జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకే అవిశ్వాసం సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేశా - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకే అవిశ్వాసం సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేశా

జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకే అవిశ్వాసం సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేశా

Written By ysrcongress on Sunday, March 4, 2012 | 3/04/2012

 ‘ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటులో భాగంగా ఎమ్మెల్యే పదవిని కోల్పోవడం సంతోషంగా ఉంది. తెలంగాణ రాజకీయ జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకే అవిశ్వాసం సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేశా. రాష్ట్ర ఏర్పాటుకు అడ్డంకులు సృష్టిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగే అర్హత లేదనే.. అవిశ్వాసానికి మద్దతిచ్చా. తెలంగాణ కోసం నేను చేసిన కృషికి ఇక్కడి ప్రజలు తప్పకుండా ఆదరిస్తారు. నాపై టీఆర్‌ఎస్ పోటీ చేస్తే అది స్వయంకృతాపరాధమే కాకుండా తెలంగాణవాదాన్ని నీరుగార్చటం అవుతుంది’ అని పరకాల మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖ స్పష్టం చేశారు. 
శనివారం ఆమె తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ విషయంలో తన చిత్తశుద్ధిని ఎవరూ శంకించాల్సిన అవసరం లేదన్నారు. 

తాను రెండు సార్లు రాజీనామా చేశానని, ఇప్పటికీ స్పీకర్ వద్ద ఒకటి పెండింగ్‌లోనే ఉందని గుర్తుచేశారు. విప్ ధిక్కరించినందుకు అనర్హత వేటు వేశారే కానీ తన రాజీనామాను డిస్మిస్ చేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించలేదన్నారు. పరకాలలో తనపై టీఆర్‌ఎస్ పోటీ చేయదని భావిస్తున్నట్లు చెప్పారు. ఒకవేళ పోటీ చేస్తే రాజకీయ జేఏసీ, విద్యార్థుల నుంచి పెద్ద ఎత్తున నిరసన వచ్చే అవకాశముందని అభిప్రాయపడ్డారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు వ్యతిరేకంగా ఎక్కడా వ్యవహరించలేదన్నారు. సెంటిమెంట్‌ను గౌరవించినందు వల్లే తెలంగాణ కోసం పదవులు వదులుకున్న వారి స్థానాల్లో తమ పార్టీ పోటీ చేయట్లేదని వివరించారు. తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ చేసిన, చేస్తున్న ద్రోహాన్ని వచ్చే ఉప ఎన్నికల్లో ప్రజలకు వివరిస్తానన్నారు. ఎవరి రెక్కల కష్టంపై కాంగ్రెస్ అధికారం చేపట్టిందో అదే కుటుంబంపై అవినీతి ముద్రవేసి, కేసులతో వేధింపులకు గురిచేస్తుందని మండిపడ్డారు. కాంగ్రెస్, టీడీపీ చేస్తున్న కుట్రలకు ప్రజలు గుణపాఠం చెబుతారన్నారు. త్వరలో వచ్చే ఉప ఎన్నికల్లో వైఎస్ సంక్షేమ పథకాలను, తెలంగాణ సెంటిమెంట్ రెండిటినీ ప్రచారాస్త్రాలుగా చేసుకోనున్నట్లు ఓ ప్రశ్నకు బదులిచ్చారు.
Share this article :

0 comments: