వైఎస్సార్ అభిమాన మాజీ ఎంపీ, ఎమ్మెల్యేలకు స్థానం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్సార్ అభిమాన మాజీ ఎంపీ, ఎమ్మెల్యేలకు స్థానం

వైఎస్సార్ అభిమాన మాజీ ఎంపీ, ఎమ్మెల్యేలకు స్థానం

Written By ysrcongress on Tuesday, March 6, 2012 | 3/06/2012

కొత్తగా కేంద్ర కార్యనిర్వాహకమండలి ఏర్పాటు
వైఎస్సార్ అభిమాన మాజీ ఎంపీ, ఎమ్మెల్యేలకు స్థానం

హైదరాబాద్, న్యూస్‌లైన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో అత్యున్నత విధాన నిర్ణాయక కమిటీలను సోమవారం ప్రకటించారు. ఇప్పటికే పనిచేస్తున్న కేంద్ర పాలక మండలి(సెంట్రల్ గవర్నింగ్ కౌన్సిల్-సీజీసీ)లో కొన్ని మార్పులు చేయడంతో పాటు కొత్తగా కేంద్ర కార్యనిర్వాహక మండలిని(సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్-సీఈసీ) నియమించారు. పార్టీ నిర్మాణంలో సీజీసీ, సీఈసీ.. రెండూ సమాన హోదాలో పని చేస్తాయని, ఈ రెండు మండళ్లలోని సభ్యులకు సమాన ప్రాముఖ్యత ఉంటుందని పార్టీ వర్గాలు తెలిపాయి. పార్టీ అనుసరించే విధానాలపై తరచూ ఈ రెండు కమిటీలు సమావేశమై నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాయి. కమిటీల వివరాలివీ..

సీజీసీ(కేంద్ర పాలక మండలి) సభ్యులు

1. మేకపాటి రాజమోహన్‌రెడ్డి, 2. కొణతాల రామకృష్ణ, 3. పెన్మత్స సాంబశివరాజు, 4. వై.వి.సుబ్బారెడ్డి, 5. హబీబ్ అబ్దుల్ రెహమాన్, 6. భూమన కరుణాకర్‌రెడ్డి, 7. బాజిరెడ్డి గోవర్ధన్, 8. కె.కె.మహేందర్‌రెడ్డి, 9. జ్యోతుల నెహ్రూ, 10. జూపూడి ప్రభాకర్‌రావు, 11. డి.ఎ.సోమయాజులు, 12. భూమా నాగిరెడ్డి, 13. జక్కంపూడి విజయలక్ష్మి, 14. కణితి విశ్వనాథం, 15. తోపుదుర్తి కవిత, 16. వి.బాలమణెమ్మ, 17. మూలింటి మారెప్ప, 18. జంగా కృష్ణమూర్తి, 19. గిరిరాజ్ నగేష్, 20. గంపా వెంకటరమణ, 21. డి.రవీంద్రనాయక్, 22. పి.రాజశేఖర్, 23. కె.గంగారెడ్డి, 24. ఎం.వి.కృష్ణారావు.

సీఈసీ (కేంద్ర కార్యనిర్వాహక మండలి)

1. పిల్లి సుభాష్‌చంద్రబోస్, 2. బాలినేని శ్రీనివాస్‌రెడ్డి, 3. కొండా సురేఖ, 4. ధర్మాన కృష్ణదాస్, 5.జి.శ్రీకాంత్‌రెడ్డి, 6. గొల్ల బాబూరావు, 7. కాపు రామచంద్రారెడ్డి, 8. ఎం.ప్రసాదరాజు, 9.మేకపాటి చంద్రశేఖరరెడ్డి, 10. టి.బాలరాజు, 11. బి.గురునాథరెడ్డి, 12. మేకతోటి సుచరిత, 13.బి.శోభానాగిరెడ్డి, 14. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, 15. కె.చెన్నకేశవరెడ్డి, 16. ఆకేపాటి అమరనాథరెడ్డి, 17. కె.శ్రీనివాసులు, 18.ఆర్.కె.రోజా, 19. మదన్‌లాల్ నాయక్, 20. డి.సి.గోవిందరెడ్డి, 21. రావి వెంకట రమణ, 22. వై.విశ్వేశ్వరరెడ్డి, 23. కె.శివకుమార్, 24. యల్లసిరి గోపాల్‌రెడ్డి, 25. ఆది శ్రీనివాస్, 26. ఎం.ఎస్.రాజ్‌ఠాకూర్, 27.బండారు మోహన్‌రెడ్డి, 28. సంతోష్‌రెడ్డి, 29. రావుల రవీంద్రనాథ్‌రెడ్డి, 30. జహీర్ అహ్మద్, 31. ఎ.రామకృష్ణారెడ్డి, 32. రంగనాథ్‌రాజు, 33. అంబటి రాంబాబు, 34. బోడ జనార్దన్, 35. పి.సర్రాజు.

ఇతర నియామకాలు..

పార్టీ రాష్ట్ర ప్రచార కమిటీ కో-ఆర్డినేటర్‌గా విజయచందర్, విద్యార్థి విభాగ కన్వీనర్‌గా నేమూరి నవీన్ గౌడ్‌లను నియమించారు. పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌సూచన మేరకు వారిని ఎంపిక చేసినట్లు రాష్ట్ర కార్యాలయ సమన్వయ కర్త పీఎన్వీ ప్రసాద్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. అదే విధంగా అనంతపురం జిల్లా కార్మిక విభాగం కన్వీనర్‌గా కొర్రపాడు హుస్సేన్ పీరాను ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు.
Share this article :

0 comments: