ఏడు నియోజకవర్గాల్లో ఓట్ల లెక్కింపు.. అందరి దృష్టి కోవూరుపైనే - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఏడు నియోజకవర్గాల్లో ఓట్ల లెక్కింపు.. అందరి దృష్టి కోవూరుపైనే

ఏడు నియోజకవర్గాల్లో ఓట్ల లెక్కింపు.. అందరి దృష్టి కోవూరుపైనే

Written By ysrcongress on Wednesday, March 21, 2012 | 3/21/2012


ఉదయం 10.30 గంటల కల్లా కౌంటింగ్ పూర్తి

హైదరాబాద్, న్యూస్‌లై న్: అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికల ఫలితాలు మరికొద్ది గంటల్లో వెల్లడికానున్నాయి. ఆదివారం పోలింగ్ జరిగిన కోవూరు, మహబూబ్‌నగర్, కొల్లాపూర్, స్టేషన్ ఘన్‌పూర్, నాగర్ కర్నూలు, కామారెడ్డి, ఆదిలాబాద్ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు బుధవారం ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ తెలిపారు. ఓట్ల లెక్కింపు ఏర్పాట్లపై ఆయా జిల్లాల కలెక్టర్లు, అధికారులతో భన్వర్‌లాల్ మంగళవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతరం విలేకరుల సమావేశంలోమాట్లాడారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు కావడంతో ఏడు స్థానాల ఫలితాలు ఉదయం 10.30 గంటలకల్లా పూర్తిగా వెలువడతాయని ఆయన చెప్పారు. తొలుత పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తారని, తరువాత రౌండ్ల వారీగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లోని ఓట్లను లెక్కించనున్నట్లు తెలిపారు. ఏడు నియోజకవర్గాల్లో మొత్తం 67 మంది పోటీలో ఉన్న విషయం తెలిసిందే. ప్రధానంగా కోవూరులో వైఎస్సార్ కాంగ్రెస్, కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల మధ్య పోటీ నెలకొనగా.. తెలంగాణ జిల్లాల్లోని ఆరు నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్, కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు తలపడ్డాయి. అన్ని నియోజకవర్గాల్లో ఓట్ల లెక్కింపునకు 14 టేబుల్స్ చొప్పున ఏర్పాటు చేశామని, ఒక్కో టేబుల్‌కు ఒక్కో సూపర్‌వైజర్ చొప్పున 120 మందిని నియమించారు. ఒక్కో టేబుల్‌కు ఒక్కో అసిస్టెంట్ చొప్పున 130 మందిని, ఒక్కో టేబుల్‌కు ఒక్కో మైక్రో పరిశీలకుని చొప్పున 123 మందిని నియమించారు. ఓట్ల లెక్కింపు ఏర్పాట్ల వివరాలివీ..


అందరి దృష్టి కోవూరుపైనే...

నెల్లూరు, న్యూస్‌లైన్ ప్రతినిధి: ఉప ఎన్నికల ఫలితాలువెల్లడి కానున్న నేపథ్యంలో అందరి దృష్టి కోవూరుపైనే కేంద్రీకృతమైంది. సీమాంధ్రలో జరిగిన ఏకైక ఉప ఎన్నిక ఇదే కావడంతో జనంతో పాటు, అన్ని రాజకీయ పార్టీల్లో ఈ స్థానం ఫలితం ఉత్కంఠ రేపుతోంది. ఇక్కడి ఫలితంపై వందల కోట్ల రూపాయల పందేలు జరిగాయి. కోవూరు ఉప ఎన్నికల బరిలో 14 మంది అభ్యర్థులు ఉన్నప్పటికీ ప్రధానంగా వైఎస్సార్ కాంగ్రెస్ (నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి), టీడీపీ (సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి), కాంగ్రెస్ (పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి) అభ్యర్థుల మధ్యే పోటీ నెలకొంది. పోలింగ్ శాతం పెరగడంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి భారీ మెజారిటీ వస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Share this article :

0 comments: