ఇవి జగన్‌మోహన్‌రెడ్డికీ, చంద్రబాబునాయుడుకూ, సోనియాగాంధీకి మధ్య జరుగుతున్న పోరాటం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఇవి జగన్‌మోహన్‌రెడ్డికీ, చంద్రబాబునాయుడుకూ, సోనియాగాంధీకి మధ్య జరుగుతున్న పోరాటం

ఇవి జగన్‌మోహన్‌రెడ్డికీ, చంద్రబాబునాయుడుకూ, సోనియాగాంధీకి మధ్య జరుగుతున్న పోరాటం

Written By ysrcongress on Friday, March 16, 2012 | 3/16/2012

కోవూరు నుంచి న్యూస్‌లైన్ ప్రత్యేక ప్రతినిధి: ‘‘కోవూరు ఉప ఎన్నికల్లో ప్రజలిచ్చే ఈ తీర్పుతో రాష్ట్ర రాజకీయాలు మారబోతున్నాయి... రాష్ట్ర భవిష్యత్తును మార్చబోయే ఈ ఎన్నికల్లో నేను ప్రతి అవ్వా, ప్రతి తాతకూ చేసే విజ్ఞప్తి ఒక్కటే... మనసా, వాచా నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డిని ఆశీర్వదించండి... మేకపాటి రాజమోహన్‌రెడ్డికి మద్దతు ఇవ్వండి...’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి కోరారు. కోవూరు అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా జగన్ గురువారం.. నియోజవర్గం పరిధిలోని పలు గ్రామాల్లో పర్యటించారు. గురువారం రాత్రి కోవూరు బజారు సెంటర్‌లో జరిగిన భారీ బహిరంగ సభలో ఆయన ఆవేశపూరితంగా ప్రసంగించారు. ‘‘ఈ ఎన్నికలను ప్రసన్నకుమార్‌రెడ్డికీ, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డికీ, ఇతరులకూ మధ్య జరుగుతున్న పోటీగా చూడరాదు... ఇవి జగన్‌మోహన్‌రెడ్డికీ, చంద్రబాబునాయుడుకూ, సోనియాగాంధీకి మధ్య జరుగుతున్న పోరాటంగా ప్రజలు గమనించాలి’’ అని పేర్కొన్నారు. 

నాకు తెలిసిందల్లా నిజాయతీ రాజకీయాలే: రాష్ట్రంలో ప్రస్తుతం చోటు చేసుకుంటున్న కుమ్మక్కు రాజకీయాలను ఆయన ప్రస్తావిస్తూ.. ‘‘నాకు చంద్రబాబునాయుడు మాదిరిగా రాజకీయాల్లో కుళ్లు, కుతంత్రాలు తెలియవు. తెలిసిందల్లా ఒక్కటే.. నిజాయతీగా రాజకీయాలు చేయటమే..! కలుషితమైన రాజకీయ వ్యవస్థలో విలువలను, విశ్వసనీయతను పెంపొందించటానికే కృషి చేస్తున్నాను...’’ అని జగన్ పేర్కొన్నారు. ‘‘కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోదు అని నిర్ధారణకు వచ్చాకనే చంద్రబాబు కాంగ్రెస్ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టారు. అదే ఆరు నెలల ముందు చిరంజీవి కాంగ్రెస్ పార్టీలో విలీనం కాక ముందు ఎందుకు పెట్టలేదు?’’ అని ఆయన ప్రశ్నించారు. ‘‘ప్రభుత్వంపై చంద్రబాబు అవిశ్వాస తీర్మానం పెట్టింది ప్రభుత్వాన్ని పడగొట్టటానికి కాదు.. జగన్‌నూ, ఆయన ఎమ్మెల్యేలనూ ఇరకాటంలో పెట్టటానికే.. వారు తీర్మానానికి అనుకూలంగా ఓటు చేసి అనర్హులు కావటానికే పెట్టారు’’ అని జగన్ విమర్శించారు. 

‘‘నన్ను నమ్ముకున్న ఎమ్మెల్యేలకు, ఎంపీలకు ఆ రోజు ఒకటే చెప్పాను. మనం పేద ప్రజల కోసం, వారి సమస్యల కోసం నిలబడాలి. అవసరమైతే రాజీనామాలు చేయాల్సి రావచ్చు... మన పద వులు పోయినా ఫర్వాలేదు.. అని చెప్పాను. చెడిపోయిన రాజకీయ వ్యవస్థలో విలువలు పెపొందింటానికి, విశ్వసనీయతను పెంపొందించటానికి కృషి చేయాలని చెప్పాను. నా మాటకు కట్టుబడి 17 మంది ఎమ్మెల్యేలు అవిశ్వాసానికి ఓటేసినందుకు వారికి సెల్యూట్ చేస్తున్నా’’ అని జగన్ పేర్కొన్నారు. 

బాబూ... వేల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి?: అవినీతి గురించి మాట్లాడుతున్న చంద్రబాబు 1978లో ఎమ్మెల్యేగా పోటీ చేసే నాటికి కేవలం రెండెకరాల ఆసామి అనీ.. అలాంటి వ్యక్తికి నేడు వేలాది కోట్ల రూపాయల ఆస్తులు ఎలా వ చ్చాయని జగన్ ప్రశ్నించారు. రాష్ట్రంలోనూ, దేశంలోనూ ఎక్కడ చూసినా కనిపిస్తున్న హెరిటేజ్ షాపులు ఎక్కడివని నిలదీశారు. ‘‘అబద్ధపు ప్రచారం చేస్తూ తిరుగుతున్న బాబు.. ఎదుటి వారి వైపు ఒక వేలు చూపితే నాలుగు వేళ్లు తనకేసి చూపుతాయని మరిచి పోతే ఎలా..?’’ అని ఆయన ఎద్దేవా చేశారు. 

నాడు ఫీజులెలా కడుతున్నారని అడిగావా.. బాబూ?: ‘‘చంద్రబాబు ఈ మధ్య కళాశాలలకు వెళ్లి విద్యార్థులను కలుస్తున్నారు. వారికి అవినీతి గురించి ఉపన్యాసాలు ఇస్తున్నారు. ఆయన ఎందుకు వెళుతున్నారో తెలుసు... బహుశా అక్కడ ఉన్న పిల్లకాయలంతా జగన్ వయసు వారే కనుక ఆయనకే మద్దతు ఇస్తారని భావించి వారి వద్దకు వెళుతున్నారు... నేనొక ప్రశ్న అడుగుతున్నాను. బాబు సీఎంగా ఉన్నపుడు ఏనాడైనా కళాశాలలకు వెళ్లారా...? ఎలా చదువుకుంటున్నారని విద్యార్థులను ప్రశ్నిం చారా..? ఫీజులు ఎలా కడుతున్నారని అడిగారా..? వారి తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారని కనుక్కున్నారా?’’ అని జగన్ నిలదీశారు. విద్యార్థులు ఎలాగున్నా రో అని ఏనాడూ కనుక్కోని బాబు ఇవాళ కళాశాలలకు వెళుతున్నారని ఎద్దేవా చేశారు.
Share this article :

0 comments: