అనుభవాల నుంచి పాఠాలు నేర్వని సర్కారు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » అనుభవాల నుంచి పాఠాలు నేర్వని సర్కారు

అనుభవాల నుంచి పాఠాలు నేర్వని సర్కారు

Written By news on Wednesday, April 11, 2012 | 4/11/2012


ఎరువులు, విత్తనాలకు కొరత ఏర్పడే ప్రమాదం

రబీ తర్వాత ఖరీఫ్.. ఖరీఫ్ తర్వాత రబీ..! సీజన్లు ఎన్నిసార్లు మారుతున్నా రైతన్నకు మాత్రం అవే కష్టాలు.. అవే కడగండ్లు!! ఈసారీ అదే జరగబోతోంది. మరో రెండు నెలల్లో ప్రారంభం కాబోతున్న ఖరీఫ్ కాలం అన్నదాతకు కష్టాలను మోసుకురాబోతోంది. ఎప్పట్లాగే సర్కారు నిర్లక్ష్యమే రైతన్నకు శాపంగా మారబోతోంది. కేంద్రం ఇచ్చే ఎరువులను దాచుకునేందుకు రాష్ట్ర గోదాముల్లో స్థలం కూడా లేదు! అసలే రాష్ట్ర సర్కారు అడిగిన దాని కంటే కేంద్రం ఏకంగా 1.95 లక్షల టన్నులను తగ్గించి ఇస్తోంది. ఆ అరకొర ఎరువులను అయినా జాగ్రత్త చేసుకుందామన్న ఆలోచన సర్కారుకు లేకుండా పోయింది. గోదాములు ఖాళీ చేయించకపోవడంతో విశాఖ ఓడరేవుకు మూడ్రోజుల కిందట చేరిన 75 వేల టన్నుల ఎరువులు అక్కడే మూలుగుతున్నాయి. వాటిని గోదాములకు తరలించకపోతే ఇతర రాష్ట్రాలకు మళ్లిస్తామని క్రిభ్‌కో, ఇఫ్కోలు చెబుతున్నాయి. ఇక విత్తనాల పరిస్థితి మరీ దారుణం. రైతులకు నాణ్యమైన విత్తనాలు అందిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.60 కోట్లు ఖర్చుపెట్టి 30.71 లక్షల క్వింటాళ్ల ధ్రువీకృత విత్తనాలను రైతుల ద్వారా పండించింది. అయితే వాటిని ఇప్పటికీ సేకరించలేదు.. సరికదా సేకరణ ధర కూడా నిర్ణయించలేదు.

Share this article :

0 comments: