హత్యా రాజకీయాల్లో బాబు దిట్ట: విజయలక్ష్మి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » హత్యా రాజకీయాల్లో బాబు దిట్ట: విజయలక్ష్మి

హత్యా రాజకీయాల్లో బాబు దిట్ట: విజయలక్ష్మి

Written By ysrcongress on Wednesday, March 28, 2012 | 3/28/2012

హత్యారాజకీయాలు చేయడంలో దిట్ట అయిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు పేదప్రజల కోసం పరితపించే వైఎస్ జగన్‌ను విమర్శించడం హాస్యాస్పదమని వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి అన్నారు. మంగళవారం రాజమండ్రిలో ఆమె విలేకరులతో మాట్లాడారు. రాజకీయాల్లో విశ్వసనీయత లేని బాబుకు వైఎస్సార్ కుటుంబాన్ని విమర్శించే హక్కులేదన్నారు. 

జగన్ ఆస్తులపై బాబు నోటికి తాళం లేకుండా మాట్లాడుతున్నారని, తమ నేత ఆస్తుల వివరాలు కడప ఎంపీగా పోటీ చేసిన సమయంలో అఫిడవిట్‌లో సమర్పించారన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు. బూర్జువా సామ్రాజ్యాన్ని నిర్వహిస్తున్న రామోజీరావుకు అన్ని ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయో ముందుగా వెల్లడించాలన్నారు. తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలకు కోవూరు ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెప్పారన్నారు.
Share this article :

0 comments: