కడప ఉప ఎన్నికల్లో నన్ను బరిలో దింపి బలి పశువును చేశారు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » కడప ఉప ఎన్నికల్లో నన్ను బరిలో దింపి బలి పశువును చేశారు

కడప ఉప ఎన్నికల్లో నన్ను బరిలో దింపి బలి పశువును చేశారు

Written By news on Wednesday, March 21, 2012 | 3/21/2012

ఉప ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమికి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ బాధ్యత వహించాల్సిందేనని రాష్ర్ట వైద్య శాఖ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి స్పష్టం చేశారు. అలాగే రాష్ట్ర మంత్రివర్గమంతా ఫలితాలకు బాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఉప ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం శాసనసభ లాబీలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘ఉప ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్‌కు గుణపాఠం. డబ్బు, అధికారం, హంగు, అర్భాటాలన్నీ ఉన్నా ఓడిపోయాం. డబ్బులు ఎక్కువిస్తే ఓటేస్తారనుకుంటే ప్రజలు సరైన తీర్పు ఇచ్చారు. మా పాలన ఎట్లుందో నేను ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. మీకు (మీడియా) అంతా తెలుసు. అన్నీ ఉన్నా ఎందుకు ఓడిపోతున్నామనే ఆత్మ విమర్శ చేసుకోవాలి. కడప ఉప ఎన్నికల్లో నన్ను బరిలో దింపి బలి పశువును చేశారు. నేనెప్పుడు పోటీ చేసినా వెయ్యి ఓట్లు అటు ఇటుగా గెలిచే వాడిని. కానీ మొన్నటి ఎన్నికల్లో 5 లక్షల ఓట్లతో ఓడిపోయానంటే పరిస్థితి ఎట్లా ఉందనే దానిపై అప్పుడే సమీక్షించుకుంటే బాగుండేది. అయినా జరగలేదు. లోపమెక్కడ ఉంది? ప్రజలెందుకు కాంగ్రెస్‌కు దూరమవుతున్నారు? కారణమెవరు? అనే దానిపై సమీక్షించుకోవాలి. అధిష్టానవర్గం ఇప్పటికైనా జోక్యం చేసుకోవాలి’’అని చెప్పారు. 

వైఎస్ జగన్‌ను అరెస్టు చేస్తే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయొచ్చని అధికార పార్టీ నేతల్లో జరుగుతున్న ప్రచారాన్ని ప్రస్తావించగా, జగన్‌ను అరెస్టు చేస్తే జనం ఊరుకుంటారా? అని ప్రశ్నించారు. మరింత సానుభూతి పెరుగుతుందన్నారు. 
Share this article :

0 comments: