తెలుగు తమ్ముడి గెలుపు కోసం ఫిక్సింగ్ ఊరి పెద్దలకు వల - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » తెలుగు తమ్ముడి గెలుపు కోసం ఫిక్సింగ్ ఊరి పెద్దలకు వల

తెలుగు తమ్ముడి గెలుపు కోసం ఫిక్సింగ్ ఊరి పెద్దలకు వల

Written By news on Wednesday, March 14, 2012 | 3/14/2012


గంపగుత్తగా ఓట్ల బేరసారాలు.. చెక్కుల ద్వారా చెల్లింపులు 
హైదరాబాద్ నుంచి బ్యాంక్ అకౌంట్లలోనూ నగదు జమలు 

కోవూరు నుంచి న్యూస్‌లైన్ ప్రత్యేక ప్రతినిధి: నెల్లూరు జిల్లా కోవూరు అసెంబ్లీ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఓట్లను కొనుగోలు చేయటానికి ఆ రెండు పార్టీలు రంగంలోకి దిగాయి. నియోజకవర్గంలో పలు చోట్ల గ్రామాల వారీగా గంపగుత్తగా ఓట్లను కొనుగోలు చేస్తున్నాయి. ఇందుకోసం కొందరు నాయకులు కొత్త దార్లు వెతుకుతున్నారు. కొడవలూరు మండలంలోని ఒక గ్రామంలో 900 పైచిలుకు ఓట్లు ఉంటే.. ఆ మొత్తం ఓట్ల కోసం పాలకపక్షానికి చెందిన మాజీ మంత్రి తరఫున ఒకరు బేరసారాలు జరిపారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఈ వ్యవహారంలో కుదిరిన ఒప్పందం ఏమిటంటే... ఎవరికీ అనుమానం రాకుండా ఆ గ్రామంలో 90 శాతం ఓట్లు తెలుగు తమ్ముడికి వేయాలి. మిగతా 10 శాతం ఓట్లు మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్న మరో పార్టీ అభ్యర్థికి వేయాలి. దీనికోసం 28.50 లక్షల రూపాయలు ఆ గ్రామ పెద్ద ఒకరికి అందజేస్తారు. దీనికోసం ఇప్పటికే పెద్ద మొత్తంలో అడ్వాన్స్‌గా చెల్లించగా.. మరో 12 లక్షల రూపాయలను 21వ తేదీన ఓట్ల లెక్కింపు తర్వాత 24వ తేదీన చెల్లుబాటయ్యేటట్లు చెక్ ఇచ్చారు. 

ఎన్నికల అధికారుల నిఘాకు సైతం అందకుండా ఇప్పటికే కొన్ని గ్రామాల్లో ‘ఇంత మంది ఓటర్లకు.. ఇంత డబ్బు’ అని గంపగుత్తగా వేలంలో కొనుగోలు చేశారు. మరికొన్ని చోట్ల గ్రామ పెద్దలకు నేరుగా బ్యాంకు చెక్కులు ఇచ్చి ఓట్లు తమకే వేయాలని హామీలు తీసుకుంటున్నారు. అదే మండలంలోని 300 ఓట్లున్న మరో చిన్న గ్రామంలో ఒక గుంతను పూడ్చటానికి మూడు లక్షల రూపాయలిచ్చి ఓట్లన్నీ తమకే వేయాలని తెలుగు తమ్ముడొకరు కొనుగోలు చేశారు. ఈ మొత్తానికి కూడా ఈ నెల 24వ తేదీన నగదు చేసుకునేలా చెక్కు అందజేశారని గ్రామమంతా చెప్పుకుంటోంది. ఆ గ్రామాల్లో కుదిరిన ఒప్పందం ప్రకారం ప్రతి పది ఓట్లలో తెలుగు తమ్ముడికి 9 వేస్తే ఒకటి మరో పార్టీ అభ్యర్థికి వేయాలి. విడవలూరు మండలంలోని మూడు తీర ప్రాంత గ్రామాల్లో కూడా ఓట్ల కొనుగోలుకు మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్న పార్టీల నేతల మధ్య రాజీ కుదిరింది. ఓ వర్గానికి చెందిన ఓటర్లకు 20 లక్షల రూపాయలు చెల్లించి తెలుగు తమ్ముడికి ఓటు వేసేలా హామీ పొందారు. 

మరో రెండు గ్రామాల్లో కుల పెద్దల ద్వారా కొనుగోలుకు పరోక్షంగా వేలం పాట తరహాలో పోటీ నడుస్తోంది. ఎవరెక్కువ ఇచ్చి సొంతం చేసుకుంటారనేది బుధవారం తేలనుంది. తీర ప్రాంతంలోని కొన్ని గ్రామాల్లో ఓ రకమైన కట్టుబాటుతో కుల పెద్ద చెప్పిందే వేదంగా నడిస్తుందన్న ఉద్దేశంతో కోట్లల్లో డబ్బు వెదజల్లుతున్నారు. ఇలాంటి కట్టుబాటు విషయం కొంత కాలం కిందట కేంద్ర ఎన్నికల కమిషన్ దృష్టికి వచ్చి ఇలాంటి కట్టుబాట్లు లేని విధంగా పోలీసు నిఘా యంత్రాంగాన్ని ఉపయోగించి చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. కానీ ఇక్కడ మాత్రం అలాంటి నిఘా ఏదీ కనిపించటం లేదు కనుక విచ్చలవిడిగా డబ్బు ఎర చూపుతూ ఓటర్లను ప్రలోభపెడుతున్నారు. ఇలా జరుగుతున్నది ఒక్క తీర ప్రాంతాల్లోనే కాదు.. మెట్ట గ్రామాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొని ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. నేరుగా ఓటర్లను ఓట్లడిగి వారి హృదయాలను చూరగొని మద్దతు పొందాల్సింది పోయి.. కట్టుబాట్లను ఆసరాగా చేసుకుని పెద్దలను ఆశ్రయించటం పట్ల ఆయా గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 21న జరిగే ఓట్ల లెక్కింపులో చెప్పిన మేరకు ఓట్లు పడితేనే నగదు మార్చుకోవటానికి వీలుంటుందని తెలుగు తమ్ముడొకరు చెప్పటంతో ఒక గ్రామానికి చెందిన ఒక పెద్ద తమను అవమానించినట్లుగా భావిస్తున్నారు. ఇకపోతే కొందరి బ్యాంకు అకౌంట్ నంబర్లను తీసుకుని నేరుగా హైదరాబాద్ నుంచి వారి అకౌంట్లలో డబ్బులు వేస్తున్న తతంగం జోరుగా సాగుతోంది. 

ఇప్పటికే రూ. 33 కోట్లు పంపిణీ..! 

పదేళ్ల కిందట ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన నేత పోలీసులకు చిక్కకుండా హవాలా రూపంలో కూడా పెద్దఎత్తున నియోజకవర్గంలో డబ్బు సమకూర్చుకుని ఎవరికీ అనుమానం రాకుండా పట్టపగలే ఓటర్లను ప్రలోభపెడుతూ భారీ ఎత్తున పంపిణీ కార్యక్రమం కొనసాగిస్తున్నారు. ఆ నేత ఇప్పటికే 33 కోట్ల రూపాయలకుపైగా నియోజకవర్గంలోని పలువురు నేతలకు చేరవేసినట్లు చెప్పుకుంటున్నారు. ఆదివారం నెల్లూరు నగరంలోని ఓ విద్యా సంస్థల అధినేతకు చెందిన ప్రాంగణంలోని కార్యాలయంలో ఓ రాష్ట్ర పార్టీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు, నెల్లూరు రాజకీయాల్లో ఐరన్‌లెగ్‌గా పేరుమోసిన ఓ మాజీ ఎమ్మెల్సీ, ఇద్దరు సీనియర్ మంత్రులు రాత్రి పొద్దుపోయే వరకూ సమావేశమయ్యారు. రాత్రి పొద్దు పోయాక ఎన్నికల కోసం తెచ్చిన డబ్బు పంపిణీ చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. భారీ ఎత్తున డబ్బు పంపిణీ చేసి డిపాజిట్ కోసం కష్టపడుతున్నట్లు కనబడుతోందని ఒక నాయకుడి వద్ద మీడియా ఇష్టాగోష్టి సంభాషణలో ప్రస్తావించగా.. కోట్లు వెదజల్లి గంపగుత్తగా ఓట్లను కొంటున్నప్పుడు డిపాజిట్ కూడా రాదని మీరెలా చెప్తారంటూ ఆ నాయకుడు రుసరుసలాడారు. 
Share this article :

0 comments: