రైల్వే బడ్జెట్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రైల్వే బడ్జెట్

రైల్వే బడ్జెట్

Written By ysrcongress on Wednesday, March 14, 2012 | 3/14/2012

2012-13 సంవత్సరానికిగానూ కేంద్ర రైల్వే మంత్రి దినేష్ త్రివేది ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్ ముఖ్యాంశాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.
రైల్వే భద్రతకు రూ. 16842 కోట్లు కేటాయింపు
ప్రమాదాలు జరగకుండా భద్రతే రైల్వే ప్రధాన లక్ష్యం
ఇండిపెండెంట్ రైల్వే సేఫ్టీ అధార్టీ ఏర్పాటు
నవీకరణ లేకుండా భద్రతా చర్యలు సాధ్యం కావు
వచ్చే అయిదేళ్లలో కాపలా లేని రైల్వే గేట్లు తొలగింపు
సామాన్యుడికి మేలు జరిగేలా బడ్జెట్ రూపుకల్పన
ఇండియన్ రైల్వేను అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళతాం
రైల్వే భద్రతా చర్యలకు అగ్రతాంబూలం
అనిల్ కకోద్కర్ కమిటీ సిఫార్సులను పాటిస్తాం
ప్రమాదాల నివారణకు శాయశక్తులా కృషి
రైల్వే భద్రత మరింత పెరగాలి
ప్రమాదాల సంఖ్యను తగ్గించాం...ఇంకా తగ్గించాలి
అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రయాణికులకు భద్రత
రైల్వే భద్రతకు నిధుల కొరత
రైల్వేల ఆధునీకరణకు రూ.75వేల కోట్లు ప్రభుత్వం సమకూర్చనుంది
నిర్వహణ వ్యయాన్ని తగ్గించేందుకు ప్రత్యేక చర్యలు
నిర్వహణ సామర్థ్యాన్ని పెంచేందుకు చర్యలు
శ్యాం పిట్రోడా కమిటీ సిఫార్సుల అమలుకు నిర్ణయం
సరిహద్దుల్లో రైల్వే ప్రాజెక్టులకు అధిక ప్రాధాన్యం
బడ్జెట్ లో మౌలిక సదుపాయాలకు పెద్దపీట
పెండింగ్ లో ప్రస్తుతం 487 రైల్వే ప్రాజెక్టులు
బడ్జెట్ అంటే లెక్కల పత్రం కాదు
వనరుల మేరకే నిధుల కేటాయింపు

చిరకాలంగా ఊరిస్తున్న హైదరాబాద్-సికింద్రాబాద్ ఎంఎంటీఎస్ రెండో దశకు ఈసారి బడ్జెట్ లో ప్రాధాన్యత లభించింది. ఎంఎంటీఎస్ రెండోదశకు కేంద్రమంత్రి పచ్చజెండా ఊపారు. అలాగే ఎంఎంటీఎస్ రెండో దశకు గత బడ్జెట్ లో కేటాయించిన నిధులు విడుదల చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో మరికొన్ని ప్రాజెక్టులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తనవంతు వ్యయం భరిస్తానని చెప్పిందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు.

బంకింగ్ చంద్ర చటర్జీ జయంతి సందర్భంగా ఇండియన్ రైల్వే దేశవ్యాప్తంగా ప్రత్యేక రైలును నడపనుంది. అలాగే కాశ్మీర్ లోయను కలిపే మార్గంలో 11 కిలోమీటర్ల టన్నెల్ నిర్మాణం, ఎయిర్ పోర్టుల స్థాయికి వంద రైల్వేస్టేషన్లు, నవీ ముంబై, కేరళలో కోచ్ ఫ్యాక్టరీల ఏర్పాటు, కొత్తతరహా ఆధునిక బోగీల నిర్మాణం, 25 టన్నుల మోసుకెళ్లే వ్యాగన్ల తయారీ, 114 కొత్త లైన్ల ఏర్పాటుకు సర్వే చేయనున్నట్లు కేంద్ర రైల్వే మంత్రి దినేష్ త్రివేది తెలిపారు. కాగా మంత్రి ప్రసంగాన్ని కొందరు ఎంపీలు అడ్డుకున్నారు. అన్ని ప్రాంతాలకు సమన్యాయం జరగలేదంటూ నిరసన తెలిపారు. దాంతో కొద్దిసేపు సభలో గందరగోళం చెలరేగింది.

కొత్త రైల్వే మంత్రి దినేష్ త్రివేది ఛార్జీల పెంపుతో ప్రయాణికులకు షాక్ ఇచ్చారు. మధ్య మధ్యలో ఆయన కవిత్వాన్ని ప్రయోగిస్తూనే ప్రయాణికులకు ఛార్జీల మోతను మోగించారు. ఎనిమిదేళ్ల తర్వాత అన్ని శ్రేణుల్లోనూ కిలోమీటర్ కు రెండుపైసలు చొప్పున ఛార్జీలు పెరిగాయి. అలాగే ఫ్లాట్ ఫాం టిక్కెట్ ధర రూ.3 నుంచి రూ.5 కు పెరిగింది. స్లీపర్ క్లాస్ కు కిలోమీటర్ కు అయిదు పైసలు, ఫస్ట్ క్లాస్ ఏసీకి కిలోమీటర్ కు 30 పైసలు, సెకండ్ ఏసీకి 15 పైసలు, థర్డ్ ఏసీకి పది పైసలు పెరిగాయి.
 భారతీయ రైల్వే ఉద్యోగులకు శుభవార్త. ఈ శాఖలో పని చేసే ఉద్యోగులకు 78 రోజుల బోనస్ ను రైల్వే మంత్రి దినేష్ త్రివేది ప్రకటించారు. కాగా ప్రతి ఏడాది పదిమంది క్రీడాకారులకు రైల్ ఖేల్ రత్న అవార్డులు ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. 

అన్ని రైళ్లకు జీపీఎస్ సౌకర్యం, కొత్త కేటరింగ్ కోసం పైలట్ ప్రాజెక్టు చేపట్టడం, ఢిల్లీ-జోద్ పూర్ మధ్య హైస్పీడ్ రైలుకు ప్రతిపాదన, రాష్ట్రాల సహకరించే ప్రాజెక్టులకు పెద్దపీట, ఇండియన్ రైల్వేస్టేషన్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు, రైల్వేబోర్డు పునర్ వ్యవస్థీకరణ్, రైల్వే బోర్డులో కొత్తగా ఇద్దరు సభ్యులకు చోటు. స్టేషన్లు, రైళ్లలో పరిశుభ్రతకు ప్రత్యేక హౌస్ కీపింగ్ బాడీ ఏర్పాటు, ప్రతి మెయిల్, ఎక్స్ ప్రెస్ రైళ్లలో త్వరలోనే వికలాంగులకు ప్రత్యేక బోగీ ఏర్పాటు చేస్తామని మంత్రి దినేష్ త్రివేది పేర్కొన్నారు.
2012-13 సంవత్సరానికిగానూ రైల్వేలో కొత్తగా లక్ష ఉద్యోగాలు కల్పించనున్నట్లు రైల్వేమంత్రి దినేష్ త్రివేది తెలిపారు. అలాగే రైల్వే తుక్కు అమ్మకాలను ఇకనుంచి ఈ టెండర్లు, ఈ ఆక్షన్ల ద్వారానే జరపనున్నట్లు చెప్పారు. వెయిటింగ్ లిస్ట్ ప్రయాణికులకు బెర్త్ లు ఇచ్చే ఏర్పాట్లు చేస్తామన్నారు.

కాగా మొబైల్ ఎస్ ఎంఎస్, గుర్తింపు పత్రాన్ని ఈ టిక్కెట్ గా పరిగణిస్తామని మంత్రి తెలిపారు. ఈ ఏడాది 75 ఎక్స్ ప్రెస్, 21 కొత్త ప్యాసింజర్ రైళ్లు, అయిదు డీఎంయూలు, ఎనిమిది ఎంఈఎంయూలు, 2,500 బోగీల్లో గ్రీన్ టాయిలెట్ లు ఏర్పాటు, రైల్వే బోర్డు పునర్ వ్యవస్థీకరణ, వచ్చే ఏడాదికల్లా 1100 కిలోమీటర్ల మేర విద్యుద్దీకరణ, ఇందుకోసం 828 కోట్లు కేటాయింపులు జరిగాయి.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ భాగస్వామ్యంతో కాకినాడ-పిఠాపురం కొత్త రైల్వేలైన్లు ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర మంత్రి దినేష్ త్రివేది తెలిపారు. అలాగే కాకినాడ-విశాఖ తీరప్రాంత రైల్వే లైన్ అభివృద్ధికి కూడా ప్రభుత్వ భాగస్వామ్యంతో పనులు చేపడతామన్నారు. మెదక్-అక్కన్నపేట, భద్రాచలం-కొవ్వూరు మధ్య రైల్వేలైన్లు ఏర్పాటు చేస్తామన్నారు.
రైల్వేమంత్రి దినేష్ త్రివేది ఈ రోజు ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్ లో మన రాష్ట్రంలో అయిదు రైల్వేస్టేషన్లను ఆదర్శ స్టేషన్లుగా ప్రకటించారు. దువ్వాడ, వినుకొండ, మాచర్ల, పిడుగురాళ్ల, సత్తెనపల్లి రైల్వే స్టేషన్లను ఆదర్శ స్టేషన్లుగా పేర్కొన్నారు. హైదరాబాద్ ఎంఎంటిసి రెండవదశకు అనుమతించారు. 

రైల్వేబడ్జెట్ ప్రకారం రైల్వే బోర్డుని పునర్వ్యవస్థీకరిస్తారు. రైల్వే స్టేషన్లలో ఇంటర్నెట్ సదుపాయం కల్పిస్తారు. కోరుకొండ - విజయనగరం డబ్లింగ్ పనులను పూర్తి చేయాలని నిర్ణయించారు. మన రాష్ట్రంలో కొన్ని కొత్త రైలు మార్గాలను ప్రతిపాదించారు. కోటిపల్లి - నర్సాపూర్, కడప - బెంగళూరు, నడికుడి - శ్రీకాళహస్తి, విజయవాడ - గుడివాడ రైలు మార్గాలను ప్రతిపాదించారు. బీబీనగర్ - నల్లపాడు రైలు మార్గాన్ని విద్యుద్దీకరించాలని ప్రతిపాదించారు. కొన్ని మార్గాలను రైల్వే లైన్ సర్వే కోసం ఎంపికి చేశారు

Share this article :

0 comments: