పార్టీ ఓడిపోతే మీరేం చేస్తారో స్పష్టంగా చెప్పండి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » పార్టీ ఓడిపోతే మీరేం చేస్తారో స్పష్టంగా చెప్పండి

పార్టీ ఓడిపోతే మీరేం చేస్తారో స్పష్టంగా చెప్పండి

Written By news on Wednesday, March 7, 2012 | 3/07/2012

‘‘రాష్ట్రంలో జరిగే ఉప ఎన్నికలకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణలు బాధ్యత వహిస్తామంటున్నారు. అంటే ఆ బాధ్యత ఏ విధంగా ఉంటుందో ప్రజలకు అర్థమయ్యేలా వివరణ ఇవ్వండి. పార్టీ ఓడిపోతే మీరేం చేస్తారో స్పష్టంగా చెప్పండి’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ డిమాండ్ చేశారు. అధికార. ప్రతిపక్షం పనితీరుకు అద్దం పట్టే ఈ ఎన్నికలను కాంగ్రెస్-టీడీపీలు రెండు కూడా రెఫరెండంలా భావించాలని డిమాండ్ చేశారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. 


ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ నేతలకు దిమ్మతిరిగి నోట్లో నుంచి మాట రావడం లేదని ఎద్దేవా చేశారు. ‘రెండేళ్లలో వచ్చే సాధారణ ఎన్నికలకు ముందే వస్తున్న ఈ ఉప ఎన్నికలు ప్రభుత్వ పనితీరుకు రెఫరెండంగా భావించాలి. ఈ ఎన్నికలను సీఎంగా కిరణ్, పీసీసీ చీఫ్‌గా తామే బాధ్యత వహిస్తామని బొత్స అంటున్నారు. వీరిద్దరూ బాధ్యతకు సరైన వివరణ ఇవ్వాల్సి ఉంది. కాంగ్రెస్ నేతలు రాజకీయ గురువుగా భావిస్తున్న దిగ్విజయ్ సింగ్ మధ్యప్రదేశ్ సీఎంగా ఉన్నప్పుడు 2003లో ఆ రాష్ట్ర సాధారణ ఎన్నికలొచ్చాయి. వాటికి తానే బాధ్యత వహిస్తానని చెప్పారు. బాధ్యతంటే అది ఏ విధంగా ఉంటుందని అప్పట్లో మీడియా ప్రశ్నించగా, పదేళ్లపాటు ఎలాంటి పదవులు తీసుకోనని శపథం చేశారు. దానికి కట్టుబడి ఇప్పటిదాకా ఆయన పార్టీ పదవులు తప్పితే ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ పదవులకు ఆయన పోటీపడలేదు. అదే విధంగా ప్రస్తుతం కిరణ్, బొత్సలు కూడా ఏం చేస్తారో స్పష్టం చేయండి’ అని పద్మ నిలదీశారు. 

ప్రత్తి ఎగుమతి నిషేదం ఎత్తేయాలి

అంతర్జాతీయంగా ప్రత్తి ఎగుమతికి కేంద్రం విధించిన నిషేధాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పట్టింది. ఆ నిషేధాన్ని వెంటనే ఎత్తివేయాలని వాసిరెడ్డి పద్మ డిమాండ్ చేశారు. ఎగుమతులున్నప్పుడే ప్రత్తికి గిట్టుబాటు ధర లభిస్తుందన్నారు. లేకపోతే రైతులు తీవ్ర నష్టాలను చవిచూడాల్సి వస్తుందన్నారు. నిషేధం విధిస్తే వారి పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డ చందంలా తయారవుతుందన్నారు. ఎగుమతుల నిషేధం కేంద్ర వ్యవసాయశాఖ మంత్రికి తెలియకుండా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంలో ఉన్న మతలబేంటని ప్రశ్నించారు. గోధుమ, చక్కెరల మాదిరిగా ప్రత్తి విషయంలో కూడా కేబినేట్ సబ్‌కమిటీ చర్చిస్తే బాగుండేదని పద్మ అభిప్రాయపడ్డారు. రైతుల విషయంలో కేంద్ర ప్రభుత్వం మొదటి నుంచి పద్దతి, ప్రణాళిక లేకుండా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు రైతుల విషయంలో కనీస జాగ్రత్తలు వహించాలని ఆమె హితవు పలికారు.
Share this article :

0 comments: