వైఎస్ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన జగన్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన జగన్

వైఎస్ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన జగన్

Written By news on Wednesday, March 28, 2012 | 3/28/2012

ఎండ వేడిని లెక్కచేయకుండా ఓదార్పు యాత్రలో అవిశ్రాంతంగా ముందుకు కదులుతున్న జగన్మోహనరెడ్డికి గుంటూరు జిల్లా పాతమల్లాయపాలెం వాసులు తమ పల్లెకు ప్రేమగా ఆహ్వానించారు. తామంతా చందాలేసుకుని ఏర్పాటు చేసుకున్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని ఆయన చేత ఆవిష్కరింపజేసుకున్నారు.

వైఎస్‌ఆర్ అమర్ రహే నినాదాలతో దివంగతను స్మరించుకున్నారు. సభలో ఎక్కువ సేపు మాట్లాడలేక పోతున్నందుకు మరోలా భావించవద్దంటూ జగన్ ఆ పల్లె వాసులకు విజ్ఞప్తి చేసుకున్నారు. వారందరికి సవినయంగా నమస్కరించి మరోచోటికి బయలు దేరారు.ఒక ఎంపీ, 18 అసెంబ్లీ స్థానాల్లో జరిగే ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే విజయమని మాజీ ఎమ్మెల్యే గుర్నాథరెడ్డి అన్నారు. ఆయన బుధవారమిక్కడ విలేకర్లతో మాట్లాడుతూ ఉప ఎన్నికల ఫలితాలు వెలువడిన రెండు మాసాల్లో కిరణ్ ప్రభుత్వం కూలిపోతుందన్నారు. ఒక్కో రాజ్యసభ సీటును చంద్రబాబునాయుడు రూ.100 కోట్లకు అమ్ముకున్నారని గుర్నాధరెడ్డి ఆరోపించారు. ఇప్పుడు డబ్బులు లేవంటూ మొసలి కన్నీరు కారుస్తున్నారని ఆయన అన్నారు.
Share this article :

0 comments: