మొబైల్‌లో వైఎస్సార్ సీపీ సమాచారం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » మొబైల్‌లో వైఎస్సార్ సీపీ సమాచారం

మొబైల్‌లో వైఎస్సార్ సీపీ సమాచారం

Written By news on Friday, April 13, 2012 | 4/13/2012



వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సమాచారాన్ని మొబైల్ ఫోన్‌లో తెలుసుకునేందుకు వీలుగా రూపొందించిన ‘ఆండ్రాయిడ్ అప్లికేషన్’ను పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం తన నివాసంలో ప్రారంభించారు. ‘ఇండిస్ సిస్టమ్స్’ సంస్థ సీఈఓ బొమ్మా సురేష్‌రెడ్డి రూపొందించిన ఈ అప్లికేషన్స్ వల్ల పార్టీ కార్య
క్రమాలు, ఫొటోలు, వీడియోలు మొబైల్ ద్వారా ఉచితంగా పొందవచ్చు. మొబైల్‌లో జీపీఆర్‌ఎస్, త్రీజీ సౌకర్యం ఉంటే ఇవి అందుబాటులోకి వస్తాయి. ఆండ్రాయిడ్ ఫోన్ ఉన్న వినియోగదారులు వైఎస్సార్ కాంగ్రెస్ పేరిట ఉన్న ఈ అప్లికేషన్‌ను ఠీఠీఠీ.ఞ్చడ.జౌౌజ్ఛ.ఛిౌఝ ద్వారా ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం ఉంది. భారతదేశంలోనే మొదటిసారిగా ఈ అప్లికేషన్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు నిర్వాహకులు తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని పార్టీని బలోపేతం చేసేందుకు మున్ముందు మరిన్ని ప్రణాళికలు రూపొందించాలని ఈ సందర్భంగా జగన్ సూచించారు. ఈ కార్యక్రమంలో పార్టీ కోశాధికారి పి.ఆర్.కిరణ్‌కుమార్ రెడ్డి, పార్టీ ఐటీ విభాగ కన్వీనర్ చల్లా మధుసూదన్‌రెడ్డి, హర్షవర్ధన్, బొమ్మా శేఖర్‌రెడ్డి, మౌనితారెడ్డి పాల్గొన్నారు.

జగన్ ఉప ఎన్నికల ప్రచారంలో మార్పులు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఉప ఎన్నికల ప్రచార పర్యటనలో స్వల్పంగా మార్పులు జరిగాయి. ముందు అనుకున్న విధంగా ఈ నెల 13 నుంచి కాకుండా 14 నుంచి ఆయన మలి విడత ప్రచారం మొదలు పెడతారని పార్టీ కార్యక్రమాల కోఆర్డినేటర్ తలశిల రఘురాం గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అదనంగా తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా జగన్ మూడు రోజులపాటు పర్యటిస్తారు. తాజా షెడ్యూలు ప్రకారం.. ఈ నెల 14, 15, 16 తేదీల్లో నర్సన్నపేట(శ్రీకాకుళం), 17,18 తేదీల్లో పాయకరావుపేట(విశాఖపట్టణం), 19 నుంచి 22 వరకు పోలవరం, 23, 24 తేదీల్లో నర్సాపురం(పశ్చిమగోదావరి), 25, 26, 27 తేదీల్లో తిరుపతి(చిత్తూరు)లో జగన్‌మోహన్‌రెడ్డి పర్యటించి ఎన్నికల ప్రచారం చేస్తారు.



Share this article :

0 comments: