కాంగ్రెస్ అభ్యర్థిపై చర్యలు తీసుకోవాలి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » కాంగ్రెస్ అభ్యర్థిపై చర్యలు తీసుకోవాలి

కాంగ్రెస్ అభ్యర్థిపై చర్యలు తీసుకోవాలి

Written By ysrcongress on Tuesday, March 13, 2012 | 3/13/2012

ఎన్నిక ల నియమావళిని ఉల్లంఘించి రాత్రి 10 గంటల తరవాత కూడా కోవూరు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కాంగ్రెస్ అభ్యర్థి పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డిపై చర్యలు తీసుకోవాలని ముఖ్య ఎన్నికల అధికారి భన్వర్‌లాల్‌కు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసింది. పార్టీ కార్మిక విభాగం రాష్ట్ర కన్వీనర్ జనక్‌ప్రసాద్, వైఎస్సా ర్ సేవా దళం కన్వీనర్ కోటింరెడ్డి వినయ్‌రెడ్డి తదితరులు సోమవారం సచివాలయంలో ఆయన్ను కలిశారు. మార్చి 11న రాత్రి 10 తరవాత కూడా పోలంరెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారనేందుకు సంబంధించిన వివరాలు, ఆధారాలను అందజేశారు. ఆయన ఎన్నికల ఖర్చును రెవెన్యూ, పోలీసు అధికారులు సరిగ్గా లెక్కించడం లేదని పేర్కొన్నారు. అధికారులు కాంగ్రెస్‌కు సహకరిస్తూ కోడ్ ఉల్లంఘనకు పాల్పడుతున్నారని ఫిర్యాదులో వివరించారు.

రూ.5 లక్షల మద్యం కోవూరులో పంచేందుకే..

కోవూరులో పొదలూరు గేట్ సెంటర్‌లో ఓ కూల్‌డ్రింకు షాపులో పట్టుకున్న రూ.5 లక్షల విలువైన మద్యాన్ని ఉప ఎన్నికల్లో పంచేందుకే నిల్వ చేశారని కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ముఖ్య ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు. ‘‘ఆ మద్యం లిక్కర్ డాన్ తోట మనోహర్‌కు చెందినది. ఆయన ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణరెడ్డికి మద్దతుదారు. లెసైన్స్‌లేని దుకాణాల్లో, అదీ పాన్ షాపులో మద్యం నిల్వ చేశారు’’ అని పేర్కొన్నారు. దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
Share this article :

0 comments: