జజ్జనకరి జగన్‌!(surya paper) - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జజ్జనకరి జగన్‌!(surya paper)

జజ్జనకరి జగన్‌!(surya paper)

Written By ysrcongress on Thursday, March 22, 2012 | 3/22/2012

జజ్జనకరి జగన్‌!
jagan1అనుకున్నదే అయింది. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ అధినే త జగన్‌ రాజకీయ భవిష్యత్తేమిటో తేలిపోయింది. కోస్తాలో రాజకీయాలను ఇకపై ఎవరు శాసిస్తారో స్పష్టమయి పోయింది. ప్రజలు ఎవరిని విశ్వసిస్తున్నారో అర్ధమయి పోయింది. అక్కడ ఏయే పార్టీల మధ్య భవిష్యత్తులో పోరు జరగబోతోందో తెలిసిపోయింది. అవును! కోస్తాలో జగన్‌ తొలి ఖాతా తెరిచారు. ప్రత్యర్థులు నివ్వెరపోయేలా తిరుగులేని మెజారిటీతో తన పార్టీ అభ్యర్థిని కోవూరులో ఒంటి చేత్తో గెలిపించారు. మీడియా సహకరించకపో యినా, రెండు ప్రధాన రాజకీయ పార్టీలు ఏకమ యినా, ధనం ఏరులై పారినా చివరకు జగన్‌ ఒంటరి పోరాటమే గెలిచింది. కోవూరులో జగ న్‌ పార్టీ దూసుకుపోయింది. దీనితో కోస్తాలో భవిష్యత్తు రాజకీయాల్లో జగన్‌ పార్టీ కీలక పాత్ర పోషించబోతుందన్న సంకేతాలు స్పష్టమ య్యాయి. 

అధికార కాంగ్రెస్‌, ప్రధాన ప్రతిపక్ష మైన తెలుగుదేశం పార్టీలను ఒంటిచేత్తో ఎదు ర్కొని, తన అభ్యర్ధి చేయి పట్టుకుని ఎన్నికల వైతరిణి దాటించిన ధీశా లిగా సీమాంధ్రుల దృష్టి లో నిలిచిపోయారు. ఉప ఎన్నికల ఫలితాలు అం తా ఊహించినట్టే వెలువ డ్డాయి. ప్రధానంగా.. జగన్‌ పార్టీ భవిష్యత్తు ఏ మవుతుందనే దానికి ఒక కొలమానంలా నిలిచిన కోవూరు ఉప ఎన్నికలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్య ర్ధి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి 23496 మెజారిటీతో విజయం సాధించటం టీడీపీ, కాంగ్రెస్‌ను కోలుకోలేని దెబ్బకొట్టినట్టయింది. 5-10 వేల మెజారిటీ వస్తుందేమోనని ఆశించిన వారి అంచనాలను జగన్‌ తుత్తునియలు చేశారు. 

సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఎమ్మెల్యే చిరంజీవి, పీసీసీ చీఫ్‌ బొత్స కాళ్లకు బలపాలు కట్టుకుని కోవూరులో తిరిగినా జనం జగన్‌ ఒక్కడినే నమ్మినట్లు మిగిలిన వారిని నమ్మలేదని తాజా ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. కోవూరు ఉప ఎన్నికల ఫలితాల్లో ప్రతి రౌండ్‌లోనూ జగన్‌ పార్టీనే పైచేయి సాధించడం బట్టి అక్కడ ఫ్యాను గాలి ఏ స్థాయిలో, ఎంత ఉధృ తంగా వీచిందో స్పష్టమవుతోంది. నిజానికి, జగన్‌ పార్టీ అభ్యర్ధి ప్రసన్న కుమా ర్‌రెడ్డిపై వ్యక్తిగత వ్యతిరేకత ఉన్నప్పటికీ.. దానిని జగన్‌ తన హవా, ఇమేజ్‌తో తెరమరుగు చేయడంలో విజయం సాధించారు. ప్రజలు ప్రసన్నను చూసి కా కుండా జగన్‌ను చూసే ఓటేశారన్నది ఫలితాల్లో వెల్లడయిన మెజారిటీ చాటిచె ప్పింది. 

దీన్ని బట్టి, జగన్‌కు జనంలో విశ్వసనీయత పెరుగుతోందన్న వాస్తవం, జనం ఆయన మాటలు వింటున్నారన్న విషయం స్పష్టమవుతోంది. జగన్‌ కడపలో తన ఉప ఎన్నికల సందర్భంగా ఓటుకు 200 రూపాయలు మించి ఎక్కడా ఐదు పైసలు కూడా ఎక్కువ ఇవ్వలేదు. మద్యం కోసం నయాపైసా ఇవ్వ లేదు. దాని కోసం ఐదుపైసలు ఇచ్చేది లేదని శ్రేణులు, నేతలకు కరాఖండీగా చెప్పారు. ఇవ్వకపోతే కష్టమని చెప్పినా ఖాతరు చేయలేదు. ఒక్క జమ్మలమడు గులోనే 300 రూపాయలు పంపిణీ చేశారు.

అది కూడా నాటి నేత వ్యక్తిగత ప్రతిష్ఠ కోసం వంద రూపాయలు అదనంగా ఖర్చు చేశారు. కోవూరులో కూడా జగన్‌ అదే పద్ధతి పాటించారు. కోవూరులో కాంగ్రెస్‌ వెయ్యి, టీడీపీ ఐదు వం దలు పంపిణీ చేయగా, జగన్‌ పార్టీ కేవలం 200 రూపాయలు మాత్రమే పంపి ణీ చేసింది. అసలు డబ్బులు పంపిణీ చేయవలసిన అవసరం లేదని, జనం మనవైపే ఉన్నారని జగన్‌ ప్రతిసారీ నాయకులకు స్పష్టం చేస్తూ వచ్చారు. తాజా ఫలితాలు పరిశీలిస్తే.. భవిష్యత్తులో కోస్తాలో జరిగే అన్ని ఎన్నికల్లోనూ ఇక వైఎస్సార్‌ కాంగ్రెస్‌-టీడీపీ మధ్యనే ఉంటాయని తేలిపోయింది. అధికార కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితి మూడవ స్థానంలోనే ఉండబోతుందని స్పష్టమవుతోంది.


నెల్లూరు జిల్లాలోని కోవూరు గతంలో తెలుగుదేశం అధీనం లో ఉండేది. ఇప్పుడది జగన్‌ పార్టీ పరమైంది. చిరంజీవి ప్రజారాజ్యం తరపున కిందటి ఎన్నికల్లో సంపాదించిన ఓట్లు అత్యధిక భాగం కాంగ్రెస్‌కి దక్కలేదు. 
అవి జగన్‌కి, టీఆర్‌ఎస్‌కీ వెళ్లినట్లు విశ్లేషణలు చెబుతున్నారుు. ఈ లెక్కన చిరంజీవి మున్ముందు కాంగ్రెస్‌కి ఓటు బ్యాంకుగా ఏమేరకు ఉపయోగపడతారన్నది ఊహకందడం లేదని పార్టీలోని సీనియర్లు పెదవి విరుస్తున్నారు.
Share this article :

0 comments: