బాబు నింపింది పెద్దల బొజ్జలే! తొమ్మిదేళ్ల ‘సీఎం గిరీ’పై సెస్ విశ్లేషణ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » బాబు నింపింది పెద్దల బొజ్జలే! తొమ్మిదేళ్ల ‘సీఎం గిరీ’పై సెస్ విశ్లేషణ

బాబు నింపింది పెద్దల బొజ్జలే! తొమ్మిదేళ్ల ‘సీఎం గిరీ’పై సెస్ విశ్లేషణ

Written By ysrcongress on Saturday, April 7, 2012 | 4/07/2012

అన్ని రంగాల్లోనూ రాష్ట్రాన్ని చంద్రబాబు కుదేలు చేశారు
కుండబద్దలు కొట్టిన సెంటర్ ఫర్ ఎకనమిక్స్ అండ్ సోషల్ స్టడీస్ నివేదిక
బాబు హయాంలోనే భారీగా భూ సంతర్పణలు
పెట్టుబడిదారులకు ఆగమేఘాలపై అనుమతులు, ఉచిత లెసైన్సులు
ఇంత చేసినా.. కల్పించిన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మాత్రం శూన్యం
ఎన్టీఆర్‌ను కూలదోయడాన్ని టీడీపీ అంతఃకలహంగా తీసేయలేం
పెట్టుబడిదారీ వర్గ ఆకాంక్షల దన్నుతోనే బాబు గద్దెనెక్కారు
ఇందులో రామోజీరావు, ‘ఈనాడు’ పాత్ర చాలా కీలకమైనది
సీఎం కాగానే పెట్టుబడిదారులను బాబు నెత్తిన పెట్టుకున్నారు
ఆయన విధానాలతో పూర్తిగా ప్రైవేటు వ్యక్తులే లాభపడ్డారు
{పపంచబ్యాంకు పోస్టర్‌బోయ్‌గా దాని విధానాలను రాష్ట్రంపై రుద్దారు
ఐటీ జపంతో వ్యవసాయ, పారిశ్రామిక రంగాలను నిర్లక్ష్యం చేశారు
పేదల పొలికేక దెబ్బకు 2004లో దారుణంగా ఓడారు

హైదరాబాద్, న్యూస్‌లైన్: చంద్రబాబు నాయుడు ముఖ్య మంత్రిగా ఉన్న తొమ్మిదేళ్ల కాలంలో కొందరు ప్రైవేటు వ్యక్తులు మాత్రమే ఆస్తులు పెంచుకుని లాభపడ్డారని సెంటర్ ఫర్ ఎకనమిక్స్ అండ్ సోషల్ స్టడీస్ (సెస్) కుండబద్దలు కొట్టింది. ఆయన రూపొందించిన పారిశ్రామిక విధానం అందుకు మాత్రమే దోహదపడిందని తేల్చిచెప్పింది. ‘‘ప్రపంచబ్యాంకు పోస్టర్‌బోయ్‌గా మారి అన్ని రంగాల్లోనూ రాష్ట్రాన్ని బాబు కుదేలు చేశారు. ఐటీ జపంతో వ్యవసాయ, పారిశ్రామిక రంగాలను నిర్లక్ష్యం చేశారు. ప్రైవేటు సంస్థలను నెత్తిన పెట్టుకుని ప్రభుత్వ రంగ సంస్థల పుట్టి ముంచారు. ఆయన హయాంలో పేరుకు పెట్టుబడులు కన్పించినా అందుబాటులోకి వచ్చిన ఉపాధి అవకాశాలు మాత్రం శూన్యం’’ అని వివరించింది. ఎన్టీఆర్‌ను కూలదోసి బాబును గద్దెనెక్కించడం వెనక పెట్టుబడిదారీ వర్గం ఆకాంక్షలే పని చేశాయని వెల్లడించింది. ఆ దిశగా అప్పటి టీడీపీ సంక్షోభాన్ని తారస్థాయికి పెంచడంలో రామోజీరావు పూర్తిగా విజయం సాధించారంటూ పూసగుచ్చింది. ఈ విషయంలో ‘ఈనాడు’ పోషించిన పాత్ర అత్యంత కీలకమని వివరించింది. పారిశ్రామికాభివృద్ధి కోసం వివిధ ముఖ్యమంత్రులు చేపట్టిన విధానాలను, సాధించిన ప్రగతిని రాజకీయ, ఆర్థిక కోణాల్లో విశ్లేషిస్తూ రూపొందించిన నివేదికను సెస్ ఇటీవల విడుదల చేసింది. అందులోని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి...

1995లో బాబు సీఎం కావడాన్ని కేవలం టీడీపీలో జరిగిన సాధారణ నాయకత్వ మార్పుగా చూడరాదు. ఎన్టీఆర్ అనుసరించిన ప్రజాకర్షక సంక్షేమ పథకాల అమలుతో తమ వ్యాపారావకాశాలకు గండిపడిందని భావించిన పెట్టుబడిదారీ వర్గం.. టీడీపీలో నెలకొన్న సంక్షోభాన్ని ఒడుపుగా అందిపుచ్చుకుంది. సంక్షోభాన్ని పెంచి పోషించి తారస్థాయికి చేర్చడంలో ‘ఈనాడు’ పోషించిన పాత్ర అత్యంత కీలకం. ప్రజాబలంతో అధికారంలోకి వచ్చిన ఎన్టీఆర్‌ను దించేసి.. ఆయన స్థానంలో చంద్రబాబును అధికారంలోకి తీసుకురావడంతో ఈ వర్గం విజయం సాధించింది.

పెట్టుబడిదారీ వర్గం అండతో బాబు అధికారంలోకి రావడంతో.. ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడిదారుల అనుకూల రాష్ట్రంగా పేరు తేవడంలోనూ ఈ వర్గం తమదైన పాత్ర పోషించింది. బాబు గద్దెనెక్కగానే సీఎం కార్యాలయం పని చేయాల్సిన తీరునే మార్చేశారు. పెట్టుబడిదారులతో సీఎం నేరుగా ముఖాముఖి మాట్లాడడానికి వేదికగా సీఎంవో మారిపోయింది.

తమవల్ల అభివృద్ధి ఎలా సాధ్యమవుతుందో చూపించడానికి ఒక మోడల్ స్టేట్, ఒక రోల్ మోడల్ సీఎం కోసం ప్రపంచబ్యాంకు, డీఎఫ్‌ఐడీ వంటివి వెతుకుతున్న రోజులవి. బాబు పెట్టుబడిదారీ అనుకూల విధానాలు, పారిశ్రామికవేత్తలతో భేటీల కోసం సీఎం హోదాలో ఆయన చూపుతున్న అత్యుత్సాహం ప్రపంచబ్యాంక్ ‘పోస్టర్ బాయ్’కి అతికినట్టు సరిపోయాయి. అలా అంతర్జాతీయ సంస్థల వెదుకులాట ఫలించింది. సంస్కరణవాదిగా పాశ్చాత్య మీడియాలో బాబుకు అత్యంత ప్రచారం లభించడానికి ప్రపంచబ్యాంకే కారణం.

ఎన్టీఆర్, అంతకు ముందు ముఖ్యమంత్రులు అనుసరించిన సంక్షేమ పథకాలతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారిందంటూ 1996లో ప్రపంచ బ్యాంకు నివేదిక ఇచ్చింది. ‘ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన రూ. 2 కిలో బియ్యం, మద్య నిషేధం వల్ల రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్‌డీపీ)లో 3 శాతం అదనపు భారం ప్రభుత్వంపై పడింది. దాంతో రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలోకి వెళ్లే పరిస్థితి నెలకొంది’ అని బ్యాంకు తన నివేదికలో పేర్కొంది. సంక్షోభం నుంచి బయటపడటానికి సంస్కరణలే మార్గమని సూచించింది.

ఈ సూచనను బాబు తూ.చ. తప్పకుండా పాటించారు. విధానాలన్నీ సంక్షేమం నుంచి పెట్టుబడిదారుల అనుకూలంగా మారిపోయాయి. కేంద్రంలోనూ అనుకూల ప్రభుత్వాలు ఉండటం బాబుకు కలిసొచ్చింది. 1999 ఎన్నికల్లో రెండోసారి అధికారంలోకి రావడంతో టీడీపీలో బాబు తిరుగులేని నేతగా మారిపోయారు. సంస్కరణలకు మరింత పదును పెట్టారు. ఆయన విధానాలు, సంస్కరణలు కేవలం పారిశ్రామిక సంబంధాలకే పరిమితమవకుండా మొత్తం పాలనా వ్యవస్థనే మార్చేస్తున్నాయంటూ మీడియా ఊదరగొట్టింది. ఐటీ ద్వారా స్మార్ట్ (సింపుల్, మోరల్, అకౌంటబుల్, రెస్పాన్సివ్, ట్రాన్స్‌పరెంట్) పాలన అందిస్తున్నామంటూ ప్రభుత్వం భారీగా ప్రకటనలు గుప్పించింది.

బాబు హయాంలో ప్రైవేటు సంస్థలకు భారీ సంఖ్యలో పారిశ్రామిక లెసైన్సులిచ్చారు. వాటి సంఖ్యాపరంగా తమిళనాడు తర్వాతి స్థానం రాష్ట్రానిదే. కానీ అదే కాలంలో తమిళనాడులో అందుబాటులోకి వచ్చిన ఉద్యోగ (ఉపాధి) అవకాశాల్లో రాష్ట్రంలో కేవలం పదో వంతే సాధ్యపడింది!

పరిశ్రమలకు అనుమతులు, భూ కేటాయింపు, పన్నుల రద్దు, రాయితీల మంజూరులో పాలనాపరమైన జాప్యం (బ్యూరోక్రటిక్ డిలే) జరగకుండా ఉండేందుకు సింగిల్ విండో విధానాన్ని ప్రవేశపెట్టారు. పెద్ద సంఖ్యలో పెట్టుబడులు వచ్చినట్టు కనిపించినా అవన్నీ సర్కారు చౌకగా ఇచ్చిన భూములు, ప్రోత్సాహకాలను సంపాదించడానికే పరిమితయ్యాయి. దాంతో బాబు సర్కారు విధానాలు ఉపాధి అవకాశాల కల్పనకు కాకుండా కేవలం కొద్దిమంది వ్యక్తుల ఆస్తుల కల్పనకే దోహదపడ్డాయి. పైగా సర్కారు విధానాలతో ప్రభుత్వ రంగ సంస్థలు మరింతగా బక్కచిక్కిపోయాయి.

అంతర్జాతీయ మేనేజ్‌మెంట్ కన్సల్టెన్సీ సంస్థ ’మెక్ కిన్సే’ రూపొందించిన నివేదికను విజన్ 2020 పేరిట విధానపత్రంగా బాబు తీసుకొచ్చారు. తన హయాంలో వచ్చిన ‘మార్పు’ను ప్రజలకు చేరవేయడానికి మీడియాను ఆయన విస్తృతంగా వినియోగించుకున్నారు. సీఎం, అధికారులు పారిశ్రామిక సంఘాల, సామాజిక భేటీల్లో పాల్గొనడం, సీఐఐ, ఫిక్కీ వంటివి ఏర్పాటు చేసే సదస్సుల్లో మాట్లాడటం వంటివి ప్రధాన వార్తలుగా మీడియాలో వచ్చేవి.

ఏపీఐఐసీకి మున్నెన్నడూ లేనంత అధిక ప్రాధాన్యత కల్పించారు. భూ సేకరణ, ప్రాజెక్టు నివేదికలు, మౌలిక సదుపాయాల కల్పన తదితర బాధ్యతలప్పగించి దాన్ని నోడల్ ఏజెన్సీగా నియమించారు. అందులో కార్పొరేట్ అనుకూల అధికారులను నియమించారు. వివిధ ప్రైవేటు సంస్థలకు, వ్యక్తులకు చౌకగా భూములు కట్టబెట్టి పన్నుల రద్దుతో పాటు పలు ప్రోత్సాహకాలు, రాయితీలు కల్పిస్తూ భారీగా అవగాహనా ఒప్పందాలు కుదుర్చుకున్నారు. కానీ పరిశ్రమల ఏర్పాటులో ఈ ఒప్పందాలన్నీ విఫలయమ్యాయి.

సైబారాబాద్‌ను రాష్ట్ర ముఖచిత్రంగా చూపుతూ ఐటీకి అత్యంత ప్రాధాన్యతనివ్వడం వెనక గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, ఉత్పాదక రంగం, ఆధునిక పారిశ్రామిక రంగాలను నిర్లక్ష్యం చేసిన వైనం దాగుంది. ఐటీ వల్ల అద్భుతాలు జరుగుతాయంటూ బాబు సర్కారు చేసిన ప్రచారం వాస్తవాలను విస్మరించింది. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఐటీ రంగం విస్తృతి సరిపోలేదు. సర్కారు నిర్లక్ష్యం ఫలితంగా వ్యవసాయ, అనుబంధ రంగాలపై ఆధారపడి జీవిస్తున్న కోట్లాది కుటుంబాలు కష్టాల కొలిమిలో కాలిపోతూ పెట్టిన పొలికేక ధాటికి 2004 ఎన్నికల్లో టీడీపీ దారుణంగా ఓడిపోయింది. కరువుకు సర్కారు నిర్లక్ష్యం తోడై వ్యవసాయ రంగం దారుణంగా దెబ్బతింది. దాంతో వ్యవసాయోత్పత్తులపై ఆధారపడ్డ పారిశ్రామిక రంగంపై కోలుకోలేని దెబ్బ పడింది.

2004లో అధికారంలోకి వచ్చిన వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం ఎన్నికల హామీల మేరకు వ్యవసాయానికి తొలి ప్రాధాన్యమిచ్చింది. సాగునీటి రంగానికి భారీగా నిధులు కేటాయించింది. అయితే వ్యవసాయ, సాగునీటి రంగాలకు ప్రాధాన్యమివ్వడమంటే పారిశ్రామికరంగాన్ని నిర్లక్ష్యం చేయడం కాదని కూడా వైఎస్ సర్కారు నిరూపించింది. పెట్టుబడులను ఆకర్షించడంలో గుజరాత్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ తర్వాత నాలుగో స్థానంలో ఆంధ్రప్రదేశ్ నిలిచింది. ఉపాధి అవకాశాలూ గణనీయంగా పెరిగాయి.

వైఎస్ సర్కారు చొరవ వల్ల 57 నోటిఫైడ్, 99 సూత్రప్రాయ అనుమతులొచ్చిన సెజ్‌లు రాష్ట్రానికి వచ్చాయి. ఏపీఐఐసీ 30 సెజ్‌లను అభివృద్ధి చేసింది. మొత్తం సెజ్‌లలో ఐటీ, ఐటీ ఆధారిత సేవలకు సంబంధించినవి 95. అయితే ఈ ఐటీ సెజ్‌లలో కొత్త కంపెనీలు పెద్దగా రాలేదు. ఉన్న కంపెనీలే సెజ్‌లలో చేరి, పన్ను రాయితీలను సంపాదించాయి. అధునాతన పారిశ్రామికీకరణను వేగవంతం చేయడంలో సెజ్‌ల పాత్ర అనుమానాస్పద మే. భూ కేటాయింపులు పొందిన కొన్ని కంపెనీలు స్థిరాస్తి వ్యాపారం చేశాయనే ఆరోపణలున్నాయి.
Share this article :

0 comments: