రైతన్నకు దక్కాల్సిన వేల కోట్లను తన బొక్కసంలో వేసుకుంది - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రైతన్నకు దక్కాల్సిన వేల కోట్లను తన బొక్కసంలో వేసుకుంది

రైతన్నకు దక్కాల్సిన వేల కోట్లను తన బొక్కసంలో వేసుకుంది

Written By ysrcongress on Friday, March 2, 2012 | 3/02/2012

* కేంద్ర కేబినెట్ నిర్ణయం
* సర్కారు ఖజానాలోకి రూ.10 వేల కోట్లు
* అదే సబ్సిడీని భరించినట్లయితే ఎరువుల ధరలు భారీగా తగ్గేవి
* అన్నదాతలకు ఎంతో ప్రయోజనం చేకూరేది

న్యూఢిల్లీ, హైదరాబాద్, న్యూస్‌లైన్: రైతు శ్రేయస్సే తమ ధ్యేయమని చెప్పుకునే కేంద్ర సర్కారు ఆ రైతుకే సున్నం పెట్టింది. రైతన్నకు దక్కాల్సిన వేల కోట్లను తన బొక్కసంలో వేసుకుంది! వచ్చే 2012-13 సంవత్సరానికిగాను డీఏపీ, ఎంవోపీ ఎరువులకు ఇచ్చే సబ్సిడీలో ఏకంగా 33 శాతం కోత పెట్టింది. ఈ మేరకు కేంద్ర కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. దీనివల్ల కేంద్ర ఖజానాకు రూ.10 వేల కోట్లు మిగలనున్నాయి. ఈ నిర్ణయంతో రైతుపై ఎలాంటి భారం పడదని, ఎరువుల ఎమ్మార్పీ రేట్లలో ఎలాంటి పెరుగుదల ఉండదని కేంద్ర సర్కారు ప్రకటించింది. 

వాస్తవానికి ఈ సబ్సిడీకి కోత పెట్టకుండా, ఇప్పుడు ఉన్నట్లే కొనసాగించినా ప్రభుత్వంపై ఎలాంటి అదనపు భారం పడదు. పైగా ఎరువుల రేట్లు గణనీయంగా తగ్గే అవకాశం ఉండేది. ఫలితంగా దేశంలో.. ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్‌లో అప్పుల ఊబిలో చిక్కుకుపోయిన రైతులకు ఎంతో ఊరట లభించేది. కానీ సర్కారు అలా చేయలేదు. సబ్సిడీని మినహాయించుకుని, రైతులకు మాత్రం పాత రేట్లకే ఎరువులను అంటగడుతోంది. పరిస్థితి ఇలాగే ఉంటే ఎరువుల రేట్లు తగ్గకపోగా.. మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది.

ముఖ్యమైన ఎరువులకే కోత..
అంతర్జాతీయ మార్కెట్‌లో ఎరువుల ముడి సరుకుల ధరలు 20 శాతం మేర తగ్గడంతో సబ్సిడీలో 33 శాతం మేర కోత విధించినట్లు కేంద్రం తెలిపింది. కేవలం ఫాస్పేట్, పొటాషియం ఎరువులకు ఇచ్చే సబ్సిడీలోనే 20 శాతం దాకా కోత ఉండొచ్చని పేర్కొంది. రైతులకు ఈ ఎరువులే అధికంగా కావాల్సి ఉండటం గమనార్హం. కేంద్ర ప్రభుత్వం ఎరువులకు సంబంధించి సుమారు రూ.65 వేల కోట్ల సబ్సిడీ ఇస్తోంది. అందులో రూ.52 వేల కోట్ల సబ్సిడీ ఫాస్పేట్, పొటాషియం ఎరువులకే అందిస్తోంది. ప్రస్తుతం సబ్సిడీలో కోత విధించినవాటిల్లో ఫాస్పేట్, పొటాషియం ఎరువుల వాటాయే ఎక్కువగా ఉంది.

రైతుకు నష్టం ఇలా...
కంపెనీలకు ఎరువుల ఉత్పత్తి ఖర్చులు పెరిగితే.. ఆ వెంటనే అదే స్థాయిలో రైతులపై భారం పడుతుంది. అదే అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి సరుకుల ధరలు తగ్గి ఉత్పత్తి ఖర్చులు తగ్గితే మాత్రం బహిరంగ మార్కెట్‌లో ఎరువుల ధర పైసా తగ్గదు. ఎరువుల విషయంలో కేంద్రం అనుసరిస్తున్న ఈ విధానం... రైతు వ్యతిరేకం. కేంద్రం 2010 ఏప్రిల్ నుంచి అమల్లోకి తెచ్చిన పోషకాల ఆధారిత సబ్సిడీ విధానం(ఎన్‌బీఎస్) రైతులకు శాపంగా మారింది. ఎరువుల సబ్సిడీలో కోతతో రైతులకు ఇబ్బందేమీ ఉండదని చెబుతున్నా ఇది తాత్కాలికమే. ముడి సరుకుల ధరలు పెరిగినప్పుడు మళ్లీ ధరలు పెరగడం ఖాయం. 

గతంలో విధానానికి పూర్తి భిన్నంగా ఎన్‌బీఎస్ ఉంది. ఇందులో సబ్సిడీ స్థిరంగా ఉండి రైతులకు విక్రయించే ఎమ్మార్పీ ధరల్లో తేడా ఉంటుంది. దీంతో ధరలు అమాంతంగా పెరుగుతున్నాయి. మన దేశంలో డీఏపీ, ఎంవోపీ (పొటాష్) ఎరువుల తయారీకి వినియోగించే ముడి సరుకులన్నీ విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిందే. 2011 జూన్‌లో టన్ను డీఏపీ తయారీకి అవసరమయ్యే ముడి సరుకు ధర 612 డాలర్లు ఉండేది. ఎరువులకు డిమాండ్ ఎక్కువగా ఉండే ఆగస్టు, సెప్టెంబర్‌లో అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిసరుకుల ధర 677 డాలర్లకు చేరింది. దీంతో గత ఖరీఫ్ మొదట్లో రూ.487 ఉన్న డీఏపీ బస్తా ధర ఏడాదిలోనే రూ. 956కు పెరిగింది. 

ఇలా ధరలు అమాంతంగా పెరిగినప్పుడూ ముందుగా ఖరారు చేసిన సబ్సిడీ కన్నా రూపాయి కూడా అదనంగా భరించేందుకు కేంద్రం సిద్ధపడలేదు. కరువుతో రైతులు సర్వం కోల్పోయినా కనికరించలేదు. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి సరుకుల ధరలు తగ్గినప్పుడు మాత్రం ఆ లాభాన్ని రైతులకు అందించకుండా తన్నుకుపోతోంది. ఇందుకు తాజాగా కేంద్రం ఎరువుల సబ్సిడీలో కోత విధించడమే ఉదాహరణ
Share this article :

0 comments: