వైఎస్ మరణంపై అనేక అనుమానాలున్నాయి. ఆ కేసును ఆదరా బాదరాగా ఎందుకు ముగించారు? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్ మరణంపై అనేక అనుమానాలున్నాయి. ఆ కేసును ఆదరా బాదరాగా ఎందుకు ముగించారు?

వైఎస్ మరణంపై అనేక అనుమానాలున్నాయి. ఆ కేసును ఆదరా బాదరాగా ఎందుకు ముగించారు?

Written By news on Wednesday, March 14, 2012 | 3/14/2012


‘‘రాష్ట్ర ప్రజల్లో చెదరని ముద్ర వేసుకున్న దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి మరణంపై అనేక అనుమానాలున్నాయి. అవి ఇప్పటికీ ప్రజల మనస్సును కలిచివేస్తున్నాయి. దానిపై విచారణ చేపట్టిన సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ.. ఆ కేసును ఆదరా బాదరాగా ఎందుకు ముగించారు? అంత త్వరగా పూర్తి చేయాలని ఎవరైనా ఆదేశించారా? ప్రస్తుతం జగన్ ఆస్తుల కేసులో మూకుమ్మడి దాడి చేయడంలో ఆయన లక్ష్యం ఏంటి’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు ప్రశ్నించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వైఎస్ కుటుంబంపై సీబీఐ జేడీ వ్యవహరిస్తున్న పక్షపాత ధోరణిపై ప్రజల్లో అనేక అనుమానాలు రేకెత్తిస్తున్నాయని, వీటన్నింటిపై వాస్తవాలు వెల్లడి కావాలంటే వెంటనే ఆయనపై స్వతంత్ర దర్యాప్తు సంస్థ చేత విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.


సీబీఐకి వాస్తవాలు పట్టవా?

జగన్ కేసు విషయంలో సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ ప్రత్యేక ఎజెండాతో విచారణ చేస్తున్నారని.. సుప్రీంకోర్టు ఆరుగురు మంత్రులు, ఎనిమిది మంది ఐఏఎస్ అధికారులకు నోటీసులివ్వడంతో సీబీఐ దర్యాప్తులోని డొల్లతనం బయటపడిందని గట్టు ధ్వజమెత్తారు. కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాల మేరకు టీడీపీ, ఎల్లో మీడియా చేస్తున్న ఆరోపణల ఆధారంగా సీబీఐ జేడీ ముందెకెళ్తున్నారని ఆరోపించారు. టీడీపీ అధినేత చంద్రబాబుపై సీబీఐ జేడీ మొదటి నుంచి ప్రత్యేక అభిమానాన్ని చాటుకుంటున్నారని గట్టు రామచంద్రరావు ఆరోపించారు. 
Share this article :

0 comments: