జగన్ పేరు, ఫొటో లేనిదే.. ‘ఈనాడు’ అమ్ముడుపోదా? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జగన్ పేరు, ఫొటో లేనిదే.. ‘ఈనాడు’ అమ్ముడుపోదా?

జగన్ పేరు, ఫొటో లేనిదే.. ‘ఈనాడు’ అమ్ముడుపోదా?

Written By ysrcongress on Friday, March 9, 2012 | 3/09/2012

జగన్‌పై ప్రతిరోజూ అవాస్తవ కథనాలతో ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారు
రోజూ జగన్‌ను విమర్శించే బదులు.. ఫలానా పార్టీకి ఓటేయండని నేరుగా చెప్పేయండి

హైదరాబాద్, న్యూస్‌లైన్: ‘‘ఈనాడు పత్రిక అధినేత రామోజీరావు.. ప్రతిరోజూ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై అవాస్తవ కథనాలు ప్రచురిస్తున్నారు. జగన్ పేరుతో ఉన్న బ్యానర్ కథనం లేకుండా ఈనాడు పత్రికను బయటకు తెచ్చే పరిస్థితే లేనట్లుంది. ఏ రోజైనా బ్యానర్ ఐటమ్‌లో జగన్‌మోహన్‌రెడ్డి పేరు లేదంటే ఇది ‘ఈనాడు’ పత్రిక కాదే మో అనే అనుమానం వచ్చే పరిస్థితి సృష్టిస్తున్నారు. జగన్ పేరుగాని, ఆయన ఫొటోగాని వేసుకోకపోతే మీ పత్రిక అమ్ముడుపోవడం లేదా?’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యనిర్వాహక మండలి(సీఈసీ) సభ్యురాలు శోభానాగిరెడ్డి.. రామోజీరావును ప్రశ్నిం చారు. గురువారం ఆమె ‘సాక్షి’ టీవీతో మాట్లాడుతూ రామోజీరావుపై, చంద్రబాబుపై నిప్పులు చెరిగారు.

మీ సంస్థల్లో పెట్టుబడులపై నోరెత్తరేం?: ‘సాక్షి’ పెట్టుబడులపై అసత్య కథనాలు వండివార్చుతున్న రామోజీ తన సంస్థల్లో అక్రమ పెట్టుబడులపై నోరెత్తరేమని శోభానాగిరెడ్డి నిలదీశారు. ‘వంద రూపాయల ముఖ విలువ చేసే ‘ఈనాడు’ షేరును రిలయన్స్ సంస్థ రూ.5 లక్షలకుపైగా వెచ్చించి ఎందుకు కొనుగోలు చేసిందో ప్రజలకు వివరించగలుగుతారా? మీరు ఏది చేసినా న్యాయమైన వ్యాపార మా?.. ఇతరులు ఏం చేసినా అన్యాయమా?’ అని ప్రశ్నించారు. అవినీతి కేసుల్లో కోర్టుకెళ్లి స్టే తెచ్చుకున్న రామోజీకి.. తనపై వచ్చిన ఆరోపణల మీద దర్యాప్తు జరిపించుకునే ధైర్యం ఉందా అని ఆమె నిలదీశారు. ధైర్యం ఉంటే జగన్‌మోహన్‌రెడ్డిని రాజకీయంగా ఎదుర్కోవాలని, అంతే తప్ప చేతిలో పత్రిక ఉందని పాఠకులను మభ్యపెట్టే విధంగా వార్తలు రాయడం సరైంది కాదని అన్నారు. ‘జగన్‌పై అనునిత్యం అసత్య వార్తలు ఎందుకు రాస్తున్నారు? మీరేమైనా రాజ కీయ పార్టీ పెట్టుకున్నారా?’ అని రామోజీరావును సూటిగా ప్రశ్నిం చారు. జగన్‌ను విమర్శించే బదులు.. బయటకొచ్చి ఫలానా పార్టీకి ఓటేయండని ప్రజలకు చెబితే మీ పత్రికపై ఓ స్పష్టత వస్తుందన్నారు.

బాబు స్థాయేంటో అర్థమవుతోంది..: తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు ‘సాక్షి’ పేపరు చదవొద్దని, ‘సాక్షి టీవీ’ చూడొద్దని చెప్పడాన్ని బట్టి ఆయన స్థాయేంటో ప్రజలకు అర్థమవుతోందని శోభానాగిరెడ్డి ఎద్దేవా చేశారు. ‘‘ఈరోజు జగన్‌మోహన్‌రెడ్డి ధైర్యంగా పత్రిక పెట్టుకున్నారు.. పార్టీ పెట్టుకున్నారు. మీరు కూడా ‘ఈనాడు’లో నా పెట్టుబడులు ఇన్ని ఉన్నాయి.. ఈ పత్రిక నాది అని బయటకొచ్చి చెప్పండి’ అని చంద్రబాబుకు సూచించారు.

ఆ రోజులు పోయాయి రామోజీ..: ‘‘మీడియాను అడ్డం పెట్టుకుని ఇన్ని సంవత్సరాలూ రాజకీయంగా చక్రం తిప్పారు. ఇప్పుడు ఆ రోజులు పోయాయి’’ అని శోభానాగిరెడ్డి అన్నారు. మొన్న కడప పార్లమెంటు ఉప ఎన్నికల సమయంలో ఇష్టమొచ్చినట్లు కథనాలు రాసి ప్రజలను ప్రభావితం చేయాలని రామోజీ ప్రయత్నించారని గుర్తుచేశారు. ‘‘కడప ఉప ఎన్నికల సందర్భంగా రామోజీ ఎన్ని కట్టుకథలు రాశారో తెలుగు ప్రజలకు ఇప్పటికీ గుర్తుంది. ఒక రోజు జగన్ ఓటర్లను డబ్బుతో కొనేశారని రాశారు. ఇంకోసారి జగన్ డబ్బులు తీయకపోవడం వల్ల నాయకుల్లో నిర్లిప్తత, నిరుత్సాహం వచ్చిందన్నారు. చివరకు ఓటర్లను, లీడర్లను ఆఖరికి అధికారులను జగన్ కొనేశారని పిచ్చి రాతలు రాశారు. కడప పార్లమెంటు పరిధిలోని 6 అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీకే పట్టుందని ఇంకోసారి రాశారు. ఎన్నికల తర్వాత ఆ ఆరు నియోజకవర్గాల్లో టీడీపీకి డిపాజిట్ కూడా దక్కలేదు. రామోజీరావుగారు ఇప్పటికైనా వాస్తవానికి దగ్గరగా వార్తలు రాయండి’’ అని శోభానాగిరెడ్డి సూచించారు.

కోవూరు ఫలితాలు చూసైనా మారాలని కోరుకుంటున్నా..

మీరు ఏది రాసినా ప్రజలు నమ్ముతారన్న భ్రమతో వార్తలు రాయొద్దని శోభానాగి రెడ్డి.. రామోజీకి హితవు పలికారు. ‘కోవూరులో చంద్రబాబు ప్రచారానికిగాను రిలయన్స్ కంపెనీ బాగా డబ్బులు పం పిం దని బయట అనుకుం టున్నారు. రాష్ట్ర ఎన్నికలకూ బాబుకు అక్కడి నుంచే డబ్బులు వస్తుం టాయని చెప్పుకొంటున్నారు. దానికేం చెప్తారు మీరు? కోవూరు ఫలితా ల తర్వాతైనా మీ ఆలోచనా ధోరణిలో మార్పు రావాలని ప్రజలు, మేం కోరుకుంటున్నాం’ అని అన్నారు.

16న హైదరాబాద్‌లో ‘బీసీ మహాగర్జన’

హైదరాబాద్, న్యూస్‌లైన్: బీసీలకు చట్లసభల్లో 55 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్‌తో ఈనెల 16వ తేదీన రాష్ట్ర స్థాయి బీసీ మహా గర్జన నిర్వహిస్తున్నట్లు బీసీ సంక్షేమ సంఘం రాష్ర్ట అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య తెలిపారు. హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో ఉదయం 10 గంటలకు మహా గర్జన ప్రారంభమవుతుందని గురువారమిక్కడ చెప్పారు.

మహిళా బిల్లులో బీసీలకు ఉపకోటా ఇవ్వాలి

మహిళా రిజర్వేషన్ల బిల్లులో బీసీలకు సబ్‌కోటా కల్పించకుంటే లక్షలమంది బీసీ మహిళలతో పార్లమెంటును ముట్టడిస్తామని కృష్ణయ్య హెచ్చరించారు. మహిళా దినోత్సవం సందర్భంగా బీసీ సంక్షేమసంఘం మహిళా విభాగం ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో కృష్ణయ్య మాట్లాడారు.
Share this article :

0 comments: