సీబీఐ అసమర్ధతకు సాయిరెడ్డిని బలిచేస్తారా? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » సీబీఐ అసమర్ధతకు సాయిరెడ్డిని బలిచేస్తారా?

సీబీఐ అసమర్ధతకు సాయిరెడ్డిని బలిచేస్తారా?

Written By news on Saturday, April 28, 2012 | 4/28/2012

ప్రత్యేక కోర్టులో సుశీల్‌కుమార్ వాదన
ఆయన సాక్షులను బెదిరిస్తారనుకుంటే 
వారులేని ప్రాంతాల్లో ఉండటానికీ సిద్ధం
దర్యాప్తు సాకుతో బెయిల్ ఇవ్వరాదంటే ఎలా?
బెయిల్ ఉత్తర్వుల పునఃపరిశీలనకు సంబంధించి వాదనలు పూర్తి
నిర్ణయం 30వ తేదీకి వాయిదా వేసిన జడ్జి

హైదరాబాద్, న్యూస్‌లైన్: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కంపెనీల్లో పెట్టుబడుల వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు ఎనిమిది నెలలుగా కొనసాగుతోందని, దర్యాప్తును పూర్తిచేయలేని సీబీఐ.... తన అసమర్ధతకు ఈ కేసులో నిందితునిగా ఉన్న విజయసాయిరెడ్డిని బలిచేస్తోందని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సుశీల్‌కుమార్ సీబీఐ ప్రత్యేక కోర్టుకు నివేదించారు. దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది కాబట్టి సాయిరెడ్డికి బెయిల్ ఇవ్వరాదని సీబీఐ వాదిస్తోందని, తన చేతగానితనానికి ఆయన్ను శిక్షిస్తే ఎలా అని ప్రశ్నించారు. సాయిరెడ్డికి మంజూరు చేసిన బెయిల్ ఉత్తర్వులను పునఃపరిశీలించాలంటూ హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో...ఈ ఉత్తర్వులను సీబీఐ రెండవ అదనపు ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి బి.నాగమారుతిశర్మ శుక్రవారం విచారించారు. 

సాయిరెడ్డికి గతంలో ఇదే కోర్టు ఇచ్చిన బెయిల్‌ను హైకోర్టు రద్దు చేయలేదని, నిలిపివేస్తూ పునఃపరిశీలన చేయాలని మాత్రమే కింది కోర్టును ఆదేశించిన విషయం సుశీల్‌కుమార్ గుర్తుచేశారు. దర్యాప్తును అడ్డుకుంటారనో, సాక్ష్యాలను మాయం చేస్తారనో, సాక్షులను ప్రభావితం చేస్తారనో సీబీఐ ఆధారాలతో సహా నిరూపించగలిగితే హైకోర్టు సాయిరెడ్డి బెయిల్‌ను రద్దు చేసి ఉండేదని చెప్పారు. జగతి పబ్లికేషన్స్‌కు అసెస్‌మెంట్ నిర్వహించిన డెలాయిట్ సంస్థ డెరైక్టర్ సుదర్శన్.. సీఆర్‌పీసీ 164 సెక్షన్ మేరకు ఇచ్చిన వాంగ్మూలాన్ని సీబీఐ హైకోర్టులో ప్రస్తావించిందని, అయితే ఆ డాక్యుమెంట్‌ను చార్జిషీట్‌లో ప్రస్తావించలేదని తెలిపారు. 

చార్జిషీట్‌లో ఆ డాక్యుమెంట్ ఎక్కడుందో చూపాలని సీబీఐ తరఫు న్యాయవాది కేశవరావును ప్రశ్నించగా... ఆయన చూపించేందుకు కొద్దిసేపు ప్రయత్నించి తడబడ్డారు. చార్జిషీట్‌లో ఆ డాక్యుమెంట్ వివరాలు లేకపోవడంతో ఆ విషయాన్ని పక్కనబెట్టి తన వాదనలు కొనసాగిస్తానని చెప్పారు. కాగా ఆ డాక్యుమెంట్‌ను సీబీఐ అధికారులు ఈ రోజు (శుక్రవారం) మెమో రూపంలో సీబీఐ ప్రత్యేక కోర్టుకు సమర్పించారని సుశీల్‌కుమార్ స్పష్టం చేశారు. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి నిర్ణయాన్ని ఈనెల 30కి వాయిదా వేశారు.

సాయిరెడ్డి తరఫు న్యాయవాది సుశీల్‌కుమార్ వాదనల్లోని ముఖ్యాంశాలు...

జగతి పబ్లికేషన్స్‌లో పెట్టుబడులు పెట్టిన కోల్‌కతా కంపెనీలు బినామీవని, అవి ఆయా చిరునామాల్లో లేవని అక్కడి ఆదాయపన్ను శాఖ అధికారి 2008-09, 2009-10 సంవత్సరాలకు సంబంధించిన నివేదికలో పేర్కొన్నట్టుగా సీబీఐ చెబుతోంది. అవి కేవలం పెట్టుబడులు పెట్టడానికి మాత్రమే సృష్టించిన సూట్‌కేస్ కంపెనీలని పేర్కొంటున్నారు. ఆదాయపన్ను శాఖ నివేదికను ఎలా పరిగణనలోకి తీసుకుంటారు? ఈ కంపెనీల విషయంలో సీబీఐ ఏం దర్యాప్తు చేసింది ? సీబీఐ అధికారులు అక్కడికి ఎందుకు వెళ్లలేదు ? ఎవరో ఏదో చెబితే అది విని అందుకు సాయిరెడ్డి బాధ్యుడంటే ఎలా? అయినా ఆదాయపన్ను శాఖ నివేదికను ఐటీ ట్రిబ్యునల్‌లో సవాల్ చేశాం. ఆ విషయాన్ని సీబీఐ ప్రస్తావించడం లేదు. ఐటీ ట్రిబ్యునల్ ఆ అంశాన్ని తేల్చేవరకు ఇక్కడ ఆ విషయాన్ని ప్రస్తావించరాదు. 

పెట్టుబడులు పెట్టిన కంపెనీలు లేవంటూ సాయిరెడ్డిని బాధ్యుణ్ణి చేస్తే ఎలా ? పెట్టుబడులు పెట్టింది జగతి పబ్లికేషన్స్‌లో. అయినా లెక్కలు చెప్పని నగదు ఉందంటే దాన్ని ఆదాయంగా భావించి ఆదాయపన్ను శాఖ జరిమానా విధించవచ్చు. అదేం పెద్ద నేరం కాదు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టాన్ని కూడా తెస్తోంది. 

చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌ల్లో ఉంటే సాక్షులను బెదిరిస్తారని భావిస్తే సాక్షులెవరూ లేని ప్రాంతంలో ఉండేలా ఆదేశాలు జారీ చేయవచ్చు. అభ్యంతరం లేకపోతే ఢిల్లీలో ఉంటారు. దర్యాప్తునకు విఘాతం కల్గించరు. 

2004లో అప్పటి ముఖ్యమంత్రి కొన్ని కంపెనీలకు లబ్ధి చేకూర్చారంటున్నారు. ఏడేళ్ల తర్వాత 2011లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. జగన్ కంపెనీల్లో పెట్టుబడుల వ్యవహారంలో హైకోర్టుకు ఫిర్యాదు చేయడం వెనుక రాజకీయ దురుద్దేశాలున్నాయి. రాజకీయ ప్రత్యర్థులు వేసిన పిటిషన్లు అవి. అందులో ప్రజా ప్రయోజనం లేదు. రాజకీయంగా లబ్ధి పొందాలనేదే వారి లక్ష్యం. 

సీబీఐని రాజకీయ ప్రత్యర్థులు వాళ్లకు అనుకూలంగా వాడుకుంటున్నారు. ప్రభుత్వాలు ఏమైనా చేయాలని భావిస్తే అందుకు సీబీఐని ఆయుధంగా వాడుకుంటున్నాయి. ప్రభుత్వాలకు అనుగుణంగా సీబీఐ వ్యవహరిస్తోంది.

హైకోర్టు ఉత్తర్వుల మేరకు సాయిరెడ్డి ఈనెల 23న కోర్టులో లొంగిపోయారు. ఉదయం నుంచి కోర్టులోనే ఉన్నారు. బెయిల్ సందర్భంగా కోర్టు విధించిన ఎటువంటి షరతులను ఉల్లంఘించలేదు. అయినా సీబీఐ డిప్యూటీ లీగల్ అడ్వయిజర్ నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేయాలని కోర్టును కోరారు. బెయిల్‌కు తగు కారణాలు చెప్పలేదని పేర్కొంటూ, వీలైనంత త్వరగా పునఃపరిశీలించి బెయిల్‌పై పునర్విచారణను ముగించాలని హైకోర్టు స్పష్టం చేసింది. 

ఎప్పుడో వేసే చార్జిషీట్‌ను కూడా ఇప్పుడు ప్రస్తావించి, అన్నిటినీ ఆపాదించి బెయిల్‌ను అడ్డుకోవడం తగదు. 

ఈ కేసులో నిందితులుగా ఉన్న 74 మంది కుట్రపన్నారని చెబుతున్నారు. జగతిలో పెట్టుబడులు పెట్టిన కంపెనీల్లో ఒకరికొకరు తెలియదు. అరబిందోకు హెటిరో వాళ్లు తెలి యదు. హెటిరోకు అరబిందో వాళ్లు తెలియదు. అలాంట ప్పుడు అందరూ కుట్ర చేశారనడానికి ఆధారాలేంటి ? 

సాయిరెడ్డిదే కీలకపాత్ర : సీబీఐ

జగతి పబ్లికేషన్స్‌లో సాయిరెడ్డి 2006 నవంబర్ 14 నుంచి 2007 జూన్ 21 వరకు డెరైక్టర్‌గా కొనసాగారని, తర్వాత డెరైక్టర్‌గా తప్పుకున్నా జగతి పబ్లికేషన్స్ కార్యకలాపాల్లో కీలకపాత్ర పోషించారని సీబీఐ న్యాయవాది కేశవరావు వాదిం చారు. పత్రికారంగంలో లాభాలు రావాలంటే కనీసం ఐదేళ్లు పడుతుందని, సాయిరెడ్డి జగతి పబ్లికేషన్స్ విలువను ఎక్కువగా చేసి చూపి షేర్‌ను రూ.350 చొప్పున విక్రయించి పెట్టుబడులు పెట్టించారని ఆరోపించారు. జగతి పబ్లికేషన్స్‌కు అసెస్‌మెంట్ (2008) చేసిన డెలాయిట్ కంపెనీ ప్రతినిధి ప్రవీణ్‌హెగ్డే విజయసాయిరెడ్డి పేరుతో లేఖ పంపారని, దీన్నిబట్టి చూస్తే డెరైక్టర్‌గా లేకపోయినా సాయిరెడ్డి కీలక బాధ్యతలు నిర్వహించారని తెలుస్తోందన్నారు. బినామీ కంపెనీలను సృష్టించడం వెనుక సాయిరెడ్డి ప్రమేయం ఉందన్నారు.
Share this article :

0 comments: