కొత్తమల్లాయపాలెంలో మహానేత విగ్రహావిష్కరణ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » కొత్తమల్లాయపాలెంలో మహానేత విగ్రహావిష్కరణ

కొత్తమల్లాయపాలెంలో మహానేత విగ్రహావిష్కరణ

Written By ysrcongress on Wednesday, March 28, 2012 | 3/28/2012

జిల్లాలోని కొత్తమల్లాయపాలెం గ్రామంలో మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి ఆవిష్కరించారు. పూలమాల వేసి నివాళులర్పించారు. ఓదార్పుయాత్రలో భాగంగా గ్రామానికి వచ్చిన జగన్ కు అభిమానులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. అనంతరం జగన్ చేసిన ప్రసంగానికి విశేష స్పందన లభించింది. జగన్ వెంట తాజా మాజీ ఎమ్మెలే సుచరిత ఉన్నారు.
రైతుల కోసం సుచరిత పదవిని వదులుకున్నారని, వచ్చే ఎన్నికలలో ఆమెని గెలిపించుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి అన్నారు. కొత్తమల్లాయపాలెం గ్రామంలో మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడారు. వచ్చే ఎన్నికలు విలువలకు, వంచనకు మధ్య జరిగే పోటీ అని పేర్కొన్నారు. తమని ఓడించడానికి కాంగ్రెస్, టిడిపి కుమ్మక్కయ్యాయని తెలిపారు. డబ్బుతో ఓట్లను కొనేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. డబ్బు, మద్యంతో ఆత్మగౌరవాన్ని కొనలేరని హెచ్చరించారు.
Share this article :

0 comments: