‘పశ్చిమ’లో జగన్ పర్యటన - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ‘పశ్చిమ’లో జగన్ పర్యటన

‘పశ్చిమ’లో జగన్ పర్యటన

Written By ysrcongress on Monday, March 19, 2012 | 3/19/2012

ఈ నెల 30 నుంచి ఏప్రిల్ 4 వరకు ప్రచారం
నరసాపురం, పోలవరం నియోజకవర్గాల్లో రోడ్‌షోలు

నరసాపురం (పశ్చిమగోదావరి), న్యూస్‌లైన్: రెండో విడత ఉప ఎన్నికలు జరగనున్న నియోజకవర్గాల్లో పర్యటించేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శ్రీకారం చుట్టనున్నారు. ఇందులో భాగంగా పశ్చిమగోదావరి జిల్లాలోని నరసాపురం, పోలవరం నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారానికి సమర శంఖం పూరించనున్నారు. 

ఈ నెల 30 నుంచి ఏప్రిల్ 4 వరకు జిల్లాలో జగన్ రోడ్‌షో నిర్వహించనున్నారని ఆ పార్టీ జిల్లా కన్వీనర్ కొయ్యే మోషేన్‌రాజు తెలిపారు. పార్టీ జిల్లా ఇన్‌చార్జి చిర్ల జగ్గిరెడ్డి, మునిసిపల్ పరిశీలకులు వరుపుల సుబ్బారావు, పార్టీ ప్రోగ్రామింగ్ కమిటీ కన్వీనర్ తలశిల రఘురామ్‌తో కలిసి ఆయన ఆదివారమిక్కడ విలేకరులతో మాట్లాడారు. 

ఈ నెల 29వ తేదీ రాత్రి గుంటూరు జిల్లాలో ఓదార్పుయాత్ర అనంతరం రోడ్డు మార్గాన జగన్ నరసాపురం చేరుకుంటారని తెలిపారు. మరుసటి రోజు నుంచి ఏప్రిల్ ఒకటో తేదీ వరకు నరసాపురం నియోజకవర్గంలో, 2 నుంచి 4వ తేదీ వరకు పోలవరం నియోజకవర్గంలో రోడ్‌షోలు నిర్వహిస్తారని వివరించారు.
Share this article :

0 comments: