'జగన్ ని ఎదుక్కొనే దమ్ము కాంగ్రెస్ కు లేదు' - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » 'జగన్ ని ఎదుక్కొనే దమ్ము కాంగ్రెస్ కు లేదు'

'జగన్ ని ఎదుక్కొనే దమ్ము కాంగ్రెస్ కు లేదు'

Written By ysrcongress on Saturday, March 24, 2012 | 3/24/2012

సీమాంధ్రలో వైఎస్ జగన్మోహన రెడ్డిని ఎదుర్కొనే దమ్ము కాంగ్రెస్ పార్టీకి లేదని మాజీ మంత్రి జీవన్ రెడ్డి అన్నారు.  మహబూబ్ నగర్ లో పార్టీ ఓటమికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డే కారణం అని విమర్శించారు. రాజేశ్వర రెడ్డి భార్యకు టిక్కెట్ ఇవ్వకపోవడంతోనే పార్టీ ఓడిపోయిందన్నారు. ఈ విషయం అధిష్టానవర్గానికి లేఖ రాస్తానని చెప్పారు.

 సుభానీనగర్ లో మహానేత విగ్రహావిష్కరణ


చిలకలూరిపేట సుభానీ నగర్ లో మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి ఆవిష్కరించారు. పూలమాల వేసి నివాళులర్పించారు. ఓదార్పు యాత్రలో భాగంగా ఇక్కడికి వచ్చిన జగన్ కు అభిమానులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. ఓ వృద్ధురాలు జగన్ ని చూసిన ఆనందం ఆపుకోలేక న్యత్యం చేస్తూ స్వాగతం పలికింది.

చిలకలూరిపేట రజకకాలనీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి రోడ్డు షో నిర్వహించారు. అనంతరం మహానేత డాక్టర్ వైఎస్ఆర్ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం సీఆర్ కాలనీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను జగన్ ఆవిష్కరించారు.
Share this article :

0 comments: