మెగా.. ఏంటీ దగా!చిరంజీవి తీరుపై మండిపడుతున్న గిరిజనులు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » మెగా.. ఏంటీ దగా!చిరంజీవి తీరుపై మండిపడుతున్న గిరిజనులు

మెగా.. ఏంటీ దగా!చిరంజీవి తీరుపై మండిపడుతున్న గిరిజనులు

Written By ysrcongress on Monday, March 12, 2012 | 3/12/2012

అప్పుడలా.. ఇప్పుడిలా
చిరంజీవి తీరుపై మండిపడుతున్న గిరిజనులు 
పీఆర్పీ తొలి అభ్యర్థి {పచారానికి మొహం చాటేశారు
కాంగ్రెస్ అభ్యర్థి కోసం రెండు రోజుల పర్యటన 

మెగాస్టార్ దగా చేశారని గిరిజనులు మండిపడుతున్నారు. 2009 ఎన్నికలో పీఆర్పీ తొలి అభ్యర్థిగా గిరిజన మహిళ తుపాకుల మునెమ్మను చిరంజీవి ప్రకటించారు. కానీ ఆమె గెలుపు బాధ్యతలను విస్మరించారు. కనీసం ఒక్క రోజు కూడా మునెమ్మకు మద్దతుగా ప్రచారం నిర్వహించలేదు. అప్పట్లో గిరిజన మహిళను పట్టించుకోని చిరంజీవి, నేడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డి మద్దతుగా ప్రచారం చేయడం వివక్ష చూపడమేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

నెల్లూరు, న్యూస్‌లైన్ : సామాజిక న్యాయం అంటూ తెరమీదకొచ్చిన చిరంజీవి ప్రజారాజ్యం జెండాను తిప్పేశారు. ఏ నినాదంతో అయితే జనంలోకి వచ్చారో.. దాన్నే పక్కనబెట్టారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్‌లో కలిసిపోయి ఆ పార్టీ అభ్యర్థి విజయాన్ని కాంక్షిస్తూ కోవూరు నియోజక వర్గంలో రెండురోజుల పాటు విస్తృతంగా పర్యటించనున్నారు. చిరంజీవి రెండురోజుల పర్యటనపై గిరిజనులు గుర్రుగా ఉన్నారు. పీఆర్‌పీ తరుఫున పోటీ చేసిన గిరిజన అభ్యర్థి తుపాకుల మునెమ్మ విజయం కోసం ప్రచారానికి రాని చిరంజీవి, కాంగ్రెస్ అభ్యర్థి కోసం రెండురోజులు పర్యటించడాన్ని గిరిజనులు జీర్ణించుకోలేక పోతున్నారు. ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన అనంతరం హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో చిరంజీవి ఓ ప్రకటన చేశారు. పార్టీ తొలి అభ్యర్థిగా గిరిజన మహిళ అయిన తుపాకుల మునెమ్మ కోవూరు అసెంబ్లీ అభ్యర్థిగా ప్రకటించారు. ఆ ప్రకటన రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. చిరు కొత్త సంప్రదాయానికి తెరతీశారని ఇతర పార్టీలు, రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ఒక గిరిజన మహిళను అత్యున్నత స్థాయికి తీసుకెళ్తారని భావించారు. వారి ఆశలపై చిరు నీళ్లు చల్లారు. అది ఆరంభ సూరత్వమని తేలిపోయింది.

2009 ఎన్నికల తేదీ ప్రకటించాక పార్టీ అధినేత స్థాయిలో కోవూరు అభ్యర్థి అయిన తుపాకుల మునెమ్మ విజయం కోసం ఒక్కరోజుకూడా ప్రచారం చేసిన దాఖలాలు లేవు. సోదరుడు నాగేంద్రబాబు మాత్రమే ప్రచారం చేశారు. ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్‌లో విలీనమయ్యాక కోవూరు అభ్యర్థి పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి కోసం నియోజక వర్గంలో రెండు రోజులపాటు విస్తృతంగా పర్యటించనున్నారు. ఈ విషయాన్ని గిరిజనులు, పీఆర్పీ అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు. చిరంజీవి సామాజిక న్యాయం ఇదేనా అని ప్రశ్నిస్తున్నారు. మునెమ్మ కోసం కనీసం ఒక్క రోజైనా నియోజకవర్గంలో పర్యటించి ఉంటే మంచి ఫలితాలు వచ్చి ఉండేవని చెబుతున్నారు. అప్పట్లో రాని చిరంజీవి ఇప్పుడు రావడం ఏమిటని వారు మండిపడుతున్నారు.
Share this article :

0 comments: