అ‘పూర్వ’ కలయిక - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » అ‘పూర్వ’ కలయిక

అ‘పూర్వ’ కలయిక

Written By news on Saturday, April 28, 2012 | 4/28/2012

- నగరం జనప్రవాహం
- వేల వాహనాలతో భారీ ర్యాలీ
- రాధాతో పాటు పదిమంది మాజీ కార్పొరేటర్లు, పలువురు నాయకుల చేరిక
- రాజకీయాల్లో ఉన్నంతవరకు జగన్ వెంటే ఉంటా : రాధా
- అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే పోర్టు ప్రారంభం
- పేదల ఇళ్ల స్థలాలు గజం రూ. 50కే రిజిస్ట్రేషన్ : జగన్


బెజవాడ జనవాడై మురిసింది.. వైఎస్సార్ సీపీ కేతనమై ఎగసింది.. జగన్నినాదమై ప్రతిధ్వనించింది.. వైఎస్ రాజశేఖరరెడ్డి- వంగవీటి మోహనరంగాలకు జోహారైంది.. దుర్గమ్మ ఆశీస్సులు, కృష్ణమ్మ చల్లని చూపుల నడుమ ఓ అ‘పూర్వ’ కలయికకు వేదికైంది. శుక్రవారం జననేత జగన్‌మోహన్‌రెడ్డి మాజీ ఎమ్మెల్యే రాధాకృష్ణకు పార్టీ కండువా కప్పి వైఎస్సార్ సీపీ కుటుంబంలో చేర్చుకున్నారు. తమ తండ్రుల ఆనాటి స్నేహ బంధమే ఈనాటి తమ సోదర సంబంధమైందని వేలమంది అభిమానుల హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. రాముడికి లక్ష్మణుడిలా తన మాట, బాటే ఎ‘జెండా’గా రాధా ముందుకు సాగుతాడని ఆయన చెప్పారు.

విజయవాడ, న్యూస్‌లైన్ : దివంగత నేతలు వైఎస్ రాజశేఖరరెడ్డి, వంగవీటి మోహన్‌రంగా తనయులు జగన్, రాధాలను శుక్రవారం ఒకే వేదికపై చూసిన జనం పులకించిపోయారు. శుక్రవారం బందరు రోడ్డులోని రంగా విగ్రహం వద్ద ఏర్పాటుచేసిన సభలో జననేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, వంగవీటి రాధాను పార్టీలోకి చేర్చుకున్నారు.

వీరి కలయికతో నాడు వైఎస్ రాజశేఖరరెడ్డి, వంగవీటి మోహనరంగాలు కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన రోజులను జనం గుర్తుచేసుకున్నారు. ఇదో అపూర్వ కలయికగా భావించిన అభిమానులు ఆనందోత్సాహభరితులయ్యారు. తొలుత రంగా విగ్రహానికి, స్టేజీ వద్ద ఏర్పాటుచేసిన రాజశేఖరరెడ్డి చిత్రపటానికి జగన్, రాధా పూలమాలలు వేసి పక్కపక్కనే నిలబడగానే అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హర్షధ్వానాలు చేశారు. జయహో జగన్, జోహార్ వైఎస్సార్, జోహార్ వీఎం రంగా అంటూ నినదించారు. జగన్ నేతృత్వంలో పార్టీలోకి రాధా చేరడం ద్వారా కోస్తా జిల్లాల్లో సరికొత్త రాజకీయ సమీకరణకు నాంది పలికినట్లయింది. ఈ కార్యక్రమానికి కోస్తా జిల్లాల నుంచి వేలాది మంది తరలివచ్చారు. సభాస్థలి వద్ద రాజన్న.. రంగన్నల అనుబంధాన్ని గుర్తుచేస్తూ ఏర్పాటు చేసిన హోర్డింగ్‌లు కూడా అభిమానుల్ని ఆకట్టుకున్నాయి. 

రంగా అభిమానుల్ని ఆకట్టుకున్న జననేత ప్రసంగం
’రాధాను నా తమ్ముడులాగా చూసుకుంటా... పార్టీలోకే కాదు నా జీవితంలోకి ఆహ్వానిస్తున్నా.. రాముడుకు లక్ష్మణుడులాగా... నాకు తమ్ముడులా తోడు నిలబడటానికి వచ్చిన రాధాను చూస్తే, ఆ వేళ దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, వంగవీటి మోహన్ రంగాల మధ్య ఉన్న అన్నదమ్ముల స్నేహమే గుర్తుకు వస్తోంది’ అని జననేత జగన్‌మోహన్ రెడ్డి చేసిన ప్రసంగం రంగా అభిమానుల్ని ఎంతగానో ఆకట్టుకుంది. 

కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం నింపిన రాధా ప్రసంగం 
త్వరలో జరగనున్న ఉప ఎన్నికలపై రాధా చేసిన ప్రసంగం కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఎన్నికలకు ముందే ఓటమిని అంగీకరించిన కాంగ్రెస్, టీడీపీలతో మాకు పోటీ ఏమిటని ఆయన చేసిన వ్యాఖ్యలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై ఆయనకున్న నమ్మకాన్ని స్పష్టం చేశాయి. ఇది రాబోయే నగరపాలక ఎన్నికలకు టానిక్‌లా పనిచేస్తుందని పరిశీలకులు భావిస్తున్నారు. 

గజం రూ. 50కే పేదల స్థలాల రిజిస్ట్రేషన్
పేదల కష్టాలు తీర్చడంలో ఎప్పుడూ ముందుండే మహానేత వైఎస్సార్‌ను గుర్తుచేస్తూ ఆయన తనయుడు, జననేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నగరంపై వరాల జల్లు కురిపించారు. వైఎస్సార్ హయాంలో గజం రూ. 100కే పేదల స్థలాల రిజిస్ట్రేషన్‌కు అనుమతిచ్చారని, ఇప్పుడు అక్కడ గజం రూ. 40 వేల ధర పలుకుతోందని మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ ఆయన దృష్టికి తీసుకురాగా, మరో రెండేళ్లలో స్వర్ణయుగం వస్తుందని, అప్పుడు తాను ఇక్కడి పేదలకు గజం రూ. 50కే రిజిస్ట్రేషన్ చేయిస్తానని ప్రజల హర్షధ్వానాల మధ్య జగన్ ప్రకటించారు. గతంలో మహానేత వైఎస్సార్ కృష్ణలంక, రాణిగారితోట ప్రాంతాల్లో సుమారు 3,500 కుటుంబాలకు ఇదేవిధంగా గజం రూ. 100కే రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పించారు. జగన్ ప్రస్తుత హామీతో కొండ ప్రాంతాలు, కరకట్ట, పాయకాపురం వాసులు సుమారు 10 వేల మంది పేద కుటుంబాల వారికి లబ్ధి కలుగుతుందని భావిస్తున్నారు.
Share this article :

0 comments: