రైల్వే బడ్జెట్ ముఖ్యాంశాలు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రైల్వే బడ్జెట్ ముఖ్యాంశాలు

రైల్వే బడ్జెట్ ముఖ్యాంశాలు

Written By news on Wednesday, March 14, 2012 | 3/14/2012

2012-13 సంవత్సరానికిగానూ కేంద్ర రైల్వే మంత్రి దినేష్ త్రివేది ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్ ముఖ్యాంశాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.
రైల్వే భద్రతకు రూ. 16842 కోట్లు కేటాయింపు
ప్రమాదాలు జరగకుండా భద్రతే రైల్వే ప్రధాన లక్ష్యం
ఇండిపెండెంట్ రైల్వే సేఫ్టీ అధార్టీ ఏర్పాటు
నవీకరణ లేకుండా భద్రతా చర్యలు సాధ్యం కావు
వచ్చే అయిదేళ్లలో కాపలా లేని రైల్వే గేట్లు తొలగింపు
సామాన్యుడికి మేలు జరిగేలా బడ్జెట్ రూపుకల్పన
ఇండియన్ రైల్వేను అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళతాం
రైల్వే భద్రతా చర్యలకు అగ్రతాంబూలం
అనిల్ కకోద్కర్ కమిటీ సిఫార్సులను పాటిస్తాం
ప్రమాదాల నివారణకు శాయశక్తులా కృషి
రైల్వే భద్రత మరింత పెరగాలి
ప్రమాదాల సంఖ్యను తగ్గించాం...ఇంకా తగ్గించాలి
అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రయాణికులకు భద్రత
రైల్వే భద్రతకు నిధుల కొరత
రైల్వేల ఆధునీకరణకు రూ.75వేల కోట్లు ప్రభుత్వం సమకూర్చనుంది
నిర్వహణ వ్యయాన్ని తగ్గించేందుకు ప్రత్యేక చర్యలు
నిర్వహణ సామర్థ్యాన్ని పెంచేందుకు చర్యలు
శ్యాం పిట్రోడా కమిటీ సిఫార్సుల అమలుకు నిర్ణయం
సరిహద్దుల్లో రైల్వే ప్రాజెక్టులకు అధిక ప్రాధాన్యం
బడ్జెట్ లో మౌలిక సదుపాయాలకు పెద్దపీట
పెండింగ్ లో ప్రస్తుతం 487 రైల్వే ప్రాజెక్టులు
బడ్జెట్ అంటే లెక్కల పత్రం కాదు
వనరుల మేరకే నిధుల కేటాయింపు

చిరకాలంగా ఊరిస్తున్న హైదరాబాద్-సికింద్రాబాద్ ఎంఎంటీఎస్ రెండో దశకు ఈసారి బడ్జెట్ లో ప్రాధాన్యత లభించింది. ఎంఎంటీఎస్ రెండోదశకు కేంద్రమంత్రి పచ్చజెండా ఊపారు. అలాగే ఎంఎంటీఎస్ రెండో దశకు గత బడ్జెట్ లో కేటాయించిన నిధులు విడుదల చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో మరికొన్ని ప్రాజెక్టులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తనవంతు వ్యయం భరిస్తానని చెప్పిందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు.

బంకింగ్ చంద్ర చటర్జీ జయంతి సందర్భంగా ఇండియన్ రైల్వే దేశవ్యాప్తంగా ప్రత్యేక రైలును నడపనుంది. అలాగే కాశ్మీర్ లోయను కలిపే మార్గంలో 11 కిలోమీటర్ల టన్నెల్ నిర్మాణం, ఎయిర్ పోర్టుల స్థాయికి వంద రైల్వేస్టేషన్లు, నవీ ముంబై, కేరళలో కోచ్ ఫ్యాక్టరీల ఏర్పాటు, కొత్తతరహా ఆధునిక బోగీల నిర్మాణం, 25 టన్నుల మోసుకెళ్లే వ్యాగన్ల తయారీ, 114 కొత్త లైన్ల ఏర్పాటుకు సర్వే చేయనున్నట్లు కేంద్ర రైల్వే మంత్రి దినేష్ త్రివేది తెలిపారు. కాగా మంత్రి ప్రసంగాన్ని కొందరు ఎంపీలు అడ్డుకున్నారు. అన్ని ప్రాంతాలకు సమన్యాయం జరగలేదంటూ నిరసన తెలిపారు. దాంతో కొద్దిసేపు సభలో గందరగోళం చెలరేగింది. 
Share this article :

0 comments: