ప్రజలకు జగన్ భరోసా - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ప్రజలకు జగన్ భరోసా

ప్రజలకు జగన్ భరోసా

Written By news on Friday, April 20, 2012 | 4/20/2012

మా పార్టీ అధికారంలోకొచ్చాక వృద్ధులకు
రూ.700, వికలాంగులకు రూ.వెయ్యి పింఛను ఇస్తాం
వేటకెళ్లి ప్రమాదవశాత్తూ మరణించిన మత్స్యకారుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారమిస్తాం
పిల్లల్ని బడికి పంపితే తల్లి ఖాతాలో చిన్నారికి
రూ.500 చొప్పున జమచేస్తాం

విశాఖపట్నం, న్యూస్‌లైన్: మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి అందించిన సువర్ణయుగం త్వరలోనే మళ్లీ తిరిగొస్తుందని, ఆ ప్రభుత్వంలో మంచి మనసున్న అన్న సీఎం స్థానంలో కూర్చుంటాడని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజలకు భరోసా ఇచ్చారు. ఆ సువర్ణయుగంలో ప్రజల కష్టాలన్నీ తీరుస్తానని, ప్రతి ఒక్కరి బతుకులు మెరుగు చేస్తానని ఉద్ఘాటించారు. విశాఖ జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో గురువారం ఉప ఎన్నికల ప్రచారం మొదలుపెట్టిన జగన్‌మోహన్‌రెడ్డి ఎస్.రాయవరం మండల పరిధిలోని పలు గ్రామాల్లో పర్యటించారు. జగన్‌ను చూసేందుకు జనం భారీ ఎత్తున రోడ్లపై బారులు తీరారు. జననేతకు అడుగడుగునా బ్రహ్మరథం పట్టారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. విశాఖ జిల్లాలో ఓ మత్స్యకార ప్రతినిధికి అసెంబ్లీకెళ్లే అవకాశం కల్పిస్తానన్నారు. ఈ పర్యటనలో జగన్ వెంట పార్టీ అభ్యర్థి గొల్ల బాబూరావు, పార్టీ నేతలు కొణతాల రామకృష్ణ, జ్యోతుల నెహ్రూ, జిల్లా నేత బొలిశెట్టి గోవింద్ తదితరులున్నారు. జగన్‌మోహన్‌రెడ్డి పలుచోట్ల చేసిన ప్రసంగాల సారాంశం ఆయన మాటల్లోనే..

ప్రతి ఒక్కరికీ భరోసా..

మా పార్టీ అధికారంలోకొచ్చాక.. ప్రతి అవ్వ, తాత మూడు పూటలా అన్నం తినేలా నెలకు రూ.700 పెన్షన్ అందిస్తాం. వికలాంగుల పింఛను రూ.వెయ్యికి పెంచుతాం. వేటకెళ్లి ప్రమాదవశాత్తూ మరణించిన మత్స్యకారుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం అందిస్తాం. పిల్లల్ని బడికి పంపితే తల్లిదండ్రులకు వారి బ్యాంకు ఖాతాలో చిన్నారికి రూ. 500 చొప్పున జమ చేస్తాం. ప్రతి ప్రభుత్వ పాఠశాలలో ఆంగ్ల మాధ్యమం కూడా ప్రవేశపెడతాం. నేను చెప్పే ప్రతి మాటా దివంగత నేత పైనుంచి గర్వపడేలా చేసి చూపిస్తా. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తొలిరోజే ఈ ఫైళ్లన్నింటిపైనా సంతకం చేస్తా.

పేదలు వర్సెస్ కుళ్లు రాజకీయాలు..

చంద్రబాబు అవిశ్వాస తీర్మానం పెట్టినప్పుడు నేను బుర్ర చెప్పింది పట్టించుకోలేదు.. ప్రజల బాధలెరిగిన దివంగత నేత వైఎస్సార్ ఆశయాల్ని అమలు చేయాలని గుండె చెప్పినట్టు విన్నా.. అందుకే ఉప ఎన్నికలు వచ్చాయి. ఈ ఎన్నికల్లో రైతులు, పేదలు ఒకవైపు ఉంటే.. కుళ్లు, కుతంత్రాలతో కూడిన రాజకీయాలు మరోవైపు పోటీపడుతున్నాయి. ఫీజు రీయింబర్స్‌మెంట్ అందక, ఫీజు చెల్లించుకోలేని స్థితిలో వరలక్ష్మి ఆత్మహత్య చేసుకున్నపుడుగానీ, లక్ష ఎకరాల్లో రైతులు సమ్మెకు దిగినప్పుడుకానీ టీడీపీ అధినేత చంద్రబాబు అవిశ్వాసానికి ముందుకురాలేదు. పీఆర్పీని చిరంజీవి కాంగ్రెస్‌లో విలీనం చేశాక.. ప్రభుత్వం పడిపోదని తెలిసే.. అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. నాకు మద్దతిస్తున్న ఎమ్మెల్యేలను దూరం చేసి ఇబ్బందులు పెట్టాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని తెలిసినా.. రైతులు, పేదల పక్షాన నిలిచేందుకే నాడు అవిశ్వాసానికి మద్దతుగా ఓటేయించాం. నా మాటకు విలువిచ్చి, పేదలు, రైతుల కోసం పదవిని సైతం వదులుకున్న గొల్ల బాబూరావును ఆశీర్వదించాలని ప్రజల్ని కోరుతున్నా.

ఈ నేతలకు బుద్ధి చెప్పాలి..

ఇవాళ ప్రభుత్వ, విపక్ష నేతలు ప్రజలను గాలికొదిలేశారు. తూర్పుగోదావరి జిల్లాలో 600 మత్స్యకారుల ఇళ్లు దగ్ధమైతే.. అధికార పార్టీకి చెందిన ముఖ్యమంత్రిగానీ, విపక్ష నేత చంద్రబాబుగానీ పరామర్శించిన దాఖలాల్లేవు. ఐదేళ్లకోసారి మాత్రమే రైతులు, పేదల అవసరముంటుందని భావిస్తూ.. పదవుల్ని పట్టుకు వేలాడే ఈ నేతలకు వచ్చే ఉప ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చె ప్పాలి. ఈ ఉప ఎన్నికల్లో నచ్చని వారిపై కేసులు, పోలీస్ స్టేషన్లో హింసలకు అధికారపక్షం వెనుకాడదు. దాంతోపాటు మంత్రులంతా డబ్బు మూటలతో మోహరిస్తారు. ప్రజల ఆప్యాయతా, అనురాగాలకు వెలకట్టేందుకు బారులు తీరుతారు. విలువలకు అర్థం తెలియని ఈ నేతలకు, ఢిల్లీ నుంచి రిమోట్‌తో రాష్ట్రాన్ని పాలిస్తున్న వారికి ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పాలి.
Share this article :

1 comments:

Thulasiram Reddy said...

Late but not never...English Medium education from KG to PG is a very good initiative, English is must now a days to lead the way.Kudos to Jagan for this initiative