టీడీపీలో చిచ్చు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » టీడీపీలో చిచ్చు

టీడీపీలో చిచ్చు

Written By news on Sunday, March 18, 2012 | 3/18/2012

రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక టీడీపీలో చిచ్చు రేపింది. పార్టీ కోసమే పనిచేస్తున్న సీనియర్లు, అవసరానికి ఉపయోగపడిన వారికి మొండిచేయి చూపి సీఎం రమేష్‌, దేవేందర్‌గౌడ్‌ను ఎంపిక చేసిన చంద్రబాబుపై పలువురు నేతలు గుర్రుగా ఉన్నారు. చంద్రబాబు తన సొంత కోటరీకి చెందిన సీఎం రమేష్‌ను, పార్టీ నుంచి వెళ్లిపోయి టీడీపీని, చంద్రబాబును తిట్టిపోసిన దేవేందర్‌గౌడ్‌ను రాజ్యసభ అభ్యర్థులుగా ఖరారు చేయడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. తమ అసంతృప్తిని బహిరంగంగానే వెళ్లగక్కుతున్నారు. టీడీపీని కాంట్రాక్టర్ల పార్టీగా మార్చేశారంటూ కోడెల శివప్రసాదరావు ధ్వజమెత్తారు. ఇలాగే ముందుకెళితే 2014 వరకు పార్టీ ఉంటుందా అంటూ కేఈ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. పార్టీని అమ్ముకున్నారంటూ తలసాని శ్రీనివాస యాదవ్ సీనియర్ల వద్ద వాపోయారు. అయితే రాజ్యసభ అభ్యర్థులను పేర్లను టీడీపీ అధికారికంగా ప్రకటించాల్సివుంది. 
Share this article :

0 comments: