18 స్థానాలకు వంద కోట్లా! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » 18 స్థానాలకు వంద కోట్లా!

18 స్థానాలకు వంద కోట్లా!

Written By news on Wednesday, April 25, 2012 | 4/25/2012

ఎన్నికల షెడ్యూల్ విడుదలతో వ్యూహం పారలేదు 
దీనిపై చంద్రబాబు ఎందుకు మాట్లాడటం లేదు? 

హైదరాబాద్, న్యూస్‌లైన్: 
రాష్ట్రం మొత్తానికి ముఖ్యమంత్రి విచక్షణ కింద కేటాయించాల్సిన నిధులు రూ. 600 కోట్ల మేరకు ఉండగా.. ఉప ఎన్నికలు జరిగే 18 నియోజకవర్గాలకు సీఎం నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి రూ. 100 కోట్ల నిధులు కేటాయించార ని వైఎస్సార్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు విమర్శించారు. గతంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా పనికి ఆహారం పథకం కింద ఆ పార్టీ నేతలు నిధులు బొక్కారని.. అదే తరహాలో ఇప్పుడు నామినేషన్ పనుల పేరుతో ఉప ఎన్నికలు జరిగే స్థానాల్లోని నాయకులకు రూ. 100 కోట్లు దోచిపెట్టేందుకు కిరణ్ పథకం వేశారని ఆయన ధ్వజమెత్తారు. అయితే ఎన్నికల షెడ్యూలు వెలువడటంతో సీఎం వ్యూహం ఫలించకుండా పోయిందన్నారు. కిరణ్ ఇన్నేసి నిధులు అడ్డ దిడ్డంగా కేటాయిస్తూ ఉంటే ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు ఎందుకు నోరు మెదపటం లేదని ప్రశ్నించారు. అంబటి మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 

ఈ 18 నియోజకవర్గాలకు ఇంత భారీ ఎత్తున నిధులు రావటం.. దివంగత వై.ఎస్.రాజశేఖరరెడ్డి అభిమానులైన మాజీ ఎమ్మెల్యేల విజయమని ఆయన అభివర్ణించారు. రైతులు, రైతు కూలీల పక్షాన నిలబడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెట్టిన అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓట్లేసినందుకే వారు అనర్హత వేటుకు గురయ్యారని.. దాని ఫలితంగానే ఉప ఎన్నికలు వస్తున్నందునే వారి నియోజకవర్గాలకు ఇంత భారీ మొత్తంలో నిధులు మంజూరయ్యాయని.. కాబట్టి ఇది వారి ఘనతేనని అంబటి అభిప్రాయపడ్డారు. ఉప ఎన్నికలు చంద్రబాబును గజగజ వణికిస్తున్నాయనీ అందుకే సార్వత్రిక ఎన్నికల మాదిరిగా పెన్షన్లు ఇస్తాననీ, బెల్ట్ షాపులు ఎత్తి వేస్తాననీ వాగ్దానాలు చేస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. బాబు తీవ్ర నిరాశా నిస్పృహలతోనే ఇలా వ్యవహరిస్తున్నారని.. లేకుంటే విజయనగరం జిల్లాకు వెళ్లి ధర్నా చే సే స్థాయికి దిగజారరని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ నేత పాల్వాయి గోవర్ధన్‌రెడ్డికి దమ్ముంటే దివంగత వై.ఎస్.రాజశేఖరరెడ్డి తమవాడు కాదని.. ఆయన పాలనలో తప్పులు జరిగాయని తన పార్టీ చేత తీర్మానం చేయించి ఎన్నికలకు వెళ్లాలని అంబటి సవాల్ విసిరారు.
Share this article :

0 comments: