తాజా మాజీ ఎమ్మెల్యేలకు గన్‌మెన్ తొలగింపు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » తాజా మాజీ ఎమ్మెల్యేలకు గన్‌మెన్ తొలగింపు

తాజా మాజీ ఎమ్మెల్యేలకు గన్‌మెన్ తొలగింపు

Written By news on Wednesday, April 11, 2012 | 4/11/2012

వైఎస్‌ఆర్ సీపీ నేతలను బెదిరించే వ్యూహం
జనంలోకి వెళ్లకుండా నిలువరించే యత్నం
కాంగ్రెస్, టీడీపీ మాజీలకు కొనసాగుతున్న గన్‌మెన్
ప్రభుత్వ పక్షపాత వైఖరిపై సర్వత్రా విమర్శలు

హైదరాబాద్, న్యూస్‌లైన్: రాష్ట్రంలో 18 శాసనసభ, ఒక పార్లమెంట్ స్థానానికి ఉప ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రభుత్వం అనేక కుయుక్తులకు పాల్పడుతోంది. రైతుల కోసం పదవులు త్యాగం చేసిన తాజా మాజీ ఎమ్మెల్యేలకు భద్రతను తొలగించింది. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వీరంతా ఎన్నికల బరిలోకి దిగుతున్నందున వారిని భయాందోళనలకు గురిచేయాలనే కుతంత్రంలో భాగంగా భద్రతను కుదించిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కర్నూలు జిల్లాకు చెందిన శోభానాగిరెడ్డి, చెన్నకేశవరెడ్డి, కడప జిల్లాకు చెందిన శ్రీనివాసులు, శ్రీకాంత్‌రెడ్డి, అమర్‌నాథ్‌రెడ్డిల భద్రతను మంగళవారం తొలగించారు. వారి వద్ద ఉన్న గన్‌మెన్‌ను వెనక్కి పిలిపించారు. మిగతా 12 మంది తాజా మాజీ ఎమ్మెల్యేల భద్రత తొలగింపుకు ఇప్పటికే నోటీసులు జారీచేశారు. తమకు గన్‌మెన్‌లను తొలగించాలన్న కాంగ్రెస్ ప్రభుత్వ కుట్రపూరిత చర్యను ప్రజలు గమనిస్తున్నారని మాజీ ఎమ్మెల్యేలు గడికోట శ్రీకాంత్‌రెడ్డి, కె.శ్రీనివాసులు పేర్కొన్నారు. తమకు గన్‌మెన్‌ను తొలగించినంత మాత్రాన ఆందోళన చెందటం లేదని.. నిత్యం ప్రజల్లో ఉంటున్న తమకు ప్రజలే కొండంత అండ, శ్రీరామ రక్ష అని అన్నారు. తాజా మాజీ ఎమ్మెల్యేల భద్రత తొలగింపు విషయంలో ప్రభుత్వం పక్షపాతంగా వ్యవహరించిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఉప ఎన్నిక లకు వెళ్లాలంటే కాంగ్రెస్ పార్టీకి ముచ్చెమటలుపోసే పరిస్థితి నెలకొంది. ఇటీవల ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ కుమ్మక్కైనప్పటికీ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కోవూరులో ప్రసన్నకుమార్‌రెడ్డి విజయఢంకా మోగించారు. తమకు జనాదరణ లేదని తెలిసిరావటంతోప్రభుత్వం ఇప్పుడు కుయుక్తులకు పాల్పడుతోందని, ఈ నేపథ్యంలోనే తాజా మాజీ ఎమ్మెల్యేల భద్రతను తొలగించిందని తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజల్లోకి చొరవగా వెళ్లకుండా నియంత్రించే కుట్రలో భాగంగానే ఈ మాజీ ఎమ్మెల్యేల భద్రతను కాంగ్రెస్ సర్కారు తొలగించిందని ఆరోపిస్తున్నారు.

ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధుల భద్రత తొలగింపు విషయంలో ప్రభుత్వ ఆదేశాల మేరకే పోలీసుశాఖ నడుచుకుంటుంది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష టీడీపీలకు చెందిన మాజీ ప్రజాప్రతినిధులకు మాత్రం భద్రత కల్పిస్తూనే ఉన్నారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీచేయనున్న తాజా మాజీ ఎమ్మెల్యేల భద్రతను తొలగించటం కచ్చితంగా కుట్రలో భాగమేనని పలువురు విమర్శిస్తున్నారు. ‘కడప జిల్లా ఉప ఎన్నికల సమయంలోనూ ప్రభుత్వం ఇదే తరహా కుయుక్తులను ప్రదర్శించింది. అప్పుడు రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి, కోడూరు ఎమ్మెల్యే కె.శ్రీనివాసులుకు ఉన్న 2+2 భద్రతను 1+1కు ప్రభుత్వం తగ్గించింది. జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి భద్రతను 3+3 నుంచి 2+2కి కుదించింది. ఆదినారాయణరెడ్డికి ఫ్యాక్షన్ ముఠాల నుంచి ముప్పు పొంచివున్నట్లు నిఘావర్గాలు గతంలో స్పష్టం చేశాయి. ప్రభుత్వం ఎన్ని బెదిరింపులకు దిగినా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు బెదరలేదు. ప్రభుత్వ పన్నాగాలను గమనించిన కడప జిల్లా ప్రజలు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి, వై.ఎస్.విజయమ్మకు భారీ మెజారిటీతో బ్రహ్మరథం పట్టారు. ఇప్పుడు కూడా ఉప ఎన్నికల్లో అన్ని స్థానాలూ మా పార్టీ అభ్యర్థులే గెలుచుకుంటారు’’ అని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఘంటాపథంగా చెప్తున్నారు.

ప్రజలే మాకు రక్ష
శ్రీకాంత్‌రెడ్డి, శ్రీనివాసులు వ్యాఖ్య

ప్రభుత్వం తమ గన్‌మెన్‌ను తొలగించినంత మాత్రాన ఆందోళన చెందటం లేదని.. నిత్యం ప్రజల్లో ఉంటున్న తమకు వారే శ్రీరామ రక్ష అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక సభ్యులు, మాజీ ఎమ్మెల్యేలు గడికోట శ్రీకాంత్‌రెడ్డి, కె.శ్రీనివాసులు పేర్కొన్నారు. వారు మంగళవారం హైదరాబాద్‌లో పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డితో సమావేశమయ్యారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గమైన రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారని.. రాబోయే 18 ఉప ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. కిరణ్ ప్రభుత్వంలో పూర్తిగా పారదర్శకత లోపించిందని, నీతిమాలిన పాలన కొనసాగిస్తోందని దుయ్యబట్టారు. గన్‌మెన్‌ను ఎవరికి కేటాయించాలన్న కనీస ఇంగితజ్ఞానం కూడా లేదని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన వారైతే చాలు.. గల్లీ లీడర్లకు కూడా అవసరం లేకపోయినా గన్‌మెన్‌ను కేటాయిస్తుందని విమర్శించారు. రెండున్నర సంవత్సరాలకు పైగా ప్రజాప్రతినిధులుగా పనిచేసి, రైతులు, రైతుకూలీ కోసం పదవిని తృణప్రాయంగా వదులుకున్న తమకు ఆగమేఘాల మీద గన్‌మెన్‌ను తొలగించటం హేయమైన చర్య అని అభివర్ణించారు. పదవులనే వదులుకున్న తాము గన్‌మెన్‌ను తొలగించటాన్ని పట్టించుకోబోమన్నారు. 
Share this article :

0 comments: