12 జిల్లాలంతటా కోడ్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » 12 జిల్లాలంతటా కోడ్

12 జిల్లాలంతటా కోడ్

Written By news on Saturday, April 28, 2012 | 4/28/2012

తాగునీరు, కరువు, ఉపాధి పనులు, ఇన్‌పుట్ సబ్సిడీకి
మినహాయింపు.. అది కూడా ఎన్నికలు లేని నియోజకవర్గాలకే
సీఎం, మంత్రులు అధికార పర్యటనలు చేయరాదు
{పభుత్వ వాహనాలు, హెలికాప్టర్ వినియోగించరాదు
ఎన్నికల జరిగే జిల్లాల్లో ఎటువంటి నియామకాలు చేపట్టరాదు

హైదరాబాద్, న్యూస్‌లైన్: ఉప ఎన్నికలు జరగనున్న 12 జిల్లాల అంతటా ఎన్నికల ప్రవర్తనా నియమావళి (కోడ్) వర్తిస్తుందని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ స్పష్టంచేశారు. అయితే తాగునీరు, కరువు, ఉపాధి పనులు, ఇన్‌పుట్ సబ్సిడీ పంపిణీలకు మాత్రం జిల్లా అంతటా కాకుండా ఎన్నికలు జరిగే నియోజకవర్గాలకు మాత్రమే కోడ్‌ను వర్తింపచేసినట్లు వివరించారు. మిగతా అన్ని కార్యకలాపాలకు జిల్లాల అంతటా కోడ్ వర్తిస్తుందని పేర్కొన్నారు. శుక్రవారం సచివాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. సీఎం, మంత్రులు, కేంద్ర మంత్రు లు 12 జిల్లాల్లో అధికారిక పర్యటనలు చేయరాదన్నారు. ప్రభుత్వ వాహనాలు, హెలికాప్టర్ వినియోగించరాదని స్పష్టంచేశారు. ఎన్నికల ప్రచారం కోసం మైదానాలను అధికార పార్టీయే కాకుండా అన్ని పార్టీలు వినియోగించుకునేందుకు అవకాశం కల్పించాలని సూచించారు. ఎన్నికలు జరగనున్న 12 జిల్లాల్లో ఎలాంటి ప్రభుత్వ నియామకాలు చేయరాదని తేల్చిచెప్పారు. 

‘అభివృద్ధి పనులకు ఆయా జిల్లాల్లో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయరాదు. ఒకవేళ ఎన్నికలు జరిగే నియోజకవర్గంలో మంచినీటి ఎద్దడి ఏర్పడి పనులు చేపట్టాల్సి వస్తే.. ఎన్నికల కమిషన్ అనుమతితోనే ఆ పనులు చేయాలి. అధికార పార్టీ ఓటర్లను ప్రభావితం చేయడానికి కూడా పనులు చేపట్టే అవకాశం ఉన్నందున ఈసీ అనుమతి తీసుకోవాలనే నిబంధన విధించాం. ప్రజాపథానికి కమిషన్ నుంచి అనుమతి రాలేదు. అందువల్ల 12 జిల్లాల్లో ఎన్నికలు లేని నియోజకవర్గాల్లో సైతం ప్రజాపథంలో మంత్రులు అధికారికంగా పాల్గొనరాదు. ఎటువంటి పంపిణీలు చేయరాదు’ అని పేర్కొన్నారు.

300 మంది బదిలీ: ఎన్నికలు జరిగే జిల్లాల్లో మూడేళ్ల పాటు అక్కడే పనిచేసిన, అలాగే సొంత జిల్లాకు చెందిన 300 మంది అధికారులు, ఉద్యోగులను బదిలీ చేసినట్లు భన్వర్‌లాల్ తెలిపారు. వీరిలో 12 మంది ఆర్డీవోలు, 120 మంది తహసీల్దార్లు, వంద మంది పోలీసులు ఉన్నట్లు చెప్పారు. కర్నూలు జిల్లాలో ఇద్దరు ఉద్యోగులు ఒక పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారనే ఫిర్యాదులపై విచారణకు ఆదేశించినట్లు వెల్లడించారు. వైఎస్సార్ విగ్రహాలకు ముసుగులు వేయాల్సిందిగా ఎటువంటి ఆదేశాలూ జారీ చేయలేదని, విగ్రహాలపై ఇప్పటి వరకు ఎవరి నుంచి ఫిర్యాదులు రాలేదన్నారు. 

పాత తేదీలతో ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తే చర్యలు తీసుకుంటామన్నారు. గుంటూరు-విజయవాడల మధ్య రూ.9 లక్షలు పట్టుకున్నట్లు చెప్పారు. ఉప ఎన్నికల్లో ఓటు వేసేందుకు అర్హులైనవారు మే 15వ తేదీలోగా దరఖాస్తు చేసుకుంటే వారికి ఓటు హక్కు కల్పిస్తామన్నారు. ఉప ఎన్నికల స్థానాల్లో ఇంటింటివెళ్లి ఓటర్ గుర్తింపు కార్డులు ఉన్నాయా లేదా అని బూత్ స్థాయి అధికారులు విచారిస్తున్నారని, కార్డులు లేని వారికి ఉచితంగా ఇస్తారని భన్వర్‌లాల్ వెల్లడించారు. ఈవీఎంల తొలి స్థాయి తనీఖీలను ఈసీఐఎల్ చేస్తోందని తెలిపారు.
Share this article :

0 comments: