.. రోడ్లకు రెండువైపులా దట్టమైన నల్లమల అటవీప్రాంతం.. అక్కడక్కడ సుగాలీతండాలు... మావోయిస్టులకు, పోలీసులకు నిత్యం ప్రచ్ఛన్న యుద్ధం జరిగే ప్రాంతం అది. అటువైపు కన్నెత్తి చూడాలంటే సాధారణ మంత్రి మొదలుకొని, ప్రతి రాజకీయ పార్టీ నేతకూ భయమే. భద్రతాకారణాలు, ఇతర సాకులతో ఆ మండలం వైపు ఏ ఒక్కరూ కన్నెత్తి చూసిన దాఖలాలు గడిచిన రెండు దశాబ్దాలుగా లేవు. అలాంటి ప్రాంతంలో జననేత జగన్ పర్యటించారు. అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పలికి జగన్‌ను అక్కున చేర్చుకున్నారు. మావోయిస్టుల కంచుకోటగా రాష్ట్రంలోనే పేరొందిన వినుకొండ నియోజకవర్గంలోని బొల్లాపల్లి మండలంలో జగన్‌మోహన్‌రెడ్డి ఓదార్పు యాత్ర ద్వారా విస్తృతస్థాయిలో పర్యటించారు. 

షెడ్యూల్‌లో లేనప్పటికీ, భద్రతా కారణాలతో ఒకట్రెండు గ్రామాలు పర్యటనలో లేనప్పటికీ ప్రజాభిమానమే మిన్నగా భావించి జననేత జగన్ పర్యటించారు. దీంతో జగన్‌కు సుగాలీలు తండాల్లో సంప్రదాయ నృత్యాలతో స్వాగతం పలికి గ్రామగ్రామాన దివంగత మహానేత వైఎస్సార్ విగ్రహాలను ఏర్పాటు చేసి పట్టుపట్టిన అభిమానంతో జగన్‌తో ఆవిష్కరింప చేశారు.

మూడేళ్ల క్రితం వరకు మావోయిస్టులకు బొల్లాపల్లి మండలం కంచుకోటగా వెలుగొందింది. మావోయిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి మొదలుకొని, ఇతర ముఖ్యనేతలంతా కీలక సంబంధాలు నడిపే ప్రాంతంగాను, మావోయిస్టులకు షెల్టర్‌జోన్‌గాను ఈ మండలం ఉండేది. పదుల సంఖ్యలో పోలీసు, మావోయిస్టుల ప్రాణాలు ఇక్కడ ప్రత్యక్ష యుద్ధంలో గాలిలో కలిసిపోయాయి. అలాంటి ప్రాంతమైన బొల్లాపల్లి అంటే ప్రతి ఒక్కరికి భయమే. వీటన్నింటికి అతీతంగా జనాభిమానమే మిన్నగా జననేత జగన్ పర్యటించారు. తద్వారా బొల్లాపల్లి మండలంలో విస్తృతస్థాయిలో పర్యటించిన మొదటి రాష్ట్రనేతగా గుర్తింపు పొందడంతో పాటు బొల్లాపల్లి ప్రజల మనసుల్లో చెదరని గూడు కట్టుకున్నారు. 

గుంటూరు జిల్లాలో మావోయిస్టు కార్యాకలాపాలు ఉధృతంగా ఉన్న రోజుల్లో నిత్యం ఈ మండలంలో ఏదోక చోట ఘటన చోటు చేసుకోవడం పరిపాటిగా ఉండేది. ప్రధానంగా మండలంలోని గరికపాడు, రేమిడిచర్ల, గుమ్మనంపాడు, పమిడిపాడు గ్రామాలు, గ్రామ శివారుల్లోని నల్లమల అటవీప్రాంతంలో మావోయిస్టు కార్యకలాపాలు అధికంగా ఉండేవి. 2003లో పమిడిపాడు గ్రామం వద్ద మావోయిస్టు ముఖ్యనేత లక్ష్మయ్యతో పాటు ముగ్గురిని పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. ఈ ఎన్‌కౌంటర్‌తో మావో, పోలీసుల మధ్య యుద్ధవాతావరణం ముదిరింది. 

నాటి నుంచి నేటి వరకు మండలం శివారులోని నల్లమల అటవీప్రాంతంలో పోలీసులు మావోయిస్టుల కోసం నిరంతరం కూంబింగ్ ప్రక్రియ సాగిస్తూనే ఉన్నారు. అలాగే ఇదే గ్రామంలో 2009లో మావోయిస్టు కీలకనేతగా పనిచేసిన మీసాల ప్రభాకర్‌ను కూడా పోలీసులు ఎన్‌కౌంటర్‌లో హతమార్చారు. ఆ తరువాత రావులాపురం సమీపంలోని మన్నేపల్లితండా వద్ద 2007లో మావోయిస్టు రాష్ట్ర నాయకులు టెక్‌శ్రీనును ఎన్‌కౌంటర్ చేశారు. అలాగే బొల్లాపల్లి సమీపంలో మావోయిస్టు రాష్ట్ర కార్యదర్శిగా పనిచేసిన శాఖమూరి అప్పారావును పోలీసులు కూంబింగ్ సమాచారం మేరకు గుర్తించి ఎన్‌కౌంటర్ చేశారు. 

జిల్లాలో అప్పారావుదే చివరి ఎన్‌కౌంటర్ అంతకు ముందు లత, కౌముది అనే మావోయిస్టు రాష్ట్ర నాయకులను వెంకటరెడ్డిపురం తండా వద్ద 2007 సంవత్సరంలో ఎన్‌కౌంటర్‌లో హతమార్చారు. అలాగే బొల్లాపల్లి దగ్గర వేణు, మాధవ్ అనే ఇద్దరు నేతల్ని హతమార్చారు. నల్లమల అటవీప్రాంతం కేంద్రంగా చేసుకొని పనిచేసే మావోయిస్టులను పెద్ద ఎత్తున వరుస ఎన్‌కౌంటర్లలో పోలీసులు హతమార్చారు. దీని ప్రతీకారచర్యగా మావోయిస్టులు కూడా అదేరీతిలో పోలీసులపై కాల్పులు, మందుపాతరలతో చంపిన ఘటనలు ఇక్కడ అనేకం ఉన్నాయి. 

1998లో రేమిడిచర్ల వద్ద కల్వర్టర్ కింద మందుపాతరను మావోయిస్టులు పేల్చిన ఘటనలో ఎస్‌ఐ తోట వెంకటేశ్వర్లుతో సహా ఎనిమిదిమంది పోలీసులు చనిపోయారు. ఆ సమయంలో అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబునాయుడు, హోంమంత్రి దేవేంద్రగౌడ్‌లు నేరుగా హెలికాఫ్టర్‌లో ఘటనా స్థలానికి వచ్చి సంఘటనా స్థలాన్ని భారీ బందోబస్తు నడుమ పరిశీలించి మళ్లీ అదే హెలికాఫ్టర్‌లో తిరిగి పయనమయ్యారు. ఆ తరువాత కూంబింగ్ నిర్వహిస్తున్న ఏఆర్ కానిస్టేబుల్‌ను మావోయిస్టులు అదే ప్రాంతంలో హతమార్చారు. ఆ తరువాత రేమిడిచర్లలోని రావులాపురం వద్ద సీఐ రామకోటేశ్వరరావును లక్ష్యంగా చేసుకొని క్లైమర్‌మైన్స్ పేల్చారు. ఎస్‌ఐ తృటిలో తప్పించుకున్నారు. అలాగే గుమ్మనంపాడు గ్రామంలో ఎక్స్ ఎంపీపీ వాసుదేవరెడ్డి ఇంటిని బాంబులతో పేల్చివేశారు. 

ఆ తరువాత బొల్లాపల్లి ఎంపీపీ తుమ్మారామిరెడ్డిని వినుకొండలో మావోయిస్టులు కాల్చిచంపారు. న్యాయవాది రవి, అచ్చిరెడ్డి, పమిడిపాడు కోటిరెడ్డి ఇలా ముగ్గురిని వేర్వేరు ఘటనల్లో గుమ్మనంపాడు గ్రామం వద్ద మావోయిస్టులు హతమార్చారు. బోడిపాలెం వద్ద జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు సుగాలీలు, మావోయిస్టులు హతమయ్యారు. ఇలా నిత్యం కాల్పుల మోత, మారణకాండ జరిగే ఈ మండలంలో కొన్నేళ్ళ నుంచి మావోయిస్టుల కార్యకలాపాలు పూర్తిగా నిర్వీర్యమయ్యాయి. పోలీసుల వరుస ఎన్‌కౌంటర్లతో దాదాపుగా మావోయిస్టులు అధిక శాతం మంది హతమయ్యారు. ఇలాంటి ఉద్రిక్త వాతావరణాలకు పేరైన బొల్లాపల్లి మండలం అంటే నేటికీ హైసెక్యూరిటీ జోన్‌గానే పరిగణిస్తుంటారు. దీంతో సెక్యూరిటీ కేటగిరిలో ఉన్న ప్రముఖులు, రాజకీయ నేతలు ఎవరూ ఈ ప్రాంతంలో పర్యటించరు. అభివృద్ధి పనులు, ప్రారంభాలు సైతం మంత్రులే పూర్తి చేస్తుంటారే తప్ప, ముఖ్యమంత్రి, ప్రతిపక్షపార్టీ నేత ఇలా ఎవరూ వచ్చిన దాఖలాలు ఇక్కడ లేవు. మావో కారణాలు చూపి రాజకీయంగా నిరాదరణకు గురిచేసిన బొల్లాపల్లి మండలాన్ని జగన్ అక్కున చేర్చుకున్నారు. 

మహానేతపై అభిమానం... 
సంక్షేమ పథకాలతో ప్రతిక్కరికి ప్రత్యక్షంగా లబ్ధిచేకూర్చిన దివంగత మహానేతను ప్రజలు గుండెల్లో నిలుపుకున్నారు. మండలంలో 21 విగ్రహాలను ఏర్పాటు చేశారు. ఓదార్పు యాత్రలో భాగంగా బుధవారం బొల్లాపల్లి మండలంలో పర్యటించిన జగన్ ఏడు విగ్రహాలను ఆవిష్కరించారు. గరికపాడు గ్రామంలో మూడు దివంగత వైఎస్సార్ విగ్రహాలను, గుమ్మనంపాడులో ఒకటి, రేమిడిచర్లలో రెండు, బొల్లాపల్లిలో ఒక విగ్రహాన్ని ఆవిష్కరించారు. షెడ్యూల్‌లో లేనప్పటికీ గురువారం ప్రజలు కాన్వాయ్‌ను అడ్డగించి పట్టుపట్టిన అభిమానంతో గ్రామాల్లో పర్యటించాలని కోరడంతో మళ్లీ బొల్లాపల్లి మండలంలోనే పర్యటించారు. సంగినీడుపాలెంలో ఒక విగ్రహం, నాయుడుపాలెంలో ఒకటి, సరికొండపాలెం ఒకటి, వెల్లటూరు ఒకటి, వడ్డెంగుంట ఒకటి, పేర్లపాడు ఒకటి విగ్రహాలను ఆవిష్కరించి తరలివచ్చిన అశేష జనసందోహాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. మొత్తం మీద మావోల కంచుకోటలో జననేతకు జగన్‌కు అడుగడుగునా జననీరాజనాలు పట్టారు.
Share this article :

0 comments: