కూలీల కడుపు మాడ్చుతున్న సర్కారు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » కూలీల కడుపు మాడ్చుతున్న సర్కారు

కూలీల కడుపు మాడ్చుతున్న సర్కారు

Written By ysrcongress on Tuesday, March 27, 2012 | 3/27/2012

* 20 లక్షల మందికి పని కరువు
* ఉపాధి హామీ సిబ్బంది సమ్మె పట్టని ప్రభుత్వం
* రాష్ట్రవ్యాప్తంగా నిలిచిపోయిన ఉపాధి హామీ పనులు
* విధి లేక వలస బాట పడుతున్న బడుగు జీవులు
* పనులు చేసిన లక్షల మందికీ వేతనాలు అనుమానమే?
* ఉపాధి హామీ పథకం సిబ్బంది సమ్మే కారణం
* పరిష్కరించకుండా మీనమేషాలు లెక్కిస్తున్న సర్కారు
* డిమాండ్లు పరిష్కారమయ్యేదాకా సమ్మె ఆపం: ఉద్యోగుల జేఏసీ
* గ్రామీణాభివృద్ధి కమిషనర్ రెచ్చగొడుతున్నారని ఆరోపణ
* పలువురు ఉద్యోగులకు తొలగింపు నోటీసులు

హైదరాబాద్, న్యూస్‌లైన్:నిర్లక్ష్యం. అంతులేని నిర్లక్ష్యం. ప్రతిష్టాత్మక ఉపాధి హామీ పథకం అమలులోనూ, దాన్ని పర్యవేక్షించాల్సిన సిబ్బంది సమ్మెకు దిగితే పరిష్కరించడంలోనూ రాష్ట్ర సర్కారు పూర్తి అలసత్వం ప్రదర్శిస్తోంది. ఫలితంగా రాష్ట్రవ్యాప్తంగా ఉపాధి పనులు నిలిచిపోయాయి. దాంతో ఏకంగా 20 లక్షల మంది పేదలు ఉపాధి కోల్పోయి అల్లాడుతున్నారు. వారిలో పలువురు విధి లేక వలసల బాట పడుతున్నారు. అయినా కాంగ్రెస్ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోంది. ఉపాధి హామీ పథకంలో పని చేస్తున్న దాదాపు 30 వేల మంది ఉద్యోగులు శనివారం నుంచి సమ్మె చేస్తున్నారు. ముందస్తు సమాచారమున్నా సమ్మెను నివారించేందుకు ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నమూ చేయకపోగా, వారిని బెదిరించేలా ప్రకటనలకు దిగింది! పలువురికి ఇప్పటికే నోటీసులు కూడా జారీ చేసింది.

సమ్మె ఫలితంగా కూలీలకు పనులు చూపించే వారులేక ఉపాధి పథకం పూర్తిగా నిలిచిపోయింది. ఇటు ఉద్యోగుల సమ్మె, అటు సర్కారు నిర్లక్ష్యపూరిత మొండి వైఖరికి మధ్య నలిగిపోతున్నది మాత్రం ఏ రోజుకు ఆ రోజు రెక్కాడితేనే తప్ప డొక్కాడని అమాయక కూలీలే...! పైగా అక్కడక్కడా కొనసాగుతున్న కొద్దిపాటి ఉపాధి పనుల్లో పాల్గొంటున్న కూలీలను నమోదు చేసే దిక్కు కూడా లేకుండా పోయింది. ఫలితంగా మరికొన్ని లక్షల మంది కూలీలకు వేతనాలందడం కూడా అనుమానాస్పదంగా మారింది...! తాజాగా మెదక్ జిల్లాలో 1,244 మంది ఉపాధి ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది.


ఉపాధి హామీ ఉద్యోగుల 42 డిమాండ్లలో సర్కారు గతంలో అంగీకరించిందే కొన్నింటిని కాగా, వాటిని కూడా అమలు చేయకుండా తీవ్ర నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తూ వచ్చింది. ఉద్యోగులను పర్మినెంట్ చేయడం, ప్రభుత్వోద్యోగుల మాదిరి సౌకర్యాలు, పదోన్నతులు కల్పించాలన్న ప్రధాన డిమాండ్‌ను పరిష్కరించకపోవడంతో వారంతా శనివారం నుంచి సమ్మెకు దిగారు. క్షేత్ర, సాంకేతిక సహాయకులు, కన్సల్టెంట్ ఇంజనీర్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, అసిస్టెంట్ ప్రోగ్రాం ఆఫీసర్లు, జిల్లా కార్యాలయ సిబ్బంది అంతా అందులో పాల్గొంటుండటంతో కూలీలకు పనులు చూపేవారు లేకుండాపోయారు. రాష్ట్రంలో 1.2 కోట్ల మందికి జాబ్ కార్డులు జారీ చేసినా, ఏటా 40 లక్షల మందికి మించి ఉపాధి కల్పించలేకపోతున్నారు. వారిలోనూ తాజాగా 20 లక్షల మంది మూడు రోజులుగా ఉపాధి పనుల్లేక వలస బాట పట్టారు. 

రెండు మూడేళ్ల క్రితం దాకా ఉపాధి హామీని పకడ్బందీగా అమలు చేసే రాష్ట్రాల జాబితాలో తొలి స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు నానాటికీ తీసికట్టుగా మారుతూ వస్తోంది. ఈ ఏడాదికి కేంద్రం దాదాపు రూ.8,300 కోట్లకు మంజూరునిస్తే అందులో సగం కూడా ఖర్చుచేయలేకపోయారు. మొత్తం ఖర్చు మార్చి 31 నాటికి రూ.4,500 కోట్లకు మించదని అధికారులే అంగీకరిస్తున్నారు. దాంతో వచ్చే ఆర్థిక సంవత్సరానికి రాష్ట్రానికి రూ.2,000 కోట్లు కోత వేసిన కేంద్రం, రూ.6,300 కోట్లుకు మాత్రమే అనుమతినిచ్చింది. తాము మార్చి 9న సమ్మె నోటీసిచ్చినా శనివారం దాకా అధికారులు చర్చలకు కూడా పిలవలేదని ఉద్యోగుల జేఏసీ విమర్శిస్తోంది.

ఉపాధి ఉద్యోగుల ప్రధాన డిమాండ్లివీ..
*ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న ఫిక్సడ్ టెన్యూర్ ఉద్యోగులను తక్షణం పర్మినెంట్ చేయాలి. 
*గతంలో అంగీకరించిన మానవ హక్కుల విధానాన్ని అమలుపర్చాలి. 
* ప్రభుత్వోద్యోగుల మాదిరిగా వైద్య సదుపాయాలు కల్పించాలి. వారిలాగే ఐదేళ్లకోసారి వేతనాలు సవరించాలి. 
*వేతన పెంపు, సవరణ, పదోన్నతులు, బదిలీలు శాస్త్రీయంగా ఉండాలి. 
* అంగీకరించిన డిమాండ్ల అమలుకు తక్షణం ఉత్తర్వులివ్వాలి
Share this article :

0 comments: