రామోజీ మరో కబ్జాపై సర్వే - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రామోజీ మరో కబ్జాపై సర్వే

రామోజీ మరో కబ్జాపై సర్వే

Written By ysrcongress on Saturday, March 3, 2012 | 3/03/2012

కొహెడ భూముల్లోనూ ప్రారంభం 
411, 412 సర్వే నంబర్లలో ఈటీఎస్ పద్ధతిలో సర్వే
మూడురోజుల్లో హద్దులు నిర్ధారిస్తామన్న అధికారులు
15 ఎకరాల మిగులు భూముల్ని ఇళ్లస్థలాల కోసం ఇవ్వాలంటున్న గ్రామస్తులు

హైదరాబాద్, న్యూస్‌లైన్: నగర శివారు హయత్‌నగర్ మం డలం కొహెడ గ్రామంలో రామోజీ ఫిలింసిటీ కబ్జాలో ఉందని భావిస్తున్న భూమి సర్వేపై కొంతకాలంగా నాన్చుడు ధోరణి అవలంబించిన అధికారులు ఎట్టకేలకు కదిలారు. కొహెడలోని 15 ఎకరాల సీలింగ్ భూమినీ రామోజీరావు కబ్జా చేసిన వైనంపై.. శుక్రవారం ‘సాక్షి’టీవీలో ప్రసారమైన కథనం నేపథ్యంలో వెంటనే స్పందించారు. శుక్రవారమే ఆ భూమిలో సర్వే ప్రారంభించారు. రంగారెడ్డి జిల్లా సర్వే డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ అంబర్‌సింగ్ ఆధ్వర్యంలో సర్వే నం-411, 412లో సర్వే మొదలు పెట్టారు. ఎలక్ట్రానిక్ టోటల్ స్టేషన్ (ఈటీఎస్) పద్ధతిలో సర్వేను చేపట్టారు. 411, 412 సర్వే నంబర్లలో సుమారు 15 ఎకరాల పట్టాభూమిని కొన్న రామోజీరావు మరో 15 ఎకరాల మిగులుభూమిని తన అధీనంలో ఉంచుకున్నట్లు గుర్తిం చిన గ్రామస్తులు (ఉమర్‌ఖాన్‌గూడ) అధికారులకు ఫిర్యాదు చేశారు. 

ఆరు నెలల క్రితం రామోజీ అధీనంలో ఉన్న మిగులు భూమిని ఇళ్ళ స్థలాల కోసం చదును చేసేందుకు ఉపక్రమించారు. అయితే ఫిలింసిటీ సిబ్బంది గ్రామస్తులను అడ్డుకున్నారు. ఉద్రిక్త వాతావరణం ఏర్పడటంతో జోక్యం చేసుకున్న అధికారులు రామోజీ భూములపై సర్వే నిర్వహించి మిగులు భూములుంటే గుర్తిస్తామని గ్రామస్తులకు హామీ ఇచ్చారు. అప్పటికి గొడవ సద్దుమణగగా ఆ తర్వాత అధికారులు గ్రామస్తులకు ఇచ్చిన హామీని మరిచిపోయారు. దీంతో భూమిని సర్వే చేయాలని కోరుతూ గ్రామస్తులు అనేకసార్లు జిల్లా కలెక్టర్‌తో పాటు ఇతర ఉన్నతాధికారులకు మొరపెట్టుకున్నారు. 

అయినా అధికారులు స్పందించలేదు. సర్వేపై కుంటిసాకులు చెబుతూ కాలయాపన చేశారు. ఈ నేపథ్యంలోనే ఈ ఉదంతంపై శుక్రవారం సాక్షి టీవీలో కథనం ప్రసారమైంది. దీంతో కదిలిన అధికారులు సర్వే మొదలుపెట్టారు. సర్వేను వీలైనంత త్వరగా పూర్తి చేస్తామని అంబర్‌సింగ్ తెలిపారు. శుక్రవారంతో ఈటీఎస్ మిషన్ సర్వే పూర్తవుతుందని అనంతరం మ్యాప్‌ను రూపొందించి సీలింగ్ భూమికి, పట్టా భూమికి హద్దులు నిర్ధారిస్తామని చెప్పారు. మూడురోజుల్లో ఈ మేరకు పూర్తి నివేదికను తహశీల్దార్‌కు ఇస్తామని వెల్లడించారు. అయితే రామోజీ చెర నుంచి మిగులు భూములను అధికారులు ఎప్పటిలోగా విడిపిస్తారో అనే అంశంపై గ్రామస్తుల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సర్వే నెం- 411, 412లో మొత్తం సుమారు 30 ఎకరాల భూమి ఉందని, రామోజీరావు కొన్న భూమి పోను మిగులు భూమిని ఇళ్ళ స్థలాలుగా ఇవ్వాలని ఉమర్‌ఖాన్‌గూడ గ్రామస్తులు కోరుతున్నారు. మరోవైపు సర్వే చేసిన అధికారులు చదునుగా ఉన్న భూమిని రామోజీరావుకు ఇచ్చి గుట్టలు, రాళ్ళతో కూడిన భూమిని సీలింగ్ భూమిగా చూపిస్తారేమోనని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సర్వే జరిగినంతసేపు ఫిలింసిటీ ల్యాండ్ సూపర్‌వైజర్ పాపిరెడ్డితో పాటు నలుగురు సిబ్బంది అధికారుల వెంట ఉండడం గ్రామస్తుల అనుమానాలకు బలం చేకూరుస్తోంది. నివాసయోగ్యమైన భూమిని ఇళ్ళ స్థలాలకు ఇవ్వాలని గ్రామస్తులు కోరుతున్నారు. అనాజ్‌పూర్ గ్రామ పరిధిలోనూ 60.10 ఎకరాల మిగులు భూమి రామోజీ ఫిలిం సిటీ పడగ కింద ఉన్నట్లు ఇటీవలి సర్వేలో తేలడంతో దానిని మిగులుభూమిగా నిర్ధారించిన జాయింట్ కలెక్టర్ కోర్టు.. దీనిపై రామోజీ వేసిన పిటిషన్‌ను కొట్టివేసిన సంగతి తెలిసిందే. దీనిపై ఉషాకిరణ్‌మూవీస్ హైకోర్టును ఆశ్రయించింది.
Share this article :

0 comments: