జూన్ 12న ఉప ఎన్నికలు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జూన్ 12న ఉప ఎన్నికలు

జూన్ 12న ఉప ఎన్నికలు

Written By news on Tuesday, April 24, 2012 | 4/24/2012

ఉప ఎన్నికల నగారా మోగింది. కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం ఉప ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేసింది. మే 18న ఉప ఎన్నికల నోటిఫికేషన్ ను జారీ చేయనుంది.18 అసెంబ్లీ, ఒక పార్లమెంట్ స్థానానికి జూన్ 12న ఎన్నికల పోలింగ్ జరుగుతాయి. జూన్ 15న ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలవుతుంది. నామినేషన్లు దాఖలు చేసేందుకు మే25వ తేదీ తుది గడువు. మే 28వ తేదీలోగా నామినేషన్లను ఉపసంహరించుకునేందుకు అవకాశం ఉంది.

 ఉపఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిందని, తక్షణం ఎన్నికల నియమావళి అమలులోకి వస్తుందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్ చెప్పారు. ఈ సాయంత్రం ఆయన విలేకరులతో మాట్లాడుతూ అభ్యర్థులకు, పార్టీలకు, రాష్ట్రప్రభుత్వానికి కోడ్ వర్తిస్తుందని తెలిపారు. ఎన్నికలు జరుగనున్న 18 శాసనసభ నియోజకవర్గాల్లో 44,01,392మంది ఓటర్లు ఉన్నరని వివరించారు. 5,405 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. 
అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ వీడియోగ్రఫీ ఉంటుందని చెప్పారు. ఎన్నికల నియమావళిని తప్పకుండా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. 

నెల్లూరు లోక్ సభ స్థానంలో 11,12,332 మంది ఓటర్లు ఉన్నారు. అత్యధికంగా గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో 2,08,193మంది ఓటర్లు, అత్యల్పంగా పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురంలో 1,35,248 మంది ఓటర్లు ఉన్నారని భన్వర్‌ లాల్ వివరించారు.
Share this article :

0 comments: