సిబిఐ జెడి తీరుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ నిరసన - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » సిబిఐ జెడి తీరుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ నిరసన

సిబిఐ జెడి తీరుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ నిరసన

Written By ysrcongress on Tuesday, March 13, 2012 | 3/13/2012

సిబిఐ జెడి లక్ష్మీనారాయణ తీరుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. లక్ష్మీనారాయణ న్యాయవాదులను కలిసి వారిని ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు ఆరోపించారు. కోర్టు వ్యవహారాలలో జోక్యం చేసుకోవడం తగదన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు ఆయన విలేకరులతో మాట్లాడారు. లక్ష్మీనారాయణ కాంగ్రెస్, టిడిపి, ఈనాడు కనుసన్నల్లో పని చేస్తున్నారన్నారు. ఆయన విచారణపై మరో విచారణ జరిపితే అసలు నిజాలు వెలుగులోకి వస్తాయని గట్టు అన్నారు. సిబిఐ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చెప్పుచేతుల్లో ఉందని విమర్శించారు. తప్పుడు జిఓలుగా పేర్కొన్నవాటిని జారీచేసినవారిని విచారించకుండా సిబిఐ ఏకపక్షంగా, పక్షపాత ధోరణితో వ్యవహరించిందని ఆరోపించారు. సుప్రీం కోర్టు ఇచ్చిన నోటీసులకు సిబిఐ విరణ ఇవ్వాలన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు మహానేత డాక్టర్ వైఎస్ కుటుంబానికి క్షమాపణలు చెప్పాలన్నారు. 

హైకోర్టు అడిగిన రోజునే ఆ జిఓలు సక్రమమైనవేనని ప్రభుత్వం చెప్పి ఉంటే పరిస్థితి ఇక్కడదాకా వచ్చేది కాదన్నారు. ఆ రోజు ప్రభుత్వం ఎందుకు స్పందించలేదో చెప్పాలని ఆయన నిలదీశారు. 
ఆ జిఓలు జారీ చేసిన మంత్రుల పేర్లు తెలుగుదేశం పార్టీ ఇచ్చిన ఫిర్యాదులో ఎందుకు రాయలేదో చెప్పాలన్నారు. వారికి టిడిపి వారికి ఉన్న సంబంధం ఏమీటో తెలపాలని డిమాండ్ చేశారు. సుప్రీం కోర్టు నోటీసులు ఇవ్వడంతో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల పరిస్థితి కుడితిలోపడ్డ ఎలుకల్లాగా తయారయిందన్నారు.
Share this article :

0 comments: