జీవోలతో జగన్‌కేంటి సంబంధం? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జీవోలతో జగన్‌కేంటి సంబంధం?

జీవోలతో జగన్‌కేంటి సంబంధం?

Written By ysrcongress on Tuesday, March 13, 2012 | 3/13/2012

హైదరాబాద్, న్యూస్‌లైన్:‘‘జగన్ ఆస్తుల కేసు విషయమై వివాదాస్పదంగా మారిన 26 జీవోల విషయంలో సీబీఐ చేస్తున్న విచారణ పూర్తిగా చట్టవిరుద్ధంగా ఉంది. సీబీఐ బరితెగించి ప్రవర్తిస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నోసార్లు చెప్పింది. సుప్రీంకోర్టు నోటీసులతో ఇప్పుడది రుజువైంది. జగన్ విషయంలో జరుగుతున్న అన్యాయాన్ని చూసి ఒక స్వతంత్ర న్యాయవాది పి.సుధాకర్‌రెడ్డి న్యాయస్థానం తలుపు తట్టారు. సీబీఐ కోర్టులో, హైకోర్టులో విఫలమైనా సుప్రీంకోర్టులో విజయం సాధించారు. 

దేశంలో అత్యున్నత న్యాయస్థానం వెలువరించిన నోటీసులు సీబీఐకి చెంపపెట్టు లాంటివి. ప్రభుత్వ డొల్లతనాన్ని కూడా అవి బయటపెట్టాయి’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ కేంద్ర పాలక మండలి సభ్యుడు డి.ఎ.సోమయాజులు వ్యాఖ్యానించారు. పార్టీ నేతలు వాసిరెడ్డి పద్మ, గట్టు రామచంద్రరావుతో కలిసి సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సీబీఐ విచారణ బిజినెస్ నిబంధనలకు వ్యతిరేకంగా జరుగుతోందని విమర్శించారు. ‘‘సీబీఐ తన ఎఫ్‌ఐఆర్‌లోని మొదటి 15 పేజీల్లో 26 జీవోలను ఉటంకించింది. 

సంబంధిత ప్రభుత్వ కార్యదర్శులు, జీవోలకు ఆదేశించిన మంత్రుల పేర్లను మాత్రం చేర్చలేదు. ఈ కేసులో హైకోర్టు జగన్‌ను 52వ బాధ్యునిగా పేర్కొంటే సీబీఐ మాత్రం మొదటి ముద్దాయిగా చేర్చింది. కేసులో ఎక్కడా ప్రస్తావనకు రాని విజయసాయిరెడ్డిని రెండో ముద్దాయిగా చేర్చింది. ప్రధానంగా ఆరోపణలు వెల్లువెత్తుతున్న 26 జీవోలను విడుదల చేసిన సెక్రటరీలను, సంబంధిత మంత్రులను ఎఫ్‌ఐఆర్‌లో ఎందుకు చేర్చలేదు? 2జీ కుంభకోణంలో అవకతవకలు జరిగాయని జీవోలు విడుదల చేసిన సెక్రటరీలను, మంత్రులను జైల్లో వేసింది. అక్కడ ప్రధానిని ఎక్కడా తప్పు పట్టలేదు. కానీ ఇక్కడ అదే సీబీఐ వింతగా ప్రవర్తిస్తోంది. దీంతోనే సీబీఐ ధోరణి ఏంటనేది తేటతెల్లం అవుతోంది’’ అని అన్నారు. 

ప్రభుత్వం లాయర్‌ను కూడా పెట్టలేదు

‘‘హైకోర్టు సంబంధిత 26 జీవోలపై స్పందన కోరితే ప్రభుత్వం ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. కేసుపై 8 నెలలుగా కోర్టులో వాదనలు జరుగుతున్నా అడ్వకేట్ జనరల్ కన్నెత్తి చూడకపోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. శంకర్రావు, టీడీపీ నేతలు కలిసి ఆరోపణలు చేసింది ప్రభుత్వ జీవోల విషయంలోనే. రాష్ట్ర ప్రభుత్వం, చీఫ్ సెక్రటరీ, సెక్రటరీలనే బాధ్యులుగా పేర్కొన్నారు. దురదృష్టమేంటంటే రాష్ట్ర ప్రభుత్వం లాయర్‌ను కూడా పెట్టలేదు. ఒక్క జీవోపై వివాదం తలెత్తితేనే అడ్వకేట్ జనరల్ కౌంటర్ దాఖలు చేస్తారు. అలాంటిది 26 జీవోలకు సంబంధించిన కేసులో 8 నెలలుగా వాదనలు కొనసాగుతున్నా ప్రభుత్వం కన్నెత్తి చూడలేదు. వింత ఏంటంటే ప్రధాన ప్రతిపక్షం, అధికార పక్షంతో కలిసి పిల్ వేయడం. ఇలాంటిది ప్రపంచంలో ఇదే మొదటిది కావచ్చు’’ అని సోమయాజులు పేర్కొన్నారు. 

జీవోలతో జగన్‌కేంటి సంబంధం?

జీవోలు విడుదల చేసిన సెక్రటరీలు, మంత్రులను వదిలేసిన సీబీఐ జగన్‌ను ప్రశ్నిస్తాననటం చాలా ఆశ్చర్యంగా ఉందని సోమయాజులు అన్నారు. జీవోలతో జగన్‌కు ఏంటి సంబంధం? జగన్ ఏనాడైనా సచివాలయానికి వచ్చారా? మంత్రులను ప్రభావితం చేసే విధంగా జగన్ ఎలాంటి ప్రభుత్వ పదవి చేపట్టలేదు కదా? అని నిలదీశారు. సీబీఐ వ్యవహరిస్తున్న తప్పుడు విధానాలను విజయమ్మ లేఖల ద్వారా ప్రధాని దృష్టికి తీసుకెళ్లిన విషయం గుర్తు చేశారు. ఇప్పటికైనా సీబీఐ సరైన పద్ధతిలో విచారణ చేపట్టాలని, వివాదాస్పద 26 జీవోలు కరెక్టా? కాదా? అనే విషయమై ప్రభుత్వం స్పందించాలని సోమయాజులు డిమాండ్ చేశారు.
Share this article :

1 comments:

PALLAPOLU SRINIVASARAO said...

JAGAN KU ELANTI SAMBANDAM LENI VISHYAM LO ANVASARAMGA KONDARU ASATYA PRACHARALU CHESTHUNNARU. JAGAN KU VICHARANA THO ELANTI SAMBANDAM LEDANE VISHSAMU NOOTIKI NOORU PALLU NIJAM