రాహుల్‌ని చూసి ఓట్లెందుకు వేయలేదు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రాహుల్‌ని చూసి ఓట్లెందుకు వేయలేదు

రాహుల్‌ని చూసి ఓట్లెందుకు వేయలేదు

Written By news on Wednesday, March 7, 2012 | 3/07/2012

 'దివంగత సీఎం వైఎస్‌ఆర్ తన రెక్కల కష్టంతో కాంగ్రెస్‌ను రెండోసారి అధికారంలోకి తీసుకొచ్చారు. ఆయన మరణం తరువాత అదంతా సోనియా, రాహుల్‌ల ఘనతనీ, కాంగ్రెస్ బలమనీ చెప్పుకున్నారు. మరి ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ఏమైంది? రాహుల్, సోనియాలను చూసి అక్కడెందుకు ఓట్లు పడలేదు' అని వైఎస్‌ఆర్ సీపీ కేంద్ర పాలక మండలి సభ్యుడు, ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకరరావు కాంగ్రెస్ నేతలను సూటిగా ప్రశ్నించారు. ఒంగోలులో బుధవారం జరిగిన ప్రకాశం జిల్లా వైఎస్‌ఆర్ సీపీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన ప్రసంగించారు. 

'దేశంలోని 28 రాష్ట్రాలలో నేడు 9 రాష్ట్రాల్లో మాత్రమే కాంగ్రెస్ అధికారంలో ఉంది. గత ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో అద్భుతాలు సృష్టించామని చెబుతున్న నేతలంతా ఇప్పుడు ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో అలాంటి అద్భుతాలు ఎందుకు సృష్టించలేదు? జగన్‌ను ఇబ్బంది పెట్టడం ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో తిరిగి మరోసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందన్న వృద్ధ జంబూకాలు, కాకాలు, కేకేల మాటలు విని కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే జగన్‌ను ఇబ్బందిపెట్టే ప్రయత్నం చేస్తోంది. జగన్ తురుఫు ముక్క అనే సంగతి మరిచి ఆయన మీద అడ్డగోలు కేసులు పెట్టి అరెస్టు చేయాలని కుట్ర జరుగుతోంది. అందులో భాగంగానే జగన్‌పై విష ప్రచారం సాగుతోంది. ఈ దేశంలో, రాష్ట్రంలో రెండో గొంతుక మాట్లాడకూడదన్నంతగా బానిసత్వం కొనసాగుతోంది. లాలుప్రసాద్ యాదవ్, జయలలిత, మాయవతి ఇలా ఎందరో ప్రముఖుల మీద సీబీఐ విచారణలు జరిగాయి. వాళ్లనెవరినీ అరెస్టు చేయలేదు. వారిపై కేసులు నమోదు చేయలేదు. మరి జగన్ విషయంలో మాత్రం ఎందుకు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు? ఎవరి మెప్పు పొందడానికి ఇది జరుగుతోంది? జగన్ నేరం చేసినట్లు ఎక్కడైనా ఉందా? పార్టీ పెట్టుకోవడమే జగన్ చేసిన నేరమా? 18 వేల కిలో మీటర్లు ప్రయాణం చేసి జనంలోకి వెళ్లి ఆదరణ చూరగొన్న నేతగా జగన్ ఖ్యాతి గడించారు. జగన్‌ను ముఖ్యమంత్రి కాకుండా అడ్డుకోవాలనే ఏకైక లక్ష్యంతో కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కై పని చేస్తున్నాయి.' అని జూపూడి దుయ్యబట్టారు. 

జగన్‌ను అరెస్టు చేయాలంటే వివిధ రాష్ట్రాల్లో సీబీఐ విచారణలు ఎదుర్కొంటున్న అనేక మంది ప్రముఖులనూ అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. జగన్‌ను అరెస్టు చేస్తే పెల్లుబికే జనాగ్రహాన్ని ప్రభుత్వాలు తట్టుకోలేవని హెచ్చరించారు. జగన్‌పై జరుగుతున్న కుట్రలకు వ్యతిరేకంగా ఈ నెల 8 నుంచి 12వ తేదీ వరకు వైఎస్‌ఆర్ సీపీ వివిధ రూపాల్లో శాంతియుత ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు.
Share this article :

0 comments: