మీరు వేసే ఓటుతో కాంగ్రెస్, టీడీపీలకు బుద్ధి చెప్పండి ఆ ఓటుతో ఢిల్లీ పెద్దల దిమ్మ తిరగాలి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » మీరు వేసే ఓటుతో కాంగ్రెస్, టీడీపీలకు బుద్ధి చెప్పండి ఆ ఓటుతో ఢిల్లీ పెద్దల దిమ్మ తిరగాలి

మీరు వేసే ఓటుతో కాంగ్రెస్, టీడీపీలకు బుద్ధి చెప్పండి ఆ ఓటుతో ఢిల్లీ పెద్దల దిమ్మ తిరగాలి

Written By ysrcongress on Saturday, March 31, 2012 | 3/31/2012


గుంటూరు, న్యూస్‌లైన్ ప్రతినిధి: ‘‘త్వరలో రాష్ట్రంలో ఉప ఎన్నికలు జరగనున్నాయి.. రాష్ట్రాన్ని రిమోట్ కంట్రోల్‌తో ఆడిస్తున్న ఢిల్లీ పెద్దల కళ్లు ఈ ఎన్నికల ఫలితాలతో తెరుచుకోవాలి.. ప్రతి ఒక్కరూ మనస్సాక్షి ప్రకారం ఓటు వేయం డి’’ అని వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ అధినేత, కడప ఎంపీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఈ ఎన్నికలు రాజకీయ పార్టీల మధ్య జరుగుతున్నవి కావని, ఈ ఎన్నికల్లో రైతన్న, పేదవాడు వీళ్ళిద్దరూ ఒకవైపు ఉంటే కుళ్ళు, కుతంత్రాలతో కూడిన రాజకీయ వ్యవస్థ మరోవైపు ఉండి పోటీ చేస్తున్నాయని జగన్ అభివర్ణించారు. గుం టూరు జిల్లా ఓదార్పు యాత్ర 81వ రోజు శుక్రవారం ఆయన ప్రత్తిపాడు నియోజకవర్గంలోని గుంటూరు రూర ల్, వట్టిచెరుకూరు మండలాల్లో, గుంటూరు నగరంలో పర్యటించారు. మొత్తం ఐదు వైఎస్సార్ విగ్రహాలను ఆవిష్కరించి, గుంటూరు రూరల్ మండలంలోని అంకిరెడ్డిపాలెంలో పోలూరి సుబ్బారెడ్డి కుటుంబాన్ని ఓదార్చారు. అంకిరెడ్డిపాలెం, అనంతవరప్పాడులలోని విగ్రహావిష్కర ణ సభలకు భారీ ఎత్తున తరలివచ్చిన జనవాహినిని ఉద్దేశించి జగన్ మాట్లాడారు. ప్రసంగాల సారాంశం జగన్ మాటల్లోనే..

విలువలను గెలిపించుకుందాం..

త్వరలో ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ పోటీల్లో విలువలు, విశ్వసనీయత ఓ వైపు ఉంటే, వంచనతో కూడిన రాజకీయాలు మరోవైపు ఉన్నాయి. ఈ పోరులో మనం విలువలను గెలిపించుకుందాం. విశ్వసనీయతకు తోడుగా, రైతన్నకు అండగా నిలుద్దాం. మీరు వేసే ప్రతి ఓటుతో రాష్ట్ర సర్కారు కళ్ళు తెరవాలి. రాష్ట్ర ప్రభుత్వాన్ని రిమోట్ కంట్రోల్‌తో నడిపిస్తున్న ఢిల్లీ పెద్దల దిమ్మతిరగాలి. పల్లెల్లో రైతన్న పడుతున్న బాధ పాలకులకు అర్థం కావాలి. ఈ వ్యవస్థలో మార్పు రావాలి. డబ్బు, మద్యంతో వీళ్ళు రాజకీయాలు చేయలేరు.... ప్రజలకు మనోభావాలు ఉన్నాయి, వారికి ఆత్మగౌరవం ఉందన్న సంకేతాలు వీరిద్దరికీ తెలియాలి. సుచరితమ్మ(ప్రత్తిపాడు మాజీ ఎమ్మెల్యే మేకతోటి సుచరిత) విశ్వసనీయత, విలువల పక్షాన నిలబడింది. రైతన్నకు, పేదవాడికి అండగా నిలిచింది. నా చెల్లి సుచరితమ్మను చూసి నేను గర్వపడుతున్నా. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు సుచరితమ్మకు ఉండాలి. ఉప ఎన్నికల్లో గెలుపు రైతులది, పేదవాడిదే కావాలి. దివంగత వైఎస్‌ఆర్ మరణం తర్వాత రాష్ట్రంలో పేదవాడికి ఒక్క ఇల్లు కూడా కట్టివ్వలేని దుస్థితిలో ప్రభుత్వం ఉంది. పేదవాడు గ్రామాల్లో ఎలా బతుకుతున్నాడా అనేది ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. పదవులపైనే ఈ అధికార పార్టీ ఆసక్తి చూపుతోంది. ఢిల్లీ రిమోట్‌తో రాష్ట్రం పని చేస్తోంది.

విలువలకు కట్టుబడి..

అవిశ్వాస సమయంలో ఎమ్మెల్యేలకు నేను ఒకటే చెప్పా.. పదవీ త్యాగం చేసిన సుచరితమ్మతోపాటు 16 మందికి కూడా ముందుగానే జరగబోయే పరిణామాలను చెప్పా. అధికార, ప్రతిపక్షాలు కలిసికట్టుగా కుమ్మక్కై కుట్రలు చేస్తా యి.. వాళ్ళు ఏ ఉద్దేశంతో కుట్రలు చేసినా నాయకుడనే వాడికి విలువలు, విశ్వసనీయత ఉండాలని చెప్పా. అనర్హత వేటు పడినా, ఎమ్మెల్యే పదవి పోయినా, ఉప ఎన్నికలు వస్తాయని తెలిసినా రైతులు, పేదవాడికి అండగా నిలిచి 17 మంది ఎమ్మెల్యేలు తమ చిత్తశుద్ధిని చాటుకున్నారు.

సవరణ: ‘రిలయన్స్‌కు గ్యాసే అతిపెద్ద అవినీతి’ శీర్షికన శుక్రవారం ‘సాక్షి’ ప్రధాన పత్రిక రెండో పేజీలో ప్రచురితమైన వార్తలో ‘‘ఎమ్మార్‌కు ఎకరా భూమిని రూ.29 లక్షల చొప్పున కేటాయించింది నువ్వే కదయ్యా చంద్రబాబూ! అదే భూమి పక్కన నీ భార్య మూడేళ్ల కిందట ఎకరా కోటి రూపాయలకు కొనుగోలు చేసింది నిజం కాదా?’’ అని వచ్చింది. ‘‘ఎకరా కోటి రూపాయలకు అమ్మింది నిజం కాదా?’’ అని జగన్‌మోహన్‌రెడ్డి అనగా అది పొరపాటున ‘‘కొనుగోలు చేసింది నిజం కాదా?’’ అని ప్రచురితమైంది.
Share this article :

0 comments: