తోబుట్టువులు బాబు అంతటి స్థితిమంతులు కారు. మరి అమ్మణ్నమ్మగారు లోకేష్‌కే ఆ భూమిని బహుమతిగా ఎందుకిచ్చి ఉంటారు? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » తోబుట్టువులు బాబు అంతటి స్థితిమంతులు కారు. మరి అమ్మణ్నమ్మగారు లోకేష్‌కే ఆ భూమిని బహుమతిగా ఎందుకిచ్చి ఉంటారు?

తోబుట్టువులు బాబు అంతటి స్థితిమంతులు కారు. మరి అమ్మణ్నమ్మగారు లోకేష్‌కే ఆ భూమిని బహుమతిగా ఎందుకిచ్చి ఉంటారు?

Written By ysrcongress on Tuesday, March 6, 2012 | 3/06/2012


బాబుకు మానవ సంబంధాలు, కుటుంబ బంధాలు, ఆత్మీయతానురాగాలకు అర్థం తెలియదు
ఆదాయ పన్ను నుంచి తప్పించుకోవడానికి తల్లినీ ఉపయోగించుకున్న దౌర్భాగ్యుడు.. అలాంటి బాబా విజయమ్మను విమర్శించేది?
ఎన్నికల్లో గెలవలేనన్న నిస్పృహతోనే బాబు జగన్‌ను అవినీతిపరుడిగా చిత్రీకరిస్తున్నారు
చంద్రబాబంత పెద్ద అవినీతిపరుడు దేశంలోనే లేడు.. ఈ విషయాన్ని తెహల్కా పత్రికే వెల్లడించింది
పిల్లనిచ్చిన మామను వెన్నుపోటు పొడిచి ఆయన మరణానికి కారకుడైన నరరూప రాక్షసుడు బాబు

హైదరాబాద్, న్యూస్‌లైన్: మానవ సంబంధాలు తెలియని నరరూప రాక్షసుడు టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతి నిధి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. ఆయనకు కుటుంబ బంధాలు, ఆత్మీయత, అనురాగాలకు అర్థం తెలియదని వ్యాఖ్యానించారు. అలాంటి నరరూప రాక్షసుడైన చంద్రబాబుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మను విమర్శించే నైతిక అర్హత లేదని చెప్పారు. కోవూరు ఉప ఎన్నికల ప్రచార సభల్లో చంద్రబాబు కొవ్వెక్కి అవాకులు చవాకులు పేలారని, ఈనెల 18వ తేదీన జరిగే పోలింగ్‌లో ఆయనకు కోవూరు ప్రజలు సరైన రీతిలో గుణపాఠం చెబుతారని, 21వ తేదీన ఆ ఫలితం వెలువడుతుందని అన్నారు. సోమవారం పార్టీ కేంద్ర కార్యాల యంలో జరిగిన విలేకరుల సమావేశంలో అంబటి రాంబాబు మాట్లాడుతూ చంద్రబాబు దిగజారుడుతనాన్ని దుయ్యబట్టారు. 

‘‘చంద్రబాబూ.. అవాకులూ చవాకులూ పేలుతూ దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి కుటుంబాన్ని, జగన్‌ను కించ పరుస్తున్నావ్. ఖబడ్డార్..! నిన్నూ నీ పార్టీని తెలుగు ప్రజలు భస్మీపటలం చేయడానికి కూడా వెనుకాడరు’’ అని తీవ్రంగా హెచ్చరించారు. ‘‘తోటకూర కథలు, హరికథలూ చెబుతూ విజయమ్మను విమర్శించిన చంద్రబాబును రాష్ట్ర ప్రజలు క్షమించరు. ముఖ్యంగా కోవూరు ప్రజలు పోలింగ్ రోజున సరైన రీతిలో స్పంది స్తారు. ఎన్నికల్లో ఎలాగూ గెలవలేనని తెలుసుకున్న బాబు నిరాశా నిస్పృహలకు లోనై జగన్‌ను అవినీతిపరుడిగా చిత్రీకరించడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే రాష్ట్రంలోనే.., ఆ మాటకొస్తే దేశంలోనే చంద్రబాబంత పెద్ద అవినీతిపరుడు లేరు. 

ఈ మాటలు నేనంటున్నవి కావు. ‘తెహల్కా’ వంటి పత్రికే వెల్లడించింది’’ అని చెప్పారు. ‘‘బాబూ.. ఆదాయ పన్ను శాఖ నుంచి తప్పించుకోవడానికి సొంత తల్లి అమ్మణ్ణమ్మను కూడా ఉపయోగించుకున్న దౌర్భాగ్యుడివి నువ్వు. అలాంటి దౌర్భాగ్యుడివైన నువ్వు విజయమ్మ గురించి మాట్లాడుతూ ఉంటే నిజంగా బాధ కలుగుతుంది’’ అని అన్నారు. ‘‘రాజకీయాల్లోకి వచ్చినప్పుడు రెండెకరాల ఆసామి అయిన చంద్రబాబునాయుడు తల్లిగారికి హైదరాబాద్‌లో ఐదెకరాల భూమి, ఒక ఇల్లు ఉం డేవట. వాటిని బాబుగారి కుమారుడు లోకేష్‌కు బహుమతిగా ఇచ్చారట. చంద్రబాబుకు ఒక తమ్ముడు, మరో ముగ్గురు తోబుట్టువులు కూడా ఉన్నారు. 

వారందరూ బాబు అంతటి స్థితిమంతులు కారు. మరి అమ్మణ్నమ్మగారు లోకేష్‌కే ఆ భూమిని బహుమతిగా ఎందుకిచ్చి ఉంటారు? కేవలం ఒక ఆదాయ వనరుగా చూపించడానికి, ఆదాయ పన్ను నుంచి తప్పించుకోవడానికి మాత్రమే తల్లిని వినియోగించుకున్న దౌర్భాగ్యుడు చంద్రబాబు’’ అని దుయ్యబట్టారు. ‘‘పిల్లనిచ్చిన మామను వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి కుర్చీని లాక్కుని ఆయన మరణానికి కారకుడైన నరరూప రాక్షసుడివి. వైస్రాయ్ హోటల్ వద్ద మామ ఎన్టీఆర్‌పై చెప్పులు వేయించిన సంగతి మరిచిపోయావా? నువ్వు మర్చిపోయి ఉండవచ్చు. కానీ తెలుగు ప్రజలు మాత్రం మర్చిపోలేదు. నువ్వు ఈరోజు కీర్తిస్తున్న పరిటాల రవి కూడా ఆనాడు ఎన్టీఆర్ పక్కన ఉన్నారు. ఆయనపై కూడా చెప్పులు పడ్డాయి. ఆనాడు చెప్పులేసి, వారు చనిపోయాక వారి విగ్రహాలకు దండేసి కీర్తిస్తున్న చరిత్ర నీది కాదంటావా’’ అంటూ బాబుపై నిప్పులు చెరిగారు. ‘‘పిల్లనిచ్చిన మామ, రక్తం పంచుకు పుట్టిన తమ్ముడు, బావమరుదులు, తోడల్లుడు, తల్లీ, తండ్రి అనే పదాలకు మానవ సంబంధాల్లో ఒక వికృత రూపాన్ని ఇచ్చిన రాజకీయ రాక్షసుడు చంద్రబాబు. అలాంటి వ్యక్తి విజయమ్మకు నీతులు చెప్పడమా!’’ అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ‘‘పిల్లనిచ్చిన మామను గద్దె దించే కుట్రలో తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు, బావమరుదులు హరికృష్ణను వాడుకుని వదిలేసిన ఘనత నీది కాదా? భవిష్యత్తులో ఏకు మేకవుతాడేమోనన్న భయంతో బాలకృష్ణ కుమార్తె బ్రహ్మణితో నీ కుమారుడు లోకేష్‌కు వివాహం జరిపించి బావమరిదిని నీ చెప్పు చేతల్లో పెట్టుకున్న మాట నిజం కాదా’’ అని బాబును అంబటి ప్రశ్నించారు. 

‘‘సాధారణంగా ఎవరైనా పై చదువులకు అమెరికాకు వెళతారు. బాబు కుమారుడు లోకేష్ మాత్రం అండర్ గ్రాడ్యుయేట్ కోర్సు నుంచే కార్నెగీ మిలన్ యూనివర్శిర్సిటీకి వెళ్లారు. ఆయన చదువుకు అయిన ఖర్చుకు ఇంతవరకూ ఎక్కడా లెక్కలు చూపకుండా ఒక లేఖను పట్టుకొచ్చి స్పీకర్ వద్ద పడేసి తానొక నీతిమంతుడినని బాబు చెప్పుకున్నారు. లోకేష్ ఒక టీవీ చానల్‌ను నిర్వహిస్తే దాని రేటింగ్ దారుణంగా పడిపోవడంతో బెంబేలెత్తిన యాజమాన్యం ఆయన్ని అక్కడినుంచి పంపేసింది. దీనినిబట్టే ఆయన ప్రతిభ ఏపాటిదో అర్థమవుతుంది’’ అని అంబటి ఎద్దేవా చేశారు.

ఇక నుంచి బాబు మూడు వేళ్లు చూపించాలి: బాబు తరచూ రెండు వేళ్లను విజయ సంకేతంగా చూపుతుంటారని, వాస్తవానికి దానర్థం అది కాదని, ‘నన్ను రెండు సార్లు మీరు ఓడించారు’ అని చెప్పుకోవడమేనని అన్నారు. బాబు ఇకపై రెండు వేళ్లు కాదు, మూడు వేళ్లు చూపించాల్సి ఉంటుందని, ఎందుకంటే ఆయన్ని మూడోసారి ఓడించడానికి ప్రజలు సిద్ధమవుతున్నారని అంబటి వ్యాఖ్యానించారు.
Share this article :

0 comments: