సీఎం రమేష్ తప్పుడు అఫిడవిట్ ఇచ్చారు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » సీఎం రమేష్ తప్పుడు అఫిడవిట్ ఇచ్చారు

సీఎం రమేష్ తప్పుడు అఫిడవిట్ ఇచ్చారు

Written By ysrcongress on Wednesday, March 21, 2012 | 3/21/2012

రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన తెలుగుదేశం పార్టీ నాయకుడు, రిత్విక్ ప్రాజెక్ట్స్ అధినేత సీఎం రమేష్ ఎన్నికల అఫిడవిట్‌లో తనపై ఏ కేసులూ లేవని తప్పుడు సమాచారం ఇచ్చారని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్‌కు శేషయ్య నాయుడు కన్‌స్ట్రక్షన్స్ ప్రతినిధులు మంగళవారం ఫిర్యాదు చేశారు. 

తమకు డబ్బులు ఇవ్వకుండా మోసం చేసిన సీఎం రమేష్‌పై అంబర్‌పేట్ పోలీస్‌స్టేషన్‌లో నమోదైన కేసు వివరాలు, ఎఫ్‌ఐఆర్ కాపీ, కోర్టు ఆదేశాలను భన్వర్‌లాల్‌కు అందజేశారు. అనంతరం శేషయ్యనాయుడు కన్‌స్ట్రక్షన్స్ ప్రతినిధులు ప్రకాష్, బాలకృష్ణ మీడియాతో మాట్లాడారు. ‘హంద్రీనీవా సుజలస్రవంతి ప్రాజెక్టు పరిధిలోని ఉరవకొండ-గుంతకల్లు కాలువకు సంబంధించి ప్యాకేజీ నంబర్-33 పనులను ఇంజనీరింగ్ ప్రాజెక్టు ఇండియా లిమిటెడ్ పొందింది. వారి నుంచి రిత్విక్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ సబ్ కాంట్రాక్టు తీసుకుని వాటిని శేషయ్యనాయుడు కన్‌స్ట్రక్షన్స్ కంపెనీకి మళ్లీ సబ్‌కాంట్రాక్టుకు ఇచ్చింది.


ప్రాజెక్టు వ్యయం రూ.58.32 కోట్లు కాగా.. మేం రూ.28 కోట్ల పనులు పూర్తిచేశాం. కానీ మాకు రిత్విక్ ప్రాజెక్ట్సు నుంచి వచ్చింది కేవలం రూ.13 కోట్లు మాత్రమే. వారు ప్రభుత్వం నుంచి డబ్బులు పొందినా.. మాకు మాత్రం ఇవ్వలేదు. రెండేళ్లుగా తిప్పుతున్నారు. కేసు నమోదు చేయాలని పోలీసుస్టేషన్ చుట్టు తిరిగినా పోలీసులు కేసు నమోదు చేయలేదు. చివరకు నాంపల్లి మెట్రోపాలిటన్ కోర్టు ఆదేశాల మేరకు గత డిసెంబర్‌లో అంబర్‌పేట్ పోలీస్‌స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఈ విషయాన్ని సీఎం రమేష్ ఎన్నికల అఫిడవిట్‌లో పొందుపరచకుండా ఎన్నికల సంఘాన్ని కూడా తప్పుదోవ పట్టించారు. దీనిపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల ప్రధాన అధికారిని కోరాం’ అని వివరించారు.
Share this article :

0 comments: