ప్రధానికి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి లేఖ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ప్రధానికి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి లేఖ

ప్రధానికి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి లేఖ

Written By ysrcongress on Friday, March 9, 2012 | 3/09/2012

* పత్తి ఎగుమతులపై నిషేధం.. రాష్ట్రంపై ప్రతికూల ప్రభావం చూపిస్తోంది
* వ్యాపారులు కొనుగోళ్లు నిలిపేశారు.. రైతు ఆదాయానికి గండి పడింది
* వ్యవసాయ నిర్ణయాలు తీసుకునేటపుడు రాష్ట్రాలను సంప్రదించే విధానం తెండి

హైదరాబాద్, న్యూస్‌లైన్: పత్తి ఎగుమతుల మీద విధించిన నిషేధాన్ని తక్షణం తొలగించాలని విజ్ఞప్తి చేస్తూ ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌కు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి గురువారం లేఖ రాశారు. నిషేధం తొలగించాలని రైతుల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ వచ్చాక కూడా.. ఈ అంశాన్ని మంత్రుల బృందానికి నివేదించాల్సిన అవసరం ఏమి వచ్చిందని ఆయన ప్రశ్నించారు. లేఖ పూర్తి పాఠమిదీ..

గౌరవనీయ ప్రధానమంత్రి,
పత్తి ఎగుమతుల మీద నిషేధం విధించిన నేపథ్యంలో రైతుల నుంచి పత్తి కొనుగోలును వ్యాపారులు నిలిపివేశారు. అత్యధికంగా పత్తి పండిస్తున్న గుజరాత్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రైతుల మీద కేంద్ర ప్రభుత్వ నిర్ణయం తీవ్ర ప్రతికూల ప్రభావం చూపిస్తోంది. పత్తి రైతుల ఆదాయ మార్గాలకు గండిపడింది. పత్తి ఎగుమతుల మీద కేంద్ర వాణిజ్య శాఖ విధించిన నిషేధాన్ని సమీక్షించే బాధ్యతను ఆర్థిక మంత్రి నేతృత్వంలోని మంత్రుల బృందానికి మీరు అప్పగించినట్లు మీడియా ద్వారా తెలిసింది.

నిషేధం తొలగించాలని పత్తి రైతులు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో.. తక్షణం నిషేధం ఎత్తేస్తూ నిర్ణయం తీసుకోకుండా ఈ అంశాన్ని మంత్రుల బృందానికి నివేదించాల్సిన అవసరం ఏమిటనే విషయం నన్ను ఆశ్చర్యానికి గురి చేసింది. పత్తి ఎగుమతుల మీద తక్షణం నిషేధం తొలగించాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా. వ్యవసాయం, రైతుల మీద ప్రభావం చూపించే ముఖ్యమైన నిర్ణయాలు తీసుకొనే ముందు సంబంధిత రాష్ట్రాల అభిప్రాయాలను తీసుకొనే విధానాన్ని అమలు చేస్తే.. తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కోవాల్సిన పరిస్థితులను తప్పించుకోవచ్చు.

మీ..
వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి
Share this article :

0 comments: