‘ఆరోగ్యశ్రీ’పై అన్నీ అబద్ధాలే! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ‘ఆరోగ్యశ్రీ’పై అన్నీ అబద్ధాలే!

‘ఆరోగ్యశ్రీ’పై అన్నీ అబద్ధాలే!

Written By news on Friday, April 13, 2012 | 4/13/2012

-గుండం రామచంద్రారెడ్డి
‘సాక్షి’ ప్రతినిధి

ఆ రోజుల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళితే మందులు ల భించేవి. సమయానికి వైద్యులు ఉండేవారు. వైద్య పరీక్షలు క్రమం తప్పకుండా జరిగేవి. అంటువ్యాధులు ప్రబలకుండా సకాలంలో అన్ని ఏర్పాట్లు జరిగేవి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి రాలేని పల్లెటూరి పేద రోగుల కోసం 104 వాహనాలలో వైద్య సిబ్బంది వారి ఇళ్లకు వెళ్లి మందులివ్వడమే కాకుండా రోగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించేవారు. మారుమూల గ్రామీణ ప్రాం తాలు, గిరిజన ఏజెన్సీ ప్రాంతాల్లో సైతం ఏదైనా ఆపద సంభవిస్తే కుయ్‌కుయ్‌మని 108 పరిగెట్టుకుంటూ వచ్చేది. క్షణాల్లో ఆస్పత్రికెళితే ప్రాణం పోకుండా వైద్యసేవలు అం దేవి. తెలుగువారి సంజీవనిగా చెప్పుకునే ఆరోగ్యశ్రీ పేదవారికి భరోసానిచ్చింది. పెద్ద జబ్బు వస్తే చావుకు దగ్గర కావడమే తప్ప మరో మార్గం లేని, డబ్బు ఖర్చు చెయ్యలేని ఎంతోమంది పేదలకు కార్పొరేట్ ఆస్పత్రుల్లో చికిత్స చేయించి ఇంటికి క్షేమంగా పంపించిన పథకం అది. మహానేత వైఎస్ పేదసాదల ఆరోగ్యం పట్ల చూపిన శ్రద్ధాసక్తుల ఫలితం ఇది. 1995 నుంచి 2003 వరకూ మం దులు సరిగా అందక, వైద్యులు లేక విలవిలలాడిన పేద రోగులకు ఊరట లభించిన మంచి కాలం అది.

గ్రామీణ రోగులకు భరోసా

గ్రామీణ రోగులకు జబ్బు వస్తే మొదటగా గుర్తుకొచ్చేది ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలే. వాటి బాగోగులపై వైఎస్ చూపిన మక్కువ అంతా ఇంతా కాదు. సర్కారు ఆస్పత్రులకు కేటాయించే మందుల బడ్జెట్‌లో ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలకు దక్కాల్సిన 40 శాతం ఎప్పుడూ తగ్గకుండా చూశారు. అవసరాన్ని బట్టి అదనంగా కూడా ఇచ్చారు. వివిధ డిస్పెన్సరీలు, సివిల్ డిస్పెన్సరీలు, సబ్‌సెంటర్లను ఉన్నతీకరించి 200 పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలుగా మార్చా రు. సిబ్బంది లేకపోతే రోగులకు ఇబ్బందులు తప్పవని గ్రహించిన వైఎస్ 2006లో జీవో నం.138ని జారీ చేసి 3,500 మంది సిబ్బందిని నియమించారు. ఇందులో 1,081 మంది డాక్టర్లు, 1,200 మంది పారామెడికల్ సిబ్బంది, 1,220 మంది నర్సులు ఉన్నారు. అప్పట్లో ఈ నియామకాలు జరిగాయి కాబట్టే ఇప్పటికీ అక్కడ డాక్టర్ల సేవలు నిరాటంకంగా కొనసాగుతున్నాయి. ఎంబీబీఎస్ పూర్తయిన అభ్యర్థులు గ్రామీణ సర్వీసుల్లో తప్పనిసరిగా పనిచేయాలని ఆదేశాలివ్వడంతో ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు మరింత బలపడ్డాయి. అంతేకాదు 2 వేల మంది కాంట్రాక్టు ఏఎన్‌ఎంలను నియమించి మారుమూల పల్లెల్లోనూ సేవలందేలా చూశారు. గ్రామీణ స్థాయిలో ఆరోగ్య శిబిరాలు నిర్వహించి ప్రాణాంతక జబ్బులున్న వారిని కార్పొరేట్ ఆస్పత్రుల్లో చేర్చి ఆరోగ్యశ్రీ ద్వారా సేవలందించిన ఘనత వైఎస్‌కే దక్కుతుంది. 1,629 ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు, 12,200 ఉప కేంద్రాలు, 200 సీహెచ్‌సీల్లో ఎప్పుడూ మందుల కొరత తలెత్తకుండా చూశారు.

మారుమూలకూ మందుల బండి!

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు 3 కిలోమీటర్ల దూరంలో ఉంటూ, ఆయా కేంద్రాలకు రాలేని పేద రోగుల కోసం 104 పథకాన్ని వైఎస్‌ఆర్ ప్రవేశపెట్టారు. కాల్‌సెంటర్ ద్వారా ఉచిత వైద్య సలహాలు అందించడం, ఎఫ్‌డీహెచ్‌ఎస్ (ఫిక్స్‌డ్ డే హెల్త్ సర్వీసెస్) ద్వారా పల్లెవాసులకు మందులివ్వడం దీని ముఖ్యోద్దేశం. సుమారు 26 వేల గ్రామాల ప్రజలకు ఉద్దేశించిన ఈ పథకం ద్వారా మధుమేహం, క్షయ, రక్తపోటు, మూర్ఛ లాంటి దీర్ఘకాలిక వ్యాధులతో పాటు, జ్వరాలు, విరేచనాలు, కడుపునొప్పి, కీళ్ల నొప్పులు తదితర సాధారణ జబ్బులకూ 104 వాహనాల్లో వెళ్లి ఉచితంగా మందులు పంపిణీ చేస్తారు. దీని కోసం 475 వాహనాలు అప్పట్లో కొనుగోలు చేసి ఒక్కో వాహనంలో వైద్యులు, పారామెడికల్ సిబ్బంది, నర్సులు వెళ్లి, మందులివ్వడంతో పాటు ఉచితంగా వైద్య పరీక్షలు కూడా నిర్వహించేవారు. దీనికోసం ఏటా రూ.90 కోట్ల బడ్జెట్ కేటాయించారు. రోజూ కనీసం 900 గ్రామాల్లో మందులు క్రమంతప్పకుండా అందేవి. వైద్య సిబ్బంది నెలకు 475 వాహనాల్లో 25,200 గ్రామాలకు వెళ్లి సేవలందించేవారు. ఒక్కో గ్రామంలో 60 నుంచి 70 మందికి మందులు ఇవ్వడంతోపాటు ఇతర వైద్య సేవలూ అందేవి. అంటే ఏటా 2 కోట్ల మంది పేద, గ్రామీణ రోగులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందేవారు. గర్భిణులు, బాలింతలు, చిన్నారులు, స్కూలు పిల్లలు, వృద్ధులు ఉచితంగా మందులు లభిస్తుండటంతో రోగమొచ్చినా నొప్పొచ్చినా నిర్భయంగా ఉండేవారు.

దేశంలోనే ‘108’ రోల్‌మోడల్

పేద, ధనిక తారతమ్యం లేకుండా ఎప్పుడు ఎక్కడ ఎవరికి ఆపద వచ్చినా నేనున్నానంటూ కుయ్‌కుయ్‌మని ముం దుకు వచ్చి కాపాడే 108 అంబులెన్సుల పథకం దేశానికే రోల్‌మోడల్ అయింది. 108 వాహనం రోగిని అక్కున చేర్చుకుని ఆస్పత్రికి తీసుకెళ్లేవి. ఎక్కడ ప్రమాదం జరిగినా 25 నిమిషాల్లోనే ఘటనా స్థలికి వాహనం చేరుకోవడం, క్షణాల్లో ఆస్పత్రికి తీసుకెళ్లడం నిత్యకృత్యంగా ఉండేది. 150 వాహనాలతో మొదలైన ‘108’ పథకం 2009 నాటికి 802 వాహనాలకు చేరుకుంది. ప్రతిరోజూ 6 వేల ఎమర్జెన్సీ ఫోన్ కాల్స్ వస్తే కనీసం 4 వేల మందిని ప్రాణాపాయం నుంచి కాపాడేవి. కనీసం నెలకు లక్ష మందిని ప్రాణాపాయస్థితి నుంచి కాపాడేవి. గర్భిణులను కూడా 108 వాహనాలే ప్రసవానికి ఆస్పత్రులకు తీసుకెళ్లడం వలన, సకాలంలో సేవలు అంది తల్లీబిడ్డలు క్షేమంగా తిరిగి ఇళ్లకు చేరేవారు. 2007లో ప్రారంభమైన ఈ పథకం ప్రాథమిక దశలో అంబులెన్సులు తక్కువగా ఉండటంతో సేవల్లో నెమ్మదిగా ఉన్నా, 2008 నుంచి లక్షలాది మందిని ప్రమాదం నుంచి బయటపడేసింది. 2009లో 2.81 లక్షల మంది గర్భిణి స్త్రీలను అవి ఆసుపత్రులకు చేర్చాయి. ఈ పథకానికి 2008 నుంచి ఏటా రూ.100 కోట్లు తక్కువ కాకుండా బడ్జెట్ కేటాయించారు. ఈ పథకం సాధించిన ఫలితాలు చూసిన సుమారు 13 రాష్ట్ర ప్రభుత్వాలు 108 పథకాన్ని అమలు చేయడానికి పూనుకున్నాయి. 

పేదవాడి సంజీవని ‘ఆరోగ్యశ్రీ’

పేదవాడికి ఇది సంజీవనే. దేశంలో ఎవరికీ, ఏ ముఖ్యమంత్రికీ రాని ఆలోచన వైఎస్‌కి వచ్చింది. అంతే... అది అమలయ్యే వరకూ తిరిగి చూడలేదు. తెల్లరేషన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబమూ పెద్దపెద్ద జబ్బులకు కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఉచితంగా వైద్యం పొందే వసతి కల్పించేందుకు పూనుకున్నారు. 
తొలుత 350 జబ్బులకు మాత్రమే వైద్యమందించిన ‘ఆరోగ్యశ్రీ’ క్రమంగా 938 జబ్బులకు వైద్యం అందించే స్థాయికి చేరింది. దశలవారీగా రాష్ట్రమంతా విస్తరించింది. ఈ పథకం కింద పేద రోగులకు రోజుకు సుమారు రూ.3 కోట్ల మేర ఖర్చు చేశారు. ఇప్పటి వరకూ సుమారు 12 లక్షల మంది శస్త్రచికిత్సలు చేయించుకున్నారు. దీనివల్ల చిరకాలంగా జబ్బుపడి ‘రోగ నిలయాలు’గా మారిన ప్రభుత్వాసుపత్రుల ‘ఆరోగ్యం’ బాగుపడింది. ప్రభుత్వాసుపత్రుల్లో శస్త్రచికిత్సలు జరిగినా ఆరోగ్యశ్రీ నుంచి డబ్బులు వచ్చేవి. ఇప్పటి వరకూ అలా ఆస్పత్రి అభివృద్ధి నిధుల కింద సుమారు రూ.90 కోట్లపైనే ఆదాయం వచ్చింది. పథకం నిర్వహణకు ఏటా రూ.925 కోట్లు ఖర్చు చేశారు. ఏ కార్పొరేట్ ఆస్పత్రికెళ్లినా ఒక్క పైసా లేకుండా వైద్యమందించే ఈ పథకం ద్వారా ఎంతోమంది గుండెజబ్బులు, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల బారి నుంచి బయటపడ్డారు.

తీరు మారింది... శోకం మిగిలింది!

వైఎస్ మరణానంతరం సర్కారు తీరు మారింది. పేద రోగులకు శోకమే మిగిలింది. ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లో మందు బిళ్లలు లేవు. 600 డాక్టర్ల పోస్టులు ఖాళీగా ఉన్నా భర్తీ చేయడంలేదు. 2 వేల మంది ఏఎన్‌ఎంలకు జీతాలు రాకపోయినా స్పందించరు. ఇక 104 పథకం ఆరు నెల లుగా మూతపడింది. ఉద్యోగులు జీతాలు పెంచాలని, భద్రత కల్పించాలని సమ్మెచేస్తే పట్టించుకోలేదు. నెలనెలా పల్లెలకొచ్చే ఉచిత మందులకోసం పేదరోగులు కళ్లు కాయలు కాసేలా ఎదురు చూడటం మినహా ఏమీ చేయలేని స్థితి. బడ్జెట్ కూడా రూ.80 కోట్ల నుంచి రూ.40 కోట్లకు కుదించారు. ఇక 108 వాహనంలో వేగం తగ్గింది. ఎమర్జ్జెన్సీ కాల్స్ అటెండ్ చేసే సమయం 25 నిమిషాల నుంచి 40 నిమిషాలకు పెరిగింది. 200 వాహనాలు షెడ్లకే పరిమితమయ్యాయి. ఏటా రూ.100 కోట్లు ఉన్న బడ్జెట్ పెంచాల్సింది పోయి రూ.80 కోట్లకు తగ్గించారు. నెలన్నర సమ్మె జరిగితే పట్టించుకోలేదు. 

ఆరోగ్యశ్రీ పరిస్థితీ అంతే. 133 జబ్బులను ప్రైవేటు ఆస్పత్రుల పరిధి నుంచి తీసేసి ప్రభుత్వాసుపత్రులకు పరిమితం చేశారు. వసతులు, యంత్ర పరికరాలు మెరుగుపరచకుండా ఈ నిర్ణయం తీసుకోవడంతో రోగుల పరిస్థితి అధ్వానంగా మారింది. బోధనాస్పత్రుల్లో, జిల్లా ఆస్పత్రుల్లో మందుల్లేక రోగులు అల్లాడుతున్నా సర్కారు పట్టించుకునే స్థితిలో లేదు. ఏతావాతా తేలేదేమంటే ‘ఆరోగ్యశ్రీ’ మూలంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రభుత్వ ఆస్పత్రులు నిర్లక్ష్యానికి గురికాలేదు. గుర య్యాయనే ప్రచారంలో కించిత్తయినా వాస్తవం లేదు. అం తేకాదు, ఆరోగ్యశ్రీ వలన అవి లబ్ధి పొందాయి. జవాబు దారీతనం సమకూరి వాటి పని తీరు మెరుగైంది. అందుకే ‘ఆరోగ్యశ్రీ’ పథకాన్ని చిత్తశుద్ధితో పూర్తిస్థాయిలో కొనసా గించాల్సిన అవసరం ఉంది. 
Share this article :

0 comments: