ముఖ్యమంత్రిగా చంద్రబాబు నిర్వాకం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ముఖ్యమంత్రిగా చంద్రబాబు నిర్వాకం

ముఖ్యమంత్రిగా చంద్రబాబు నిర్వాకం

Written By ysrcongress on Saturday, March 31, 2012 | 3/31/2012

మినహాయింపుల ముసుగులో వేల కోట్ల అక్రమాలు
మొత్తం రూ.3,719 కోట్ల అక్రమ మినహాయింపులు
రూ.1,113 కోట్ల మేర తక్కువగా పన్ను మదింపు
2002-03 నివేదికలో ఎండగట్టిన కాగ్


కాకులను కొట్టడం.. గద్దలకు వేయడం. సీఎంగా ఉన్నంత కాలమూ ఇదే బాబు సింగిల్ పాయింట్ ఎజెండా! ప్రతి చిన్న వస్తువుపైనా పేదోడి గోళ్లూడగొట్టి మరీ పన్నులు గుంజిన బాబు, పరిశ్రమలకు మాత్రం ‘ప్రోత్సాహం’ ముసుగులో అస్మదీయ బడా బాబులకు వేలాది కోట్ల రూపాయల పన్ను మినహాయింపులిచ్చారు. 1997-98 నుంచి 2002-03 మధ్యకాలంలో పలు సంస్థలకు ప్రోత్సాహకాల మంజూరులో భాగంగా రూ.6,026 కోట్ల మేరకు అమ్మకం పన్ను వాయిదాలను అనుమతించారు.

మరో రూ.3,954 కోట్ల దాకా అమ్మకపు పన్ను మినహాయింపులిచ్చారు. ఈ వ్యవహారాల్లో భారీ అవకతవకలు చోటుచేసుకున్నాయంటూ కాగ్ ఎండగట్టింది. ‘టార్గెట్-2000’ పథకం కింద రూ.100 కోట్లకు మించి పెట్టుబడి ఉన్న అతి పెద్ద ప్రాజెక్టులకు ప్రోత్సాహకాలిచ్చే విచక్షణాధికారాన్ని బాబు సర్కారు పూర్తిగా దుర్వినియోగం చేసింది. మచ్చుకు ఏడు సర్కిల్ ఆఫీసుల్లో కాగ్ చేసిన తనిఖీల్లోనే.. 8 అతిపెద్ద ప్రాజెక్టులకు అక్రమంగా, నిబంధనలకు విరుద్ధంగా ఏకంగా రూ.3,719 కోట్ల దాకా అమ్మకపు పన్ను ప్రోత్సాహకాలు మంజూరు చేసినట్టు తేలింది. కేవలం తాము తనిఖీలు చేసిన 8 కంపెనీల్లోనే ఇవన్నీ బట్టబయలైనట్టు కాగ్ పేర్కొంది.

2002-03లో భారీ అవకతవకలు: 2002-03లో తాము తనిఖీ చేసిన నమూనాల్లో, దాదాపు 1,671 కేసుల్లో ఏకంగా రూ.1,113.88 కోట్ల మేర అమ్మకపు పన్ను తక్కువ నిర్ధారణ జరిగినట్టు వెల్లడైందని కాగ్ ఎండగట్టింది. ఆ మేరకు ఆదాయాన్ని రాష్ట్రం కోల్పోయిందంటూ తప్పుబట్టింది. 2000-01లో రూ.68.06 కోట్ల మేర అమ్మకపు పన్నును తక్కువగా నిర్ధారించినట్టు కూడా తేల్చింది.
Share this article :

0 comments: