ప్లీజ్.. నన్ను పిలవరూ..! జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పా! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ప్లీజ్.. నన్ను పిలవరూ..! జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పా!

ప్లీజ్.. నన్ను పిలవరూ..! జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పా!

Written By news on Wednesday, March 14, 2012 | 3/14/2012

జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పా! ఇంటర్వ్యూలు చేసి మరీ ప్రధానులను ఎంపిక చేశా! రాష్ట్రపతి స్థానంలో ఎవరుండాలో డిసైడ్ చేసింది నేను. నేనే వెళ్లకపోతే ఎట్లా..! ఏదో ఒకటి చేసి నాకు ఆహ్వానమందేలా చూడాలి.. అంటూ రాష్ట్రానికి చెందిన ‘పచ్చ’ నాయకుడు గత నాలుగైదు రోజులుగా పార్టీ నేతల ముందు తెగ హడావుడి చేస్తున్నారు. విషయమేంటని ఆరా తీస్తే... ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ నేత ములాయంసింగ్ యాదవ్ 
తనయుడు అఖిలేష్ యాదవ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసే కార్యక్రమానికి హాజరుకావాలని ఆయన తెగ తాపత్రయపడుతున్నారట. దేశంలో చాలా మంది నేతలకు ఆహ్వానాలు అందినా.. మన నేతకు ఓ కార్డు ముక్కా రాలేదు. ‘ఆహ్వానం రాకుండా ఎలా వెళ్తాం? అందుకే సమాజ్‌వాదీ నేతల్లో ఎవరో ఒకరిని పట్టుకుని ఆహ్వానమందేలా చూడండి’ అని ఓ సహచరుడిని తెగపోరుతున్నారు. ‘అక్కడేమో మనల్ని పట్టించుకునే నాథుడే లే డు. ఈయనేమో లక్నోకు ఫ్లయిట్ టికెట్ కూడా బుక్ చేయించుకున్నాడు. ఇప్పుడేం చేయాలో అర్థం కావడంలేదు’ అంటూ ఆ నాయకుడు తల పట్టుకుంటున్నాడు. మరోసారి ట్రై చేయకపోయారా అంటే...! ‘నేనే కాదు.. మరో నలుగురు ఇదే పనిలో ఉన్నారు. కానీ మమ్మల్ని ఖాతరు చేసేదెవరు’ అంటూ రుసరుసలాడారు. పోనీ ఆయన్నే డెరైక్టుగా మాట్లాడుకోమనకపోయారా అని అడగ్గా.. ‘అది కూడా అయింది. ఇప్పుటికి నాలుగుసార్లు ములాయంకు ఫోన్ చేసి అభినందించారు. రానున్న కాలంలో కేంద్రంలో మీరే నాయకుడంటూ పొగడ్తల్లో కూడా ముంచెత్తారు. అయినా రమ్మనలేదు. అయినా దైవజ్ఞుడికి ఆహ్వానమెందుకు... పిలుపు రాకపోయినా.. డెరైక్ట్‌గా వెళ్లి కార్యక్రమంలో కూర్చుంటే సరి’ అని అనేశారు. కాగా అఖిలేష్ ప్రమాణ కార్యక్రమానికి తమ నేతకు ఆహ్వానం అందిందని తమ్ముళ్లు ప్రచారం చేస్తుండడం విశేషం. 
Share this article :

0 comments: