సంపాదనే ‘ఆనం’ ధ్యేయం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :
Home » » సంపాదనే ‘ఆనం’ ధ్యేయం

సంపాదనే ‘ఆనం’ ధ్యేయం

Written By news on Saturday, April 7, 2012 | 4/07/2012

ఆనం సోదరులు సంపాదనే ధ్యేయంగా ఊసరవెల్లి రాజకీయాలు చేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు విమర్శించారు. ఆయన శుక్రవారం నెల్లూరు రూరల్ నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ నేత కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి మహాపాదయాత్ర 100వ రోజు కార్యక్రమంలో మాట్లాడారు. ఆనం సోదరులు పదవులు, అక్రమ సంపాదన కోసం ఏ ఎండకు ఆ గొడుగు పడుతూ నీచమైన రాజకీయాన్ని చేస్తున్నారన్నారు. నాడు వైఎస్‌జగన్‌కు ముఖ్యమంత్రి పదవి వస్తుందని భావించి, ఆయన కోసం తన ప్రాణాలైనా ఇచ్చేందుకు సిద్దమని ఆనం వివేకానందరెడ్డి వ్యాఖ్యానించారన్నారు. ఆ తర్వాత మారిన రాజకీయ పరిణామాలతో ఆనం సోదరులు ఫ్లేటు పిరాయించారన్నారు. వారికి ఇది కొత్త కాదన్నారు. ఎన్టీఆర్, నాదెండ్ల భాస్కర్‌రావు, వైఎస్సార్, రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి ఇలా ఎవరు అధికారంలో ఉంటే వారికి తొత్తులుగా మారి రాజకీయాలు చేసే నీచులని విమర్శించారు. శ్రీధర్‌రెడ్డి పార్టీ ఆశయాలను, దివంగత మహానేత సంక్షేమ పథకాలను గడప గడపకు తీసుకెళ్లేందుకు చేపట్టిన మహా పాదయాత్ర అందరికీ స్ఫూర్తిదాయకమన్నారు. వైఎస్ జగన్ పలు సందర్భాల్లో గడప గడపకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం ఎలా జరపాలో నెల్లూరు వెళ్లి శ్రీధర్‌రెడ్డిని చూసి నేర్చుకోండంటూ పలువురు నేతలకు చెప్పారన్నారు. అంతటి ప్రాధాన్యత సంతరించుకున్న 100వ రోజు కార్యక్రమంలో తాను పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. శ్రీధర్‌రెడ్డికి 25 సంవత్సరాల రాజకీయ అనుభవంలో కాంగ్రెస్ పార్టీలో సముచిత స్థానం లభించలేదన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సముచిత స్థానం ఇస్తుందన్నారు. వైఎస్సార్‌సీపీ జిల్లా కన్వీనర్ కాకాణి గోవర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి పోరాట పటిమ తనకు చిన్నప్పటి నుంచి తెలుసనన్నారు. 141 రోజు పాదయాత్ర చేయాలని తన వద్దకు వచ్చినప్పుడు, అది సాధ్యమో కాదో ఆలోచించుకోమని చె ప్పానన్నారు. 100 రోజులు పాదయాత్ర పూర్తి చేయడం సామాన్యమైన విషయం కాదన్నారు. ప్రజల్లో వైఎస్‌జగన్‌పై ఉన్న ప్రేమాభిమానాలు, ఆపాయ్యాయతా అనురాగాలను చూస్తుంటే భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీకి పుట్టగతులు ఉండవని అర్ధమవుతుందన్నారు. అవినీతికి నాంది పలికిన చంద్రబాబు నీతులు చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. జగన్‌ను అష్టకష్టాలు పెట్టాలని కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కై రకరకాలుగా వేధింపులకు గురి చేస్తున్నారన్నారు. సీబీఐతో విచారణ చేయించాయన్నారు. చివరికి సీబీఐ విచారణ కొండను తవ్వి, ఎలుకను పట్టిన చందంగా తయారైందన్నారు. వైఎస్సార్‌సీపీ యువజన విభాగం జిల్లా కన్వీనర్ పి. అనిల్‌కుమార్‌యాదవ్ మాట్లాడుతూ శ్రీధర్‌రెడ్డితో తనకు ఉన్న సోదరభావం ఎన్నడు విడిపోనిదన్నారు. అనం సోదరుల నియంతృత్వాన్ని ఎదుర్కొని స్వతంగా రాజీవ్ భవన్‌ను ఏర్పాటు చేసి, తమకంటూ గుర్తింపు తెచ్చుకున్నామన్నారు. ఆనం సోదరుల ఆగడాలను సమష్టిగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఉప ఎన్నికల్లో కోవూరుకంటే ఎక్కువ మెజారీటీ ఇచ్చి నెల్లూరు సిటీ, రూరల్ నియోజకవర్గాలో వైఎస్సార్‌సీపీ పట్టు నిరూపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. 
కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ తాను వంద రోజుల పాదయాత్రలో దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డిపై ప్రజల్లో ఉన్న అభిమానం, ఆదరణ కల్లారా చూసి తరించనన్నారు. ప్రజలు ఆయన్ను ఆరాధ్య దైవంగా ప్రేమిస్తూ, ఆయన కుమారుడు వైఎస్ జగన్ నాయకత్వంపై చూపుతున్న ఆదరణ అంతా ఇంతా కాదన్నారు. 100 రోజులు పాదయాత్ర చేయడంలో లభించిన ఆత్మసంతృప్తి అంతా ఇంతా కాదన్నారు. ఈ కార్యక్రమంలో నరేష్‌యాదవ్, రాఘవరెడ్డి, తాటి వెంకటేశ్వర్లు, రూప్‌కుమార్‌యాదవ్, ఆనంద్‌బాబు, బాబ్జి, పురుషోత్తం, శ్రీకాంత్, కిరణ్, తదితరులు పాల్గొన్నారు.
Share this article :

0 comments: