సోనియా భజన చేస్తున్న సిఎం: జగన్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » సోనియా భజన చేస్తున్న సిఎం: జగన్

సోనియా భజన చేస్తున్న సిఎం: జగన్

Written By news on Wednesday, March 14, 2012 | 3/14/2012

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఎఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ భజన చేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి విమర్శించారు. కోవూరు ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ రాత్రి 8 గంటలకు ఆయన బుచ్చిరెడ్డిపాలెం వచ్చారు. ఈ సందర్భంగా ప్రచార రథంపైనుంచి ఆయన ప్రసంగించారు. ఆ మహానేత రాజశేఖర రెడ్డి వెళ్లిపోయిన తరువాత రైతుల పరిస్థితి దైయనీయంగా తయారైందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల కోసం పదవులను సైతం వదులుకున్న మేకపాటి రాజమోహన రెడ్డి, ప్రసన్న కుమార్ రెడ్డిలను చూస్తుంటే తనకు గర్వంగా ఉందన్నారు. 
Share this article :

0 comments: