అడుగడుగునా నీరా‘జనం’ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » అడుగడుగునా నీరా‘జనం’

అడుగడుగునా నీరా‘జనం’

Written By ysrcongress on Tuesday, April 10, 2012 | 4/10/2012

పటాన్‌చెరు/టౌన్/రూరల్, న్యూస్‌లైన్: వైఎస్సార్ సీపీ అధినేత, కడప ఎంపీ వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సోమవారం నాటి జిల్లా పర్యటన ఆద్యంతం ఉత్సాహభరిత వాతావరణంలో సాగింది. జిల్లా సరిహద్దు అయిన లింగంపల్లి చౌరస్తా నుంచి సంగారెడ్డి పట్టణం వరకు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అడుగడుగునా ఘన స్వాగతం పలికారు. ఆయనతో కరచాలనం చేయడానికి, మాట్లాడడానికి జనం ఆసక్తి చూపారు. ఇందుకోసం జగన్‌కు సమీపంలోకి రావడంతో పలుచోట్ల కొంతసేపటివరకు కాన్వాయ్ ముందుకు కదలలేకపోయింది. సమయభావం వల్ల ఆయన చాలా చోట్ల అభివాదం చేస్తూనే ముందుకు సాగారు. జిల్లా ముఖద్వారమైన లింగంపల్లి చౌరస్తాలో పార్టీ అధినేతకు జిల్లా నాయకులు, అభిమానులు సాదర స్వాగతం పలికారు. 

రామచంద్రాపురం, పటాన్‌చెరు మండలాలకు చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉదయం తొమ్మిదిన్నర గంటలకే లింగంపల్లి చౌరస్తాకు చేరుకున్నారు. లింగంపల్లి చౌరస్తా వద్ద వైఎస్సార్ సీపీ జిల్లా పరిశీలకుడు కొండారాఘవరెడ్డి, జిల్లా కన్వీనర్ బట్టి జగపతి, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు సి.అంజిరెడ్డి, కొమురం వెంకట్‌రెడ్డి, టైక్వాండో సంఘం అధ్యక్షుడు వైఎస్సార్‌సీపీ నేత సతీష్‌గౌడ్, ఫ్యాప్సియా రాష్ట్ర మాజీ అధ్యక్షుడు వీఎల్‌ఎన్ రెడ్డి తదితరులు జగన్‌మోహన్‌రెడ్డిని జిల్లాలోకి ఆహ్వానించారు.

నాయకులు రాజశేఖరరెడ్డి, హరిభద్ర, శివరాజ్ తదితరుల ఆధ్వర్యంలో రామచంద్రాపురం అశోక్‌నగర్ చౌరస్తా వద్ద, మహిళా నేతల ఆధ్వర్యంలో రామచంద్రాపురం బస్టాప్ వద్ద జగన్‌కు ఘనస్వాగతం లభించింది. బస్టాప్ వద్ద మహిళలు కొందరు జగన్‌తో మాట్లాడేందుకు ప్రయత్నించగా కార్యకర్తల తాకిడి అధికంగా ఉండటంతో వారు ఇబ్బందులు పడ్డారు. జగన్‌మోహన్‌రెడ్డిని కలుసుకునేందుకు, ఆయనతో కరచాలనం చేసేందుకు ప్రజలు కాన్వాయ్ చుట్టూ చేరిపోయారు. అంతకుముందు రామచంద్రాపురం నెహ్రూ విగ్రహం చౌరస్తా వద్ద స్థానిక పాఠశాలలకు చెందిన చిన్నారులు సైతం జాతీయ రహదారి పక్కన వరుసగా నిలబడి జగన్‌మోహన్‌రెడ్డికి స్వాగతం పలకడం విశేషం.

పటాన్‌చెరులోనూ..
వైఎస్సార్ సీపీ నాయకుడు, అనుభవ వైద్యుల సంఘం ప్రతినిధి డాక్టర్ ప్రభుదాస్ ఆధ్వర్యంలో వందలాది మంది కార్యకర్తలు పటాన్‌చెరు బసవేశ్వర్ విగ్రహం వద్ద జగన్‌మోహన్‌రెడ్డికి స్వాగతం పలికారు. పటాన్‌చెరు అంబేద్కర్ చౌక్ వద్ద పార్టీ నాయకులు నర్రా భిక్షపతి, రామిడి మహీపాల్‌రెడ్డి, రాణమ్మ, ఏకేజీ మహేందర్ ఆధ్వర్యంలో, ఆ పక్కనే ఆనంద్ హోటల్ వద్ద నాయకులు వహీద్ మక్బూల్ బేగ్, బాసిరెడ్డి చంద్రశేఖరరెడ్డి, వెంకటేశ్వర్‌రెడ్డి తదితరులు అధినేతను పటాన్‌చెరులోకి ఆహ్వానించారు. అక్కడి నుంచి నేరుగా కాన్వాయ్ ఇస్నాపూర్ చౌరస్తాకు చేరుకుంది. అక్కడ పార్టీ మండల కన్వీనర్ పట్లోళ్ల నరేందర్‌రెడ్డి, నాయకులు సుధాకర్‌రెడ్డి, కృష్ణారెడ్డి, సత్యనారాయణరెడ్డి, కృష్ణ, జగన్, చిట్టిబాబు తదితరులు స్వాగతం పలికారు. ముందుకు వెళ్తున్న కాన్వాయ్‌ని నరేందర్‌రెడ్డి ఆపి పార్టీ జెండాను ఆవిష్కరించాలని అధినేతను కోరగా వాహనం దిగి వచ్చి జెండాను ఆవిష్కరించారు. సంగారెడ్డికి చెందిన పలువురు నాయకులు గణేశ్ గడ్డ వద్ద జగన్‌మోహన్‌రెడ్డికి స్వాగతం పలికారు. అభిమానులు, పార్టీ నాయకులు పూలదండలు వేసేందుకు ఉత్సుకత చూపగా ఆయన సున్నితంగా తిరస్కరించారు.
Share this article :

0 comments: